AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jason Roy: తండ్రైన ఇంగ్లండ్ స్టార్‌ క్రికెటర్‌.. కుమారుడికి ఏం పేరు పెట్టాడంటే..

ఇంగ్లండ్‌ స్టార్‌ క్రికెటర్‌ జేసన్‌ రాయ్‌ తండ్రిగా ప్రమోషన్‌ పొందాడు. అతన సతీమణి ఎల్లీ మూరే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈనేపథ్యంలో

Jason Roy: తండ్రైన ఇంగ్లండ్ స్టార్‌ క్రికెటర్‌.. కుమారుడికి ఏం పేరు పెట్టాడంటే..
Jason Roy Family
Basha Shek
|

Updated on: Jan 08, 2022 | 11:40 AM

Share

ఇంగ్లండ్‌ స్టార్‌ క్రికెటర్‌ జేసన్‌ రాయ్‌ తండ్రిగా ప్రమోషన్‌ పొందాడు. అతన సతీమణి ఎల్లీ మూరే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈనేపథ్యంలో తాము అమ్మానాన్నలమయ్యామంటూ తమ ఆనందాన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకున్నారు రాయ్‌ దంపతులు. ఈ సందర్భంగా భార్యాబిడ్డలతో కలిసి ఉన్న ఫొటోలను షేర్‌ చేస్తూ ‘జనవరి 5, 2022న మాకు బాబు పుట్టాడు. మా ఫ్యామిలీలోకి స్వాగతం చిన్ని తండ్రీ.. మాకు చాలా గర్వంగా ఉంది. సంతోషంతో మా మనసు నిండిపోయింది’ అని ఎమోషనల్‌ అయ్యాడు జేసన్‌. ఈక్రమంలో తోటి ఆటగాళ్లు, అభిమానులు, నెటిజన్లు రాయ్ దంపతులకు శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నారు.

సన్‌రైజర్స్‌ తరఫున.. ఇంగ్లండ్‌ జట్టులో డ్యాషింగ బ్యాటర్‌గా గుర్తింపు తెచ్చుకున్న జేసన్‌ ఐపీఎల్‌లో హైదరాబాద్‌ సన్‌ రైజర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్‌-2021 సీజన్‌లో డేవిడ్‌ వార్నర్‌ స్థానంలో జట్టులోకి వచ్చిన రాయ్‌ మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఇక టీ20 వరల్డ్‌కప్‌-2021 టోర్నీలో భాగంగా జేసన్‌ రాయ్‌ చివరిసారిగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఆడాడు. ఇక జేసన్‌ వ్యక్తిగత విషయానికి వస్తే.. 2017 అక్టోబరులో గర్ల్‌ఫ్రెండ్‌ ఎల్లీని వివాహమాడి జీవిత భాగస్వామిగా మార్చుకున్నారు. 2019లో ఈ జంటకు కూతురు ఎవర్లీ జన్మించింది. ఇప్పుడు కుమారుడు జన్మించాడు. కాగా తమ కుమారుడికి ఎలోసీ అని నామకరణం చేశారు రాయ్‌ దంపతులు.

View this post on Instagram

A post shared by Jason Roy (@jasonroy20)

View this post on Instagram

A post shared by Jason Roy (@jasonroy20)

Also Read:

Sonusood: కీలక నిర్ణయం తీసుకున్న సోనూసూద్‌.. ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన..

Nidhhi Agerwal: ఆ స్టార్‌ హీరోతో ప్రేమాయణం సాగిస్తోన్న ఇస్మార్ట్‌ బ్యూటీ!.. త్వరలోనే పెళ్లి?

Pushpa: ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌.. పుష్ప ఓటీటీ వెర్షన్‌లో అదనపు సీన్లు.. సామ్‌ స్పెషల్‌ సాంగ్‌లోనూ న్యూ విజువల్స్‌..