New Labour Act : త్వరలో వారానికి 3 రోజులు సెలవు..! కేవలం 4 రోజులు మాత్రమే పని.. కొత్త లేబర్ చట్టం ఏం చెబుతుంది..?

New Labour Act : మీరు ఇప్పుడు కార్యాలయానికి వెళితే వారానికి 6 లేదా 5 రోజులు పని చేయాలి. ఒకటి లేదా రెండు రోజులు

New Labour Act : త్వరలో వారానికి 3 రోజులు సెలవు..! కేవలం 4 రోజులు మాత్రమే పని.. కొత్త లేబర్ చట్టం ఏం చెబుతుంది..?
New Labor Act
Follow us
uppula Raju

|

Updated on: Jun 19, 2021 | 12:50 PM

New Labour Act  : మీరు ఇప్పుడు కార్యాలయానికి వెళితే వారానికి 6 లేదా 5 రోజులు పని చేయాలి. ఒకటి లేదా రెండు రోజులు సెలవు తీసుకోవాలి. కానీ ఇప్పుడు ఒక రోజుకు బదులుగా ప్రతి వారం మూడు రోజులు సెలవు పొందుతారు. కేవలం 4 రోజులు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది. అవును ప్రభుత్వం కొత్త లేబర్ కోడ్ కోసం పనిచేస్తోంది త్వరలో సెలవుల నిబంధనలలో మార్పు రావచ్చని అంటున్నారు. దేశంలో చేసిన కొత్త కార్మిక చట్టాల ప్రకారం రాబోయే రోజుల్లో వారంలో మూడు రోజులు సెలవు ఉంటుందని చెబుతున్నారు. అటువంటి పరిస్థితిలో కొత్త నిబంధనల ప్రకారం వారంలో ఎన్ని గంటలు పని చేయాలో తెలుసుకోండి. మనీ కంట్రోల్ నివేదిక ప్రకారం ఉద్యోగులు పని గంటలు, రోజులలో ఉపశమనం పొందవచ్చు. వారంలో ఐదు రోజులకు బదులుగా 4 రోజులు ఉద్యోగం ఉంటుందని, రెండు రోజులకు బదులుగా వారంలో 3 రోజులు సెలవు ఉంటుందని చెబుతున్నారు. కొత్త నిబంధనల ప్రకారం కంపెనీ ఉద్యోగులు పరస్పర అంగీకారం ద్వారా ఈ ఒప్పందం చేసుకోవచ్చు.

ఎన్ని గంటలు పని చేయాల్సి ఉంటుంది? ఏదేమైనా 4 రోజులు పనిచేసిన తర్వాత మీ రోజువారీ షిఫ్ట్ సమయాలలో మార్పు ఉండవచ్చు. దీని కారణంగా పని గంటలను12 కి పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఎంపికను కొత్త లేబర్ కోడ్‌లోని నిబంధనలలో కూడా ఉంచనున్నట్లు నివేదికలో పేర్కొన్నారు. దీనిపై కంపెనీ ఉద్యోగులు పరస్పరం అంగీకరించిన నిర్ణయం తీసుకోవచ్చు. దీనితో పాటు వారంలో 48 గంటల పని గరిష్ట పరిమితిని ఉంచినట్లు కూడా చెప్పబడింది. అటువంటి పరిస్థితిలో పని దినాలను తగ్గించవచ్చు.

మీరు ప్రస్తుతం వారానికి 5 రోజులు 9 గంటలు పని చేస్తే మీరు ప్రతి వారం 45 గంటలు పని చేస్తారు కానీ మీరు 12 గంటల షిఫ్ట్ ప్రకారం 4 రోజులు పని చేస్తే మీరు 48 రోజులు పని చేయాల్సి ఉంటుంది. దీనితో పాటు అదనపు పనిని 30 నిముషాలు లెక్కించడం ద్వారా 15 నుంచి 30 నిమిషాల మధ్య ఓవర్ టైం లో లెక్కించే నిబంధన ఉందని ఈ నివేదికలో చెప్పబడింది. తద్వారా కంపెనీ మీకు ఎక్కువ పని చేస్తే మీకు అదనపు డబ్బు కూడా లభిస్తుంది. ప్రతిపాదిత నిబంధనల ప్రకారం ఏ ఉద్యోగి అయినా 5 గంటలకు పైగా నిరంతరం పనిచేయడం నిషేధించబడింది. ఎవరైనా 5 గంటలు నిరంతరం పనిచేస్తే ఆ ఉద్యోగికి అరగంట విశ్రాంతి లభిస్తుంది.

Rythu Bandhu: రైతులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి రైతు బంధు డబ్బులు పోస్టాఫీసులో కూడా.. ఇలా చేస్తే క్షణాల్లో ..

యూపీ ఆక్సిజన్ ‘మాక్ డ్రిల్’ కేసు ఉదంతంలో కొత్త ట్విస్ట్……ఆగ్రాలోని ప్రైవేటు ఆసుపత్రికి క్లీన్ చిట్

Karthika Deeepam Today: కాలం, గాలి రెండు నావైపే ఉన్నాయి .. ఇప్పుడు టైం నాది అంటున్న మోనిత