AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NASA: నాసా యొక్క క్యూరియాసిటీ రోవర్ అంగారక గ్రహం గుండా ప్రయాణిస్తున్న భూమి లాంటి మేఘాల దృశ్యాలు

NASA: అంగారక గ్రహంపై సూక్ష్మీజీవులు స్థిర నివాసం ఏర్పర్చుకునే అనుకూలమైన పర్యావరణ పరస్థితులు ఉన్నాయా..? అనే ప్రశ్నకు సమాధానం వెతికేందుకు మార్టిన్‌ ...

NASA: నాసా యొక్క క్యూరియాసిటీ రోవర్ అంగారక గ్రహం గుండా ప్రయాణిస్తున్న భూమి లాంటి మేఘాల దృశ్యాలు
Nasa's Curiosity
Subhash Goud
|

Updated on: Mar 26, 2021 | 5:32 PM

Share

NASA: అంగారక గ్రహంపై సూక్ష్మీజీవులు స్థిర నివాసం ఏర్పర్చుకునే అనుకూలమైన పర్యావరణ పరస్థితులు ఉన్నాయా..? అనే ప్రశ్నకు సమాధానం వెతికేందుకు మార్టిన్‌ ఉపరితలంపై నాసాకు చెందిన క్యూరియాసిటీ రోవర్ 2012 కాలుమోపింది. రోవర్ 21.92 కిలోమీటర్లు ప్రయాణించి, రెడ్‌ ప్లానెట్‌లో మొత్తం 654,661 చిత్రాలను తీసింది. అయితే రెడ్‌ ప్లానెట్‌లోకి అడుగుపెట్టిన రోవర్‌ పైభాగంలో ఉన్న నావిగేషన్‌ కెమెరాల ద్వారా వీడియోచిత్రాలను తీసింది. ఈ వీడియోను మార్చి 19, 2021న నార్త్‌ కరోలినా స్టేట్‌ యూనివర్సిటీ నుంచి డాక్టర్‌ పాల్‌ బైర్న్‌ తన ట్విట్టర్‌ ఖాతాలో షేర్‌ చేశారు. ఆకాశంలో మేఘాలు ప్రయాణిస్తున్నాయంటూ పేర్కొన్నారు. అయితే డాక్టర్‌ బైర్న్‌ మాట్లాడుతూ.. ఈ వీడియో మార్స్‌ క్యూరియాసిటీ యొక్క కుడి నావిగేషన్‌ కెమెరా తీసిన ఎనిమిది చిత్రాలను పేర్కొన్నారు. కాగా, నాసా క్యూరయాసిటీ రోవర్‌ 2.43 జీబీ ఫైలు పరిమాణాన్నికలిగి ఉన్న మార్స్‌ యొక్క అత్యధిక రిజల్యూషన్‌ కలిగిన అంగారక సమగ్ర స్వరూపాన్ని ఆవిష్కరించే 1000 ఫోటోలను విడుదల చేసింది. 360 డిగ్రీల కోణంలో ఈ చిత్రాలు ఉన్నాయి.

అయితే రోవర్‌ వ్యక్తిగత షాట్లను తీసేందుకు నాలుగు రోజులలో ఆరున్నర గంటలకుపైగా అవసరం. మా టీమ్‌లో చాలా మంది టర్కీ అందాలను ఆస్వాదిస్తుండగా, క్యూరియాసిటీ అంగారక గ్రహ ఆనవాళ్లను కళ్లకు కడుతూ ఈ అద్భుతమైన చిత్రాలను అందించదిందని క్యూరియాసిటీ రోవర్ మిషన్‌కు నాయకత్వం వహించిన సంబంధిత ప్రాజెక్ట్ శాస్త్రవేత్త అశ్విన్ వాస్వాడ పేర్కొన్నారు. 2013 సంవత్సరంలోనే రోవర్ మాస్ట్‌క్యామ్ కెమెరాలతో పాటు నావిగేషన్ కెమెరాలను ఉపయోగించి 1.3 బిలియన్-పిక్సెల్ పనోరమా చిత్రాన్ని రూపొందించింది.

క్యూరియాసిటీ ప్రయాణం

అయితే క్యూరియాసిటీ అంగారక గ్రహంపై ప్రయాణిస్తున్న క్రమంలో కొన్ని వందలాది సంవత్సరాల కిందట ఓ సరస్సుతో పాటు సూక్ష్మజీవుల జీవనానికి అనుకూలమైన వాతావరణం ఉందని శాస్త్రవేత్తలు కొనుగొన్నారు. గత సంవత్సరం అక్టోబర్‌ నెలలో నాసా రెడ్‌ ప్లానెట్‌పై క్యూరియాసిటీ తీసిన సెల్ఫీని అలాగే అంగారక గ్రహంపై పురాతన ఒయాసిస్ చిత్రాన్ని వెల్లడించిన క్రమంలోనూ ఇవే అంచనాలు వెల్లడయ్యాయి. అంగారక గ్రహంపై సూక్ష్మజీవుల ఆనవాళ్లను అందించేలా క్యూరియాసిటీ కొత్త సాక్ష్యాలను కూడా కనుగొంది, ఉప్పగా, నిస్సారమైన చెరువులు గతంలో ఉండేవని, క్రమంగా ఇవి ఎండిపోయాయనే సంకేతాలను పసిగట్టింది.

Follow Us
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
తులసి కుండీలో చీమలు.. మొక్క ఎండిపోకుండా కాపాడే సీక్రెట్ ఇదే..
తులసి కుండీలో చీమలు.. మొక్క ఎండిపోకుండా కాపాడే సీక్రెట్ ఇదే..