Telangana Corona: తెలంగాణలో తగ్గుముఖం పడుతున్న కరోనా వ్యాప్తి.. తాజా పాజిటివ్ కేసులు ఎన్నంటే..
Telangana Corona: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తంగా క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఫలితంగా రోజు వారీగా నమోదు అయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య...

Telangana Corona: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తంగా క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఫలితంగా రోజు వారీగా నమోదు అయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గుతోంది. తాజాగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1,23,005 శాంపిల్స్ సేకరించి టెస్ట్ చేయగా.. 1,362 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. యధావిధిగా రోజువారి కరోనా రికవరీల సంఖ్య కూడా పెరుగుతోంది. తాజాగా 1,813 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇదే సమయంలో కరోనా వైరస్ ప్రభావంతో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణ ప్రస్తుతం 18,568 యాక్టీవ్ కేసుల ఉన్నాయి. రాష్ట్రంలో రికవరీల రేటు 96.38 శాతం ఉండగా.. మరణాల రేటు 0.58 శాతం ఉంది. ఇదిలాఉంటే.. తాజాగా నమోదైన పాజిటివ్ కేసులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో 6,12,196 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 5,90,072 మంది కోలుకున్నారు. అయితే, కరోనా వైరస్ తీవ్రతతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 3,556 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,74,37,785 శాంపిల్స్ పరీక్షించారు.
తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 145 నమోదు అవగా.. ఆ తరువాత ఖమ్మం జిల్లాలో 122, రంగారెడ్డి జిల్లాలో 97 కేసులు నమోదు అయ్యాయి. కాగా, జిల్లాల వారీగా నమోదైన పాజిటీవ్ కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.
జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలు..
ఆదిలాబాద్ – 5 బద్రాద్రి కొత్తగూడెం – 81 జీహెచ్ఎంసీ – 145 జగిత్యాల – 25 జనగామ – 16 జయశంకర్ భూపాలపల్లి – 25 జోగులాంబ గద్వాల – 9 కామారెడ్డి – 3 కరీంనగర్ – 84 ఖమ్మం – 122 కొమరంభీం ఆసిఫాబాద్ – 5 మహబూబ్‌నగర్ – 26 మహబూబాబాద్ – 66 మంచిర్యాల – 42 మెదక్ – 8 మేడ్చల్ మల్కాజిగిరి – 66 ములుగు – 24 నాగర్ కర్నూల్ – 16 నల్లగొండ – 83 నారాయణ పేట – 7 నిర్మల్ – 5 నిజామాబాద్ – 6 పెద్దపల్లి – 58 రాజన్న సిరిసిల్ల – 26 రంగారెడ్డి – 97 సంగారెడ్డి – 24 సిద్దిపేట – 41 సూర్యాపేట – 89 వికారాబాద్ – 26 వనపర్తి – 34 వరంగల్ రూరల్ – 19 వరంగల్ అర్బన్ – 52 యాదాద్రి భువనగిరి – 27
Also read:
Salman Khan: మాస్ మేనియా మసక బారుతోందా..? కొత్త జిమ్మిక్స్ ప్లే చేయబోతున్న సల్లూ భాయ్
