Salman Khan: మాస్ మేనియా మసక బారుతోందా..? కొత్త జిమ్మిక్స్ ప్లే చేయ‌బోతున్న స‌ల్లూ భాయ్

బాలీవుడ్ లోని ముగ్గురు ఖాన్ దాదాల్లో ఒక్కొక్కరిదీ ఒక్కో స్టయిల్. ఆమిర్ ఖాన్ తనలోని వెర్సటాలిటీని నమ్ముకుంటే.. షారుఖ్ ఖాన్ లవ్ అండ్ యాక్షన్ జానర్లను ఫాలో అవుతారు. సల్మాన్ మాత్రం...

Salman Khan: మాస్ మేనియా మసక బారుతోందా..? కొత్త జిమ్మిక్స్ ప్లే చేయ‌బోతున్న స‌ల్లూ భాయ్
salman khan
Ram Naramaneni

|

Jun 19, 2021 | 7:07 PM

బాలీవుడ్ లోని ముగ్గురు ఖాన్ దాదాల్లో ఒక్కొక్కరిదీ ఒక్కో స్టయిల్. ఆమిర్ ఖాన్ తనలోని వెర్సటాలిటీని నమ్ముకుంటే.. షారుఖ్ ఖాన్ లవ్ అండ్ యాక్షన్ జానర్లను ఫాలో అవుతారు. సల్మాన్ మాత్రం తనకున్న మాస్ ఫాలోయింగ్ మీదే పిచ్చిగా డిపెండ్ అవుతారు. ఇప్పుడు ఆ మాస్ మేనియా కూడా మసక బారుతోందా అనేది సల్లూ భాయ్ డౌట్. అందుకే.. ఎప్పటికప్పుడు కొత్తకొత్త జిమ్మిక్స్ ప్లే చేస్తారు. లేటెస్ట్ గా అటువంటిదే ఒకటి ట్రై చేశారు. హైబ్రీడ్ రిలీజ్ అనే కొత్త కాన్సెప్ట్‌ను ఫస్ట్ టైమ్ తెరమీదకు తీసుకొచ్చి రాధే మూవీని డిజిటల్ ఆడియెన్స్ కి అప్పగిస్తే… అదికాస్తా టప్ మని పేలిపోయింది. దాదాపు వందకోట్ల నష్టం మిగల్చడమే కాదు.. సల్మాన్ పెర్ఫామెన్స్ లెవెల్స్ మీదే డౌట్లు పుట్టించింది రాధే మూవీ. సీటీమార్ లాంటి పాపులర్ ట్యూన్స్ ని రీమిక్స్ చేసుకున్నా.. సినిమా నడవలేదు. గతంలో స్లంప్ నుంచి బైటపడ్డం కోసం.. తన క్రేజీ క్యారెక్టర్ ఛుల్బుల్ పాండేని థర్డ్ టైం ప్రయోగించి డబ్బంగ్3 తీస్తే.. అది కూడా బాక్సాఫీసు వద్ద అడ్డంగా ఓడిపోయింది.

సో.. ఈ కొత్త జిమ్మిక్స్ ఏవీ నడవడం లేదని తెలుసుకుని.. ఇప్పుడు మరో పాత సెంటిమెంట్ ని నమ్ముకున్నారు సల్మాన్. రాధే తర్వాత రాబోయే ‘కభీ ఈద్ కభీ దివాళి’ మూవీకి సడన్ గా పేరు మార్చేశారు. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి ‘భాయ్ జాన్’ అని రీనేమ్ చేసి… దీపావళికి వస్తున్నా అని ఫీలర్ వదిలారు సల్లూ భాయ్. ఈ ‘భాయ్ జాన్’ టైటిల్ బ్యాగ్రౌండ్ లో కూడా పెద్ద కథే వుంది. కంటెంట్ పరంగా ఇది అన్నదమ్ముల కథ అని.. అందుకే ‘భాయ్ జాన్’ టైటిల్ ఫిక్స్ చేశామని పైకి చెబుతున్నా అసలు విషయం మాత్రం వేరే వుంది ఆరేళ్ళ కిందట సల్మాన్ కి మంచి బ్రేక్ ఇచ్చి అతడి గ్రాఫ్ ని నిలబెట్టిన మూవీ ‘భజరంగి భాయ్ జాన్’. ఈ సినిమా టైటిల్లోని భాయ్ జాన్ అనే సౌండ్ ని రిపీట్ కొట్టడం ద్వారా.. తన అప్కమింగ్ మూవీకి పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేయొచ్చన్నది సల్మాన్ ఐడియా. నెక్స్ట్ రాబోయే టైగర్3, కిక్2 సినిమాలకు ఏమేం షార్ట్ కట్స్ రెడీ చేసుకున్నారో చూడాలి మరి.

Also Read: ప్రశాంత్ వర్మ డైరెక్షన్‏లో మరోసారి యంగ్ హీరో తేజ.. కీలక పాత్రలో జయమ్మ..

విందు కార్యక్రమంలో వధువు అల్ల‌రి.. అంద‌రూ ఫిదా

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu