బీజేపీ ఎంపీ కుమార్తెకు కరోనా పాజిటివ్
దేశంలో కరోనా వైరస్ దావానలంలా విస్తరిస్తోంది. తాజాగా బీజేపీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి కుమార్తెకు కరోనా పాజిటివ్‌గా తేలినట్లు సమాచారం. ఆమెతో పాటుగా ఇద్దరు పిల్లలు...
కోవిడ్-19 : మహమ్మారి గంటగంటకు విజృంభిస్తూ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. దేశవ్యాప్తంగా వైరస్ బాధితుల సంఖ్య పెరిగిపోతుండటంతో ప్రధాని నరేంద్రమోదీ దేశంలో ఏప్రిల్ 14 వరకు లాక్‌డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా బీజేపీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి కుమార్తెకు కరోనా పాజిటివ్ వచ్చినట్లుగా తెలుస్తోంది.
బీజేపీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి జీఎం సిద్దేశ్వర కుమార్తె అశ్వినికి కరోనా పాజిటివ్ వచ్చింది. కర్నాటక ఎంపీ ద్దేశ్వర.. దేవంగిరి నియోజకవర్గం నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అశ్విని ఈ నెల 20వ తేదీన గుయానా నుంచి న్యూయార్క్, ఢిల్లీ మీదుగా బెంగళూరుకు చేరుకుంది. అయితే ఆమెకు కరోనా టెస్టులు నిర్వహించగా.. కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. అశ్విని ఇద్దరు పిల్లలు కూడా ఆమెతో పాటే బెంగళూరుకు వచ్చారు. ఇద్దరు పిల్లల వైద్య నివేదిక రావాల్సి ఉంది. ఎంపీ సిద్దేశ్వరకు వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా నెగిటివ్ వచ్చింది. అశ్విని ఓ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్నారు.