AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dolo 650: ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతున్న డోలో 650 ట్యాబ్లెట్.. ఎందుకో తెలిస్తే నవ్వాపుకోలేరు..

Dolo 650 Trending: దేశంలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గత రికార్డులను తిరగరాస్తూ..

Dolo 650: ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతున్న డోలో 650 ట్యాబ్లెట్.. ఎందుకో తెలిస్తే నవ్వాపుకోలేరు..
Dolo
Shaik Madar Saheb
|

Updated on: Jan 08, 2022 | 1:58 PM

Share

Dolo 650 Trending: దేశంలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గత రికార్డులను తిరగరాస్తూ.. రోజూవారి కేసుల సంఖ్య లక్షన్నరకు చేరువయ్యాయి. దీంతోపాటు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు సైతం భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో థర్డ్ వేవ్ ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందోనని అంతటా ఆందోళన నెలకొంది. అయితే.. కరోనా సెకండ్ వేవ్‌లో ఆసుపత్రుల్లో బెడ్లు, సౌకర్యాలు లేక, మరోవైపు కరోనా చికిత్సలో ఉపయోగించే మెడిసిన్ దొరకక.. ఆక్సిజన్ లభించక లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో సెకండ్ వేవ్‌లో ఎక్కువగా సొంత వైద్యం విషయం ఎక్కువగా చర్చలోకి వచ్చింది. ఇలా చేస్తే ఆరోగ్యానికి మంచిదంటూ.. అలా చేస్తే కరోనా రాదంటూ చాలామంది సోషల్ మీడియాలో పోస్టులను షేర్ చేశారు. అయితే ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదని వైద్య నిపుణులు సూచిస్తూ వచ్చారు. ఈ క్రమంలో వారి సలహాలను పాటించిన వాళ్లు కొందరైతే.. తమకు తోచింది చేసుకుంటూ పోయినవాళ్లు మరికొందరు ఉన్నారు. అయితే.. థర్డ్ వేవ్ నేపథ్యంలో మళ్లీ ఆందోళన పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో జ్వరం, ట్యాబెట్లు, సిరప్‌ల అమ్మకాలు అమాంతం పెరిగిపోయాయి. చాలామంది డోలో 650 లాంటి ట్యాబ్లెట్లను ముందే విక్రయిస్తున్నారు. దీంతో డోలో 650 మాత్ర ట్విటర్‌ ట్రెండింగ్‌గా మారింది. కొందరు యూజర్లు ఫన్నీగా కామెంట్లు చేస్తుంటే.. మరికొందరు సీరియస్‌ కోణంలోనూ ట్విట్టర్‌లో దుమ్మురేపుతున్నారు.

దీంతో ట్విట్టర్ కాస్త డోలో 650 మేనియాగా మారింది. ప్రస్తుతం ట్విట్టర్లో #Dolo650 అనే హ్యాష్ ట్యాగ్ షేక్‌ చేస్తోంది. ప్రమోషనో లేక యూజర్ల సరదానో తెలిదూగానీ.. నిన్నటి నుంచి ట్విటర్‌లో పోస్టులు దుమ్మురేపుతున్నాయి. జలుబు, జ్వరం, గొంతు నొప్పి, దగ్గు, ఒళ్లు నొప్పులు.. ఎలాంటి లక్షణం కనిపించినా డోలో మాత్ర వేసుకుంటే సరిపోతుందని భ్రమలో చాలామంది మునిగిపోయారు. కొవిడ్‌ టెస్టులకు వెళ్లకుండానే ఈ మాత్రతో తగ్గిపోతుందని కొందరు డోలో మేనియాలో మునిగితే.. మరికొందరు ఇది మంచిది కాదంటూ సూచనలు చేస్తున్నారు. దీనిపై యూజర్లు రెండుగా విడిపోయి.. ఎవరికి వారే ట్వీట్లు చేస్తున్నారు. దీంతో ట్విటర్‌ టాప్‌ ట్రెండింగ్‌లో #Dolo650 హ్యాష్‌ట్యాగ్ హల్‌చల్ చేస్తోంది.

అందులో కొన్ని పోస్టులు ఇప్పుడు చూద్దాం..

ఐదు ప్రాబ్లమ్స్‌కి ఒకటే డోలో అంటూ ఒక యూజర్ ట్విట్ చేశాడు. తలనొప్పి, శరీర నొప్పి, పంటి నొప్పి, జ్వరం, జలుబు వీటికి డోలోనే మందు అంటూ పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన ఫన్నీ మీమ్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

ఇదిలాఉంటే.. థర్డ్ వేవ్ నేపథ్యంలో డ్రగ్స్ కంపెనీలు ప్రొడెక్షన్‌ను సైతం పెంచాయి. కాగా.. శీతాకాల సీజన్‌లో సాధారణంగా ఫ్లూ లాంటి లక్షణాలు కనిపిస్తాయని.. ట్యాబెట్లు ఇబ్బడిముబ్బడిగా వాడటం మంచిదికాదంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సొంతంగా చిట్కాలను అస్సలు పాటించవద్దని.. వైద్యుల సలహాలతోనే వాడాలంటూ హెచ్చరిస్తున్నారు. కరోనా నిబంధనలు పాటించడం, మాస్కులు ధరించడం ముఖ్యమని పేర్కొంటున్నారు. భయంతో ఆసుపత్రులకు వెళ్లొద్దంటూ సూచిస్తున్నారు.

Also Read:

India Coronavirus: తగ్గేదెలే.. దేశంలో కరోనా విలయతాండవం.. లక్షన్నరకు చేరువలో కేసులు..

Omicron: దేశంలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు.. నిన్న ఎన్ని నమోదయ్యాయంటే..?