UP panchayat election 2021: యూపీలో యోగి ఆధిత్యనాథ్ సర్కారుకు పరీక్ష.. ఏప్రిల్ 15 నుంచి యూపీ వ్యాప్తంగా లోకల్ సమరం షురూ
UP panchayat election 2021: ఆధ్యాత్మిక ప్రాంతమైన ఉత్తర ప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల నగారా మ్రోగింది. ఉత్తరప్రదేశ్ అంతటా జరగబోయే..
UP panchayat election 2021: ఆధ్యాత్మిక ప్రాంతమైన ఉత్తర ప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల నగారా మ్రోగింది. ఉత్తరప్రదేశ్ అంతటా జరగబోయే పంచాయతీ ఎన్నికలు 2021 కు పోలింగ్ తేదీలను రాష్ట్ర ఎన్నికల సంఘం శుక్రవారం ప్రకటించింది. ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారం రాష్ట్రంలోని పంచాయతీలకు ఏప్రిల్ 15, 19, 26, 29 తేదీలలో పోలింగ్ జరుగనుంది. మే 2 న ఫలితాలు ప్రకటించనున్నారు. ఏప్రిల్ 15 న మొదటి దశ పోలింగ్, ఏప్రిల్ 19 న రెండవ దశ, ఏప్రిల్ 26 న మూడవ దశ, ఇంకా ఏప్రిల్ 29 న నాల్గవ దశ పోలింగ్ జరుగుతుంది. మే 2 న ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఎస్‌ఇసి తెలిపింది.
ఇక, మొదటి దశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ఏప్రిల్ 3 నుండి ప్రారంభమవుతుంది. నామినేషన్లను ఏప్రిల్ 7 నుండి 8 వరకు దాఖలు చేయవచ్చు. ఇక, యూపీ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సోషల్ మీడియా ద్వారా తప్పుడు సమాచారాన్ని, ప్రజల్ని తప్పుదోవ పట్టించే మార్గాలని వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఇసి హెచ్చరించింది. సోషల్ మీడియా పోస్టింగ్లపై కఠినంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల సంఘం డీఎం, ఎస్పీలను ఆదేశించింది. దీనికి సంబంధించి త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు తెలిపింది.