AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anantapur: మహిళా కానిస్టేబుల్‌ను బలిగొన్న లైంగిక వేధింపులు.. సూసైడ్‌ నోట్‌లో షాకింగ్ విషయాలు..

ఒక వైపు తెలంగాణలో ఖద్దర్‌ చొక్కాలను అడ్డంపెట్టుకొని అరాచకాలు కొనసాగించిన దారుణం సంచలనం సృష్టిస్తుంటే.. రాయల సీమలో మాత్రం.. పొలిటికల్‌ నేతలను అడ్డు పెట్టుకొని.. ప్రభుత్వ ఉద్యోగి దారుణాలకు పాల్పడ్డ ఘటన వెలుగు చూసింది.

Anantapur: మహిళా కానిస్టేబుల్‌ను బలిగొన్న లైంగిక వేధింపులు.. సూసైడ్‌ నోట్‌లో షాకింగ్ విషయాలు..
Representative Image
Basha Shek
|

Updated on: Jan 08, 2022 | 1:01 PM

Share

ఒక వైపు తెలంగాణలో ఖద్దర్‌ చొక్కాలను అడ్డంపెట్టుకొని అరాచకాలు కొనసాగించిన దారుణం సంచలనం సృష్టిస్తుంటే.. రాయల సీమలో మాత్రం.. పొలిటికల్‌ నేతలను అడ్డు పెట్టుకొని.. ప్రభుత్వ ఉద్యోగి దారుణాలకు పాల్పడ్డ ఘటన వెలుగు చూసింది. అనంతపురం జిల్లా లేపాక్షిలో ఓ మహిళా పోలీస్‌ ఆత్మహత్య తీవ్ర కలకలం రేపుతోంది. సావిత్రి అనే మహిళ రెండు రోజుల క్రితం చెరువులో పడి ఆత్మహత్య చేసుకుంది. అయితే.. కుటుంబ సభ్యులు మాత్రం కడుపు నొప్పి భరించలేక చనిపోయిందని అనుకున్నారు. రెండు రోజుల తర్వాత సావిత్రి హ్యాండ్‌ బ్యాగ్‌లో దొరికిన సూసైడ్‌ లెటర్‌లో ఉన్న నిజాలు వెలుగులోకి వచ్చాయి. సెక్రటరీ కెంచరాయుడి వేధింపుల వల్లనే తాను చనిపోతున్నట్టు ఈ లేఖలో రాశారు మృతురాలు సావిత్రి. తనను రేప్‌ చేసి చంపాలని చూశారని అందులో పేర్కొంది. దీంతో అలర్ట్‌ అయిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై సీరియస్‌గా స్పందించిన పోలీసు అధికారులు.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. సావిత్రి చావుకు సెక్రటరీ కెంచరాయుడు వేధింపులే కారణమన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

సూసైడ్‌ నోట్‌ కలకలం.. కాగా చిలమత్తూరు మండలం దేమ కేతేపల్లి గ్రామ సచివాలయ మహిళా పోలీస్ గా విధులు నిర్వహిస్తున్న సావిత్రి ఈ నెల 4న లేపాక్షి పెద్ద చెరువులో పడి ఆత్మహత్యకు పాల్పడింది. అయితే సావిత్రి కడుపునొప్పి తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్టు బంధువులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కథ ఇంతటితో క్లోజ్ అయిందని చాలామంది అనుకున్నారు. కానీ సడన్ గా సూసైడ్ నోట్ దొరకడం తీవ్ర కలకలం రేపింది. సచివాలయం లో పనిచేసే ఓ ఉద్యోగి లో ఆమె ఫోన్ ట్రాప్ చేసి వేధింపులకు గురి చేస్తున్నారంటూ లెటర్ రాసుకుంది సావిత్రి. అంతే కాదు తనను రేప్ చేసి చంపాలని చూస్తున్నారని అందులో పేర్కొంది. ఈ లెటర్ దొరకగానే.. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇది ఇలా ఉంటే సావిత్రి రాసిన లెటర్‌తో స్థానిక సచివాలయ ఉద్యోగుల్లో టెన్షన్ నెలకొంది. కాగా ఈ సూసైడ్ నోట్‌ పై పోలీసులు స్పందించారు. పూర్తి విచారణ జరిపి వేధింపులకు పాల్పడిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

Also Read:

Jason Roy: తండ్రైన ఇంగ్లండ్ స్టార్‌ క్రికెటర్‌.. కుమారుడికి ఏం పేరు పెట్టాడంటే..

Sonusood: కీలక నిర్ణయం తీసుకున్న సోనూసూద్‌.. ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన..

Nidhhi Agerwal: ఆ స్టార్‌ హీరోతో ప్రేమాయణం సాగిస్తోన్న ఇస్మార్ట్‌ బ్యూటీ!.. త్వరలోనే పెళ్లి?