Earthquake: భారీ భూకంపం.. రిక్టర్‌ స్కేలుపై తీవ్రత 6.9 నమోదు..!

Earthquake: ఈ మధ్య కాలంలో భూకంపాలు భారీగా చోటు చేసుకుంటున్నాయి. మనదేశంలో సంభవించే భూకంపాలు పెద్దగా నష్టం ఉండకపోగా, ఇతర దేశంలో సంభవించే..

Earthquake: భారీ భూకంపం.. రిక్టర్‌ స్కేలుపై తీవ్రత 6.9 నమోదు..!
Earthquake
Follow us

|

Updated on: Jan 08, 2022 | 11:36 AM

Earthquake: ఈ మధ్య కాలంలో భూకంపాలు భారీగా చోటు చేసుకుంటున్నాయి. మనదేశంలో సంభవించే భూకంపాలు పెద్దగా నష్టం ఉండకపోగా, ఇతర దేశంలో సంభవించే భూకంపాలతో భారీ నష్టం సంభవిస్తుంటుంది. ఇక తాజాగా చైనాలోని కింగ్‌ హై ప్రావిన్స్‌లో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 6.9 నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. కింగ్‌హై ప్రావిన్స్‌లోని మెన్యువాన్‌ కౌంటీలో భూకంపం వచ్చిందని స్థానిక మీడియా వెల్లడించింది.. భూకంప కేంద్రాన్ని 37.77 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 101.26 డిగ్రీల తూర్పు రేఖాంశంలో పరిశీలించారు. జిన్హువా న్యూస్ ఏజెన్సీ ప్రకారం.. శనివారం తెల్లవారుజామున అంటే 1:45 గంటలకు (బీజింగ్ టైమ్) 10 కి.మీ లోతులో భూకంపం సంభవించింది.

ప్రావిన్షియల్ రాజధాని జినింగ్ సిటీలో బలమైన ప్రకంపనలు వచ్చాయి. అయితే భూకంప తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రకంపనలు అధికంగా నమోదైనట్లు అధికారులు తెలిపారు. భూకంపం రాగానే అక్కడి ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు తీశారు. జంతువులు సైతం పరుగులు తీశాయి. ఆ దృశ్యాలు సీసీటీవీ పుటేజీలో రికార్డు అయ్యాయి. కాగా, 2010లో కూడా భారీ భూకంపం సంభవించింది. 6.9 భూకం తీవ్రతతో భూప్రకంపనలు రావడం వల్ల సుమారు 3 వేల మంది వరకు మరణించినట్లు అధికారులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

Dangerous Area: భూమి మీద అత్యంత ప్రమాదకరమైన ప్రదేశం ఇదే.. ఇప్పటి వరకు వెళ్లిన వందలాది విమానాలు తిరిగి రాలేదట..!

Pandem Kollu: పల్లెల నుంచి పార్శిల్‌లో పట్టణాలకు పందెం కోళ్లు.. ఆన్‌లైన్‌లో జోరుగా గిరాకీ..!

Latest Articles
స్లోగా మారిన ఫోన్‌తో చిరాకు లేస్తుందా.? ఈ ట్రిక్స్‌ ఫాలో అవ్వండి
స్లోగా మారిన ఫోన్‌తో చిరాకు లేస్తుందా.? ఈ ట్రిక్స్‌ ఫాలో అవ్వండి
తెలంగాణ ఈఏపీసెట్‌ 2024 టాప్‌ 10 ర్యాంకర్లు వీరే.. సత్తాచాటిన ఏపీ!
తెలంగాణ ఈఏపీసెట్‌ 2024 టాప్‌ 10 ర్యాంకర్లు వీరే.. సత్తాచాటిన ఏపీ!
భారీగా పెరిగిన రిషి సునక్‌ సంపద.. ఏడాదిలో ఎన్ని కోట్లో తెలుసా?
భారీగా పెరిగిన రిషి సునక్‌ సంపద.. ఏడాదిలో ఎన్ని కోట్లో తెలుసా?
క్రెడిట్ కార్డు బిల్లు ఎప్పుడు కట్టాలో మీరే నిర్ణయించుకోవచ్చు..
క్రెడిట్ కార్డు బిల్లు ఎప్పుడు కట్టాలో మీరే నిర్ణయించుకోవచ్చు..
TSPSC గ్రూప్‌ 4 ఉద్యోగాలకు 1:3 నిష్పత్తిలో ధ్రువపత్రాల పరిశీలన
TSPSC గ్రూప్‌ 4 ఉద్యోగాలకు 1:3 నిష్పత్తిలో ధ్రువపత్రాల పరిశీలన
ఫుట్‌బోర్డ్ ప్రయాణం ప్రమాదం అనేది ఇందుకే.. మహిళ నిండు ప్రాణం..
ఫుట్‌బోర్డ్ ప్రయాణం ప్రమాదం అనేది ఇందుకే.. మహిళ నిండు ప్రాణం..
తెలంగాణ ఎంసెట్ ఫలితాలలో టాపర్ ఏపీ కుర్రాడు.. అతని లక్ష్యం ఇదే..
తెలంగాణ ఎంసెట్ ఫలితాలలో టాపర్ ఏపీ కుర్రాడు.. అతని లక్ష్యం ఇదే..
మైండ్ బ్లాక్ చేస్తున్న అపాచీ బ్లాక్ ఎడిషన్ బైక్స్..
మైండ్ బ్లాక్ చేస్తున్న అపాచీ బ్లాక్ ఎడిషన్ బైక్స్..
కౌంటింగ్ ఏర్పాట్లకు ఈసీ చర్యలు.. ఈ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి..
కౌంటింగ్ ఏర్పాట్లకు ఈసీ చర్యలు.. ఈ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి..
లక్షకు చేరువలో వెండి ధర.. మరి బంగారం ధర ఎంతో తెలుసా?
లక్షకు చేరువలో వెండి ధర.. మరి బంగారం ధర ఎంతో తెలుసా?