చెన్నై లోని జూలో మరో నాలుగు సింహాలకు కరోనా వైరస్ పాజిటివ్….జంతువుల్లో విస్తరిస్తున్న డెల్టా వేరియంట్ ..?
చెన్నై వండలూర్ లోని అరిగ్ నగర్ అన్నా జువాలాజికల్ పార్క్ లో గల సింహాల్లో మరో నాలుగు సింహాలకు కరోనా వైరస్ పాజిటివ్ సోకినట్టు వెల్లడైంది. ఇవి బీ.1.617.2 డెల్టా వేరియంట్ కి గురైనట్టు జూ అధికారులు తెలిపారు. వీటి జీనోమ్ శాంపిల్స్ ని భోపాల్ లోని..
చెన్నై వండలూర్ లోని అరిగ్ నగర్ అన్నా జువాలాజికల్ పార్క్ లో గల సింహాల్లో మరో నాలుగు సింహాలకు కరోనా వైరస్ పాజిటివ్ సోకినట్టు వెల్లడైంది. ఇవి బీ.1.617.2 డెల్టా వేరియంట్ కి గురైనట్టు జూ అధికారులు తెలిపారు. వీటి జీనోమ్ శాంపిల్స్ ని భోపాల్ లోని వైరాలజీ ఇన్స్ టిట్యూట్ కి పంపగా రిపోర్టులు ఈ మేరకు వచ్చాయన్నారు. (పాంగోలిన్ లీనియేజ్ అయిన ఈ వేరియంట్ ని ప్రపంచ ఆరోగ్య సంస్థ తన ప్రధాన సమాచారాల్లో పేర్కొంది). చెన్నై జువాలాజికల్ పార్క్ లోని 11 సింహాల్లో నాలుగింటి వాటి జీనోమ్ శాంపిల్స్ ని గత మే 24 న, ఏడింటి శాంపిల్స్ ని మే 29 న భోపాల్ సంస్థకు పంపారు. మొత్తం 9 సింహాలకు పాజిటివ్ సోకగా నాలుగింటికి బీ.1.1.167.2 వేరియంట్ అని తేలింది. సాధారణ వైరస్ కన్నా ఇది డేంజరస్ అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గతంలో పేర్కొంది. సింహాలకు సోకిన సార్స్-కొవ్-2 జీనోమ్ సీక్వెన్స్ ఫలితాలను షేర్ చేయవలసిందిగా అధికారులు ఎప్పటికప్పుడు భోపాల్ సంస్థను కోరుతున్నారు.
ఇతర స్ట్రెయిన్లకన్నా త్వరగా వ్యాపించే గుణం ఈ స్ట్రెయిన్ లో ఉందని, ఇది నిరోధక శక్తిని తగ్గిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. డెల్టా వేరియంట్లలో నాలుగింటిని ఇదివరకే ప్రపంచ దేశాలకు తెలియజేసింది. ఇటీవల వండలూర్ జూలో రెండు సింహాలు కరోనా వైరా పాజిటివ్ కి గురై మరణించాయి. ఇప్పుడు నాలుగు సింహాలకు కూడా డెల్టా వేరియంట్ సోకడంతో వీటిని అత్యంత జాగరూకతతో కాపాడుతున్నారు. ప్రత్యేకమైన ట్రీట్ మెంట్ ఇస్తున్నారు. తమిళనాడు సీఎం స్టాలిన్ గత ఆదివారం ఈ జూను సందర్శించి వీటి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
మరిన్ని ఇక్కడ చూడండి: ఎత్తిన కత్తి దించితే ఒట్టు.. అమేజింగ్ వీడియో వైరల్..!మహిళ అరుదైన ప్రతిభ :woman playing sword viral video.
Viral Video : పెళ్లి కూతురు డ్రెస్సు నుండి బయటకు వచ్చిన వ్యక్తి వైరల్ అవుతున్న వీడియో .