AP Corona Updates: ఇంట్లో ‘భజన’..వారి కొంపముంచింది.. ఓ కుటుంబంలో 21 మందికి సోకిన కరోనా

ఏపీలో కరోనా కేసులు మళ్ళీపెరుగుతున్నాయి. గతంలో మాదిరిగానే తూర్పు గోదావరి జిల్లాలో కరోనా కలకలం రేపింది. తొండంగి మండలంలోని ఓ కుటుంబంలో 21 మందికి కరోనా సోకింది.

AP Corona Updates: ఇంట్లో 'భజన'..వారి కొంపముంచింది.. ఓ కుటుంబంలో 21 మందికి సోకిన కరోనా
Corona-Virus
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 26, 2021 | 8:17 PM

ఏపీలో కరోనా కేసులు మళ్ళీపెరుగుతున్నాయి. గతంలో మాదిరిగానే తూర్పు గోదావరి జిల్లాలో కరోనా కలకలం రేపింది. తొండంగి మండలంలోని ఓ కుటుంబంలో 21 మందికి కరోనా సోకింది. తూర్పుగోదావరి జిల్లా తొండంగిలో కరోనా ఒక్కసారిగా అలజడి సృష్టించింది. ఉమ్మడి కుటుంబాల్లో ఏకంగా 21 మందికి ఒకేసారి పాజిటివ్‌గా తేలటంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. తొండంగి గ్రామానికి చెందిన ఓ ఇంట్లో నిర్వహించిన భజనలో మరో నాలుగు కుటుంబాలు పాల్గొన్నాయి. వీరిలో కొందరికి జ్వరం రావడంతో కొవిడ్ పరీక్షలు నిర్వహించారు.. దీంతో 21మందికి పాజిటివ్ తేలింది.

సుమారు 25 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 21 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. కుటుంబ సభ్యులకు చికిత్స అందిస్తున్నారు. వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు.. ఈ 21మందికి సన్నిహితంగా ఉన్నవారిని గుర్తించే పనిలో పడ్డారు. ఊరంతా బ్లీచింగ్‌ చేయడంతోపాటు ప్రజలందరినీ అప్రమత్తం చేస్తూ..కోవిడ్‌పై అవగాహన కల్పిస్తున్నారు.

ఏపీలో ప్రమాదకరంగా పెరుగుతున్న కేసులు:

ఏపీలో కరోనా కేసుల సంఖ్య వెయ్యికి చేరువగా ఉంది. రోజు రోజుకు రెట్టింపు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో 24 గంటల్లో కొత్తగా 984 కరోనా కేసులు నమోదయినట్లు వైద్యారోగ్య శాఖ శుక్రవారం రిలీజ్ చేసిన బులిటెన్‌లో తెలిపింది. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,96,863కి చేరింది. ఇందులో 4,145 యాక్టివ్ కేసులు ఉండగా.. 8,85,515 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు నిన్న వైరస్ కారణంగా రాష్ట్రంలో చిత్తూరు, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. దీనితో మొత్తం మరణాల సంఖ్య 7203కు చేరుకుంది. ఇక గురువారం 306 మంది కరోనా నుంచి కోలుకుని  ఆరోగ్యవంతులు అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,46,16,201 సాంపిల్స్‌ను పరీక్షించారు.

Also Read: నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం.. రూ.6 కోట్ల లాటరీ టికెట్‌ అలా ఇచ్చేసింది.. మీరు కచ్చితంగా హ్యాట్సాఫ్ చెబుతారు

చేపను కొనుగోలు చేసిన వ్యక్తి.. దాన్ని కటింగ్ చేయిస్తుండగా కడుపులో షాకింగ్ దృశ్యం

ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఇలా చేయండి..
బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఇలా చేయండి..
వివాదాలు పరిష్కరించుకునేందుకు ఐటీ శాఖ న్యూ స్కీమ్..!
వివాదాలు పరిష్కరించుకునేందుకు ఐటీ శాఖ న్యూ స్కీమ్..!
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
ఆసీస్‌పై సెన్సేషనల్ సెంచరీ.. నితీష్ రెడ్డికి భారీ నజరానా
ఆసీస్‌పై సెన్సేషనల్ సెంచరీ.. నితీష్ రెడ్డికి భారీ నజరానా
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!