AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coronavirus: ప్రపంచ దేశాలపై పంజా విసురుతోన్న కరోనా.. వివిధ దేశాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలివే..

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ మళ్లీ కోరలు చాస్తోంది. పలు దేశాల్లో రూపాలు మార్చుకుంటూ తన ప్రతాపాన్ని చూపిస్తూ లక్షల మందిని బలితీసుకుంటోంది.

Coronavirus: ప్రపంచ దేశాలపై పంజా విసురుతోన్న కరోనా.. వివిధ దేశాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలివే..
Coronavirus
Basha Shek
|

Updated on: Jan 08, 2022 | 2:23 PM

Share

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ మళ్లీ కోరలు చాస్తోంది. పలు దేశాల్లో రూపాలు మార్చుకుంటూ తన ప్రతాపాన్ని చూపిస్తూ లక్షల మందిని బలితీసుకుంటోంది.  ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 30 కోట్ల మందికి పైగా ఈ వైరస్ బారిన పడ్డారు.    ఇక కొత్త వేరియంట్​ ఒమిక్రాన్​​విజృంభణతో దాదాపు అన్ని దేశాల్లో వైరస్​ బారినపడుతున్న వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. శుక్రవారం ఒక్కరోజే ప్రపంచవ్యాప్తంగా 25,19,837 మందికి వైరస్​ సోకింది. 7,214 మంది వైరస్‌కు బలయ్యారు. కాగా సుమారు 6.89 లక్షల మంది కరోనా నుంచి కోలుకున్నారు. కాగా ఇప్పటివరకు మొత్తం కరోనా మరణాల సంఖ్య 54, 89, 506కు చేరింది. ఇక అగ్రరాజ్యం అమెరికాలో వైరస్​ విలయం కొనసాగుతోంది. శుక్రవారం మరో 7,27, 863 మందికి వైరస్​పాజిటివ్‌గా తేలింది. 1843 మంది వైరస్‌ కారణంగా మృత్యువాత పడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,02,91,979కి చేరింది. మరణాలు 8, 55, 843కు చేరాయి. కాగా కొత్తగా నమోదవుతోన్న కేసుల్లో ఒమిక్రాన్​ వేరియంట్​ కేసులే 95 శాతం మేర ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

నిండుతున్న ఆస్పత్రులు.. కొత్త కేసులతో ఆసుపత్రుల్లో చేరుతున్నవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం లక్షకు పైగా చికిత్సపొందుతున్నట్లు అంచనా. ఫ్రాన్స్‌లో ఒమిక్రాన్​ సహా మరో కొత్త వేరియంట్ వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది. డెల్టా, ఒమిక్రాన్​కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఒక్కరోజే 2, 61, 481 కేసులు బయటపడ్డాయి. 204 మంది చనిపోయారు. దీంతో ఇప్పటివరకు మొత్తం కేసులు 1,11 83, 238కి చేరాయి. వైరస్‌తో చనిపోయిన వారి సంఖ్య 1, 25, 013కి చేరింది. ఇటలీలో కొత్తగా 2 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. 198 మంది ప్రాణాలు కోల్పోయారు. 46వేల మంది వైరస్​ నుంచి కోలుకున్నారు. మొత్తం కేసుల సంఖ్య 69, 75, 465కు చేరింది. మొత్తం 1,14, 207 మంది మరణించారు. బ్రిటన్‌లోనూ కొత్త కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఒక్క రోజే లక్షా 79, 756 మందికి వైరస్​ సోకింది. 231 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య కోటి 40 లక్షలు దాటింది. అర్జెంటీనాలోనూ వైరస్​ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. కొత్తగా 1,09,608 కేసులు బయటపడ్డాయి. 40 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ దేశంలో మొత్తం కేసుల సంఖ్య 6లక్షల 25వేల 303కు చేరింది. Also Read:

PM Security Breach: ఆ అద్భుత అవకాశాన్ని మోడీ కోల్పోయారు.. ప్రధాని పంజాబ్‌ పర్యటనపై అఖిలేష్ సెటైర్లు..

Anantapur: మహిళా కానిస్టేబుల్‌ను బలిగొన్న లైంగిక వేధింపులు.. సూసైడ్‌ నోట్‌లో షాకింగ్ విషయాలు..

Jason Roy: తండ్రైన ఇంగ్లండ్ స్టార్‌ క్రికెటర్‌.. కుమారుడికి ఏం పేరు పెట్టాడంటే..

Follow Us
యాపిల్‌ ఫోన్‌ మినీ సిరీస్‌పై షాకింగ్ నిర్ణయం
యాపిల్‌ ఫోన్‌ మినీ సిరీస్‌పై షాకింగ్ నిర్ణయం
8 గంటలు నిద్రపోయినా ఉదయాన్నే అలసటగా ఉంటుందా? కారణం ఇదే..!
8 గంటలు నిద్రపోయినా ఉదయాన్నే అలసటగా ఉంటుందా? కారణం ఇదే..!
హైసెన్స్‌ ఏ10, ఏ10 అల్ట్రా ఫోన్‌ డిస్‌ప్లే గురించి తెలుసా
హైసెన్స్‌ ఏ10, ఏ10 అల్ట్రా ఫోన్‌ డిస్‌ప్లే గురించి తెలుసా
పిల్లల నుండి పెద్దల వరకు ఇష్టపడే హెల్తీ ఫ్రూట్ కస్టర్డ్ సలాడ్
పిల్లల నుండి పెద్దల వరకు ఇష్టపడే హెల్తీ ఫ్రూట్ కస్టర్డ్ సలాడ్
కేవలం సినిమా స్నాక్ మాత్రమే కాదు.. పాప్‌కార్న్‌తో ఈ లాభాలు తెల్సా
కేవలం సినిమా స్నాక్ మాత్రమే కాదు.. పాప్‌కార్న్‌తో ఈ లాభాలు తెల్సా
ఎలుక తోక ఎందుకు పొడవు ఉంటుంది? దీంతో ఏమైనా ఉపయోగం ఉంటుందా?
ఎలుక తోక ఎందుకు పొడవు ఉంటుంది? దీంతో ఏమైనా ఉపయోగం ఉంటుందా?
నోట్లో వేస్తే కరిగిపోయేలా డబల్ కా మీఠా.. పక్కా కొలతలతో ఇలా చేయండి
నోట్లో వేస్తే కరిగిపోయేలా డబల్ కా మీఠా.. పక్కా కొలతలతో ఇలా చేయండి
ఒక వ్యక్తి పేరుపై రెండు గ్యాస్ కనెక్షన్లు తీసుకోవచ్చా..?
ఒక వ్యక్తి పేరుపై రెండు గ్యాస్ కనెక్షన్లు తీసుకోవచ్చా..?
ఈ యాప్స్‌ ఉంటే గూగుల్ మ్యాప్స్ అక్కర్లేదు
ఈ యాప్స్‌ ఉంటే గూగుల్ మ్యాప్స్ అక్కర్లేదు
జబర్దస్త్‌లోకి ఆ స్టార్ కమెడియన్ల రీఎంట్రీ.. రష్మీ ఎమోషనల్
జబర్దస్త్‌లోకి ఆ స్టార్ కమెడియన్ల రీఎంట్రీ.. రష్మీ ఎమోషనల్