Sagar By Election : సాగర్ పోరులో నేనే బీజేపీ అభ్యర్థిని, మంచిరోజు కాబట్టే నామినేషన్ వేశా, నివేదిత సెల్ఫ్ అనన్సౌమెంట్
Nagarjuna Sagar By Election : నాగార్జున సాగర్ పోరులో నిలబడే కమలం అభ్యర్థి ఎవరు? అధిష్టానం ప్రకటించకున్నా.. ఆమెకు ఆమె ప్రకటించుకున్నారు. ఏకంగా నామినేషన్ ..
Nagarjuna Sagar By Election : నాగార్జున సాగర్ పోరులో నిలబడే కమలం అభ్యర్థి ఎవరు? అని అంతా వేయికళ్లతో ఎదురుచూస్తుంటే తళుక్కుమని నేనంటూ మెరిసిందామె. అధిష్టానం ప్రకటించకున్నా.. ఆమెకు ఆమె నేనే బీజేపీ అభ్యర్తినంటూ ప్రకటించుకున్నారు. ఏకంగా నామినేషన్ కూడా వేశారు. బీజేపీ తరఫున నామినేషన్ దాఖలు చేశారు నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి భార్య నివేదితా రెడ్డి. వాస్తవానికి ఆమెను బీజేపీ ప్రకటించలేదు. అయినా పోటీలో నిలబడ్డారు.
అధిష్టానం తననే నిలబెడుతోంది. అధికారిక ప్రకటన రాకపోయినా.. బరిలో నిలిచేది తానే అంటున్నారు నివేదిత. బీఫామ్ ఇంకా ఇవ్వకపోయినా.. తనకే రాబోతుందని అంటున్నారు. ముందు నుంచి పార్టీ కోసం పని చేసిన తనకు కాకపోతే.. ఇంకెవరికి ఇస్తారని ప్రశ్నిస్తున్నారామె. మంచిరోజు కాబట్టే నామినేషన్ వేశానని వివరణ కూడా ఇస్తున్నారు.
ఇంత వరకు బాగానే ఉన్నా.. తనకు తానుగా నివేదిత సెల్ఫ్ అనన్సౌమెంట్ ఇచ్చుకున్నా.. అధిష్టానం మనస్సులో ఎవరి పేరుందనేది రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతూనే ఉంది. ఒక వేళ బీజేపీ అధిష్టానం మరో వ్యక్తికి బీ ఫామ్ ఇస్తే.. నివేదిత రెబల్‌గా పోటీలో నిలబడే అవకాశం లేకపోలేదు. గత ఎన్నికల్లోనూ బీజేపీ తరఫున ఆమె పోటీ చేశారు.