AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hanuman Movie: ప్రశాంత్ వర్మ డైరెక్షన్‏లో మరోసారి యంగ్ హీరో తేజ.. కీలక పాత్రలో జయమ్మ..

చైల్డ్ ఆర్టిస్ట్‏గా టాలీవుడ్‏లో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన తేజ సజ్జా.. ప్రస్తుతం హీరోగానూ రాణిస్తున్నాడు.

Hanuman Movie: ప్రశాంత్ వర్మ డైరెక్షన్‏లో మరోసారి యంగ్ హీరో తేజ.. కీలక పాత్రలో జయమ్మ..
Hanuman
Rajitha Chanti
|

Updated on: Jun 19, 2021 | 3:25 PM

Share

చైల్డ్ ఆర్టిస్ట్‏గా టాలీవుడ్‏లో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన తేజ సజ్జా.. ప్రస్తుతం హీరోగానూ రాణిస్తున్నాడు. ఇటీవల విభిన్న కథాంశంతో తెరకెక్కిన జాంబిరెడ్డి సినిమాలో నటించి సక్సెస్ అందుకున్నాడు తేజ. ప్రస్తుతం ఈ యంగ్ హీరో మరోసారి.. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నటించనున్నట్లుగా సమాచారం. ఇప్పటికే ప్రశాంత్‌ వర్మ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీకి ‘హనుమాన్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. పురాణ ఇతిహాసాల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోగా తేజ దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనున్నట్లుగా టాక్.

Varalaxmi Sharath Kumar: తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ నటించనున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. విభిన్నమైన పాత్రలతో తమిళ సినిమా ఇండస్ట్రీలో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈమె, ఈ ఏడాది టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. మాస్ మహారాజ రవితేజ నటించిన ‘క్రాక్’ సినిమాలో జయమ్మ పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. ఆ తర్వాత అల్లరి నరేష్ నటించిన ‘నాంది’ సినిమాలో లాయర్ పాత్రతో మరోసారి ప్రేక్షకులను మెప్పించింది. ఇక ఇప్పుడు హనుమాన్ చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ప్రకటించనున్నారు.

Also Read: Lyca Production: కరోనా విపత్తులో అండగా లైకా ప్రొడక్షన్స్.. ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.2 కోట్లు విరాళం..

Uttar Bharat Yatra: మాతా వైష్ణవి టెంపుల్, హరిద్వార్, ఢిల్లీ సహా ప్రముఖ ప్రాంతాల పర్యటన రైల్వే ప్రత్యేక ప్యాకేజీతో రైలు..

Nama Nageswara Rao: నేనెవర్నీ మోసం చేయలేదు.. న్యాయవ్యవస్థపై నమ్మకముంది.. నామా సంచలన వ్యాఖ్యలు

New Labour Act : త్వరలో వారానికి 3 రోజులు సెలవు..! కేవలం 4 రోజులు మాత్రమే పని.. కొత్త లేబర్ చట్టం ఏం చెబుతుంది..?

Follow Us
శ్రేయస్ అయ్యర్‌ మీద వైభవ్‎కు అంత కోపముందా ?
శ్రేయస్ అయ్యర్‌ మీద వైభవ్‎కు అంత కోపముందా ?
టీ vs కాఫీ.. ఇదో పెద్ద మైండ్ గేమ్.. మీ ఛాయిస్‌ను బట్టి మీరు ఎలాంట
టీ vs కాఫీ.. ఇదో పెద్ద మైండ్ గేమ్.. మీ ఛాయిస్‌ను బట్టి మీరు ఎలాంట
అమ్రాబాద్‌లో రికార్డు స్థాయిలో పులుల గుర్తింపు..అడ పులులదే రాజ్యం
అమ్రాబాద్‌లో రికార్డు స్థాయిలో పులుల గుర్తింపు..అడ పులులదే రాజ్యం
నువ్వు లేకపోతే చచ్చిపోతా అని.. తర్వాత టార్చర్ చేశాడు..
నువ్వు లేకపోతే చచ్చిపోతా అని.. తర్వాత టార్చర్ చేశాడు..
బలవంతులమని విర్రవీగితే మనకంటే సమర్థులు ఎదురుపడతారు.. తెలివిగా ఇలా
బలవంతులమని విర్రవీగితే మనకంటే సమర్థులు ఎదురుపడతారు.. తెలివిగా ఇలా
టికెట్ ఉన్నా ఈ రైల్వే స్టేషన్‌లోకి అడుగుపెట్టలేరు.. ఎందుకంటే?
టికెట్ ఉన్నా ఈ రైల్వే స్టేషన్‌లోకి అడుగుపెట్టలేరు.. ఎందుకంటే?
జుకు 2GB డేటా, అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ రూ.199కే..వ్యాలిడిటీ ఎంతంటే
జుకు 2GB డేటా, అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ రూ.199కే..వ్యాలిడిటీ ఎంతంటే
మరో చరిత్ర సృష్టించిన ఐర్లాండ్ టీం.. షాక్‎లో క్రికెట్ అభిమానులు
మరో చరిత్ర సృష్టించిన ఐర్లాండ్ టీం.. షాక్‎లో క్రికెట్ అభిమానులు
అమ్మాయిలను రూమ్‌కి రప్పించి.. ఆ తర్వాత వేరే కథ
అమ్మాయిలను రూమ్‌కి రప్పించి.. ఆ తర్వాత వేరే కథ
తెలంగాణలో వీఐపీల సెక్యూరిటీపై ఇంటెలిజెన్స్ కీలక నిర్ణయం..
తెలంగాణలో వీఐపీల సెక్యూరిటీపై ఇంటెలిజెన్స్ కీలక నిర్ణయం..