AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Virus Second Wave: కోవిడ్ సెకండ్ వేవ్ స్టార్ట్.. భయం వద్దు.. ఈ జాగ్రత్తలు తీసుకోండి అంటున్న నిపుణులు

చైనాలో పుట్టి ప్రపంచాన్ని వణికిస్తుంది కరోనా వైరస్. ఇక మనదేశంలో కూడా ఓ వైపు వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతుంది.. మరోవైపు కొన్ని రాష్ట్రాల్లో సెకండ్ వేవ్ స్టార్ట్..

Corona Virus Second Wave: కోవిడ్ సెకండ్ వేవ్ స్టార్ట్.. భయం వద్దు.. ఈ జాగ్రత్తలు తీసుకోండి అంటున్న నిపుణులు
Corona Virus Second Wave
Surya Kala
|

Updated on: Mar 26, 2021 | 5:54 PM

Share

Corona Virus Second Wave : చైనాలో పుట్టి ప్రపంచాన్ని వణికిస్తుంది కరోనా వైరస్. ఇక మనదేశంలో కూడా ఓ వైపు వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతుంది.. మరోవైపు కొన్ని రాష్ట్రాల్లో సెకండ్ వేవ్ స్టార్ట్ అయ్యింది. మహారాష్ట్ర, ఢిల్లీ, కేరళ వంటి రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. అవును దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. గత 24 గంటల్లో 53,476 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. ఎవరు నమ్మినా నమ్ముకున్నా కోవిడ్ సెకండ్ వేవ్ స్టార్ట్ అయ్యింది అన్నది నిజం. అయితే మొదటి వేవ్ కన్నా పెరుగుదలలో స్పీడ్ ఉంది అయితే కేసుల త్రీవ్రత తక్కువుగా ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు కొన్ని జాగ్రత్తలను కూడా సూచిస్తున్నారు.

మాస్కూని మించిన రక్షణ లేదు.. అందుకని ప్రతి ఒక్కరూ తప్పని సరిగా మాస్క్ ధరించండి.. గుంపులాగా ఉండొద్దు.. సమూహాలకు దూరంగా ఉండండి.. పెళ్లిళ్లు , ఫంక్షన్ల వంటి కార్యక్రమాలలో బాగా జాగ్రత్తగా ఉండండి. ఇక ముఖ్యంగా ఏసీ హాల్స్ వంటి వాటిలో వైరస్ వ్యాప్తి ఎక్కువ.. కనుక వీలైనంత వరకూ ఏసీ హాల్స్ కు దూరంగా ఉండండి.. రోజు ఒక గంట ఎండలో వ్యాయామం చేయండి.. తినే ఆహార పదార్ధాల్లో ఎక్కువగా సీ విటమిన్ ఉండేలా చూసుకోండి. సమయానికి తగిన నిద్ర.. విశ్రాంతి తీసుకోండి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించండి.

అన్నింటకంటె ముఖమైంది..కరోనా వ్యాప్తివేగం పెరిగింది కానీ ప్రమాద స్థాయి పెరగలేదు. డాక్టర్స్ కు, ప్రజలకు అవగాహన పెరిగిందని కనుక కోవిడ్ ప్రమాదకరమైంది అన్న మాటలను మనసు నుంచి తొలగించి ప్రశాంతంగా ఉండండి.. పాజిటివ్ దృక్పధాన్ని అలవర్చుకోండి.

Also Read: టీమిండియా తుఫాన్ వేగం.. 50 ఓవర్లలో 336 పరుగులు.. ఇంగ్లాండ్ ముందు భారీ టార్గెట్..

నాసా యొక్క క్యూరియాసిటీ రోవర్ అంగారక గ్రహం గుండా ప్రయాణిస్తున్న భూమి లాంటి మేఘాల దృశ్యాలు