యూపీ ఆక్సిజన్ ‘మాక్ డ్రిల్’ కేసు ఉదంతంలో కొత్త ట్విస్ట్……ఆగ్రాలోని ప్రైవేటు ఆసుపత్రికి క్లీన్ చిట్

యూపీ ఆగ్రా లోని ప్రైవేటు ఆసుపత్రిలో 16 మంది కోవిద్ రోగుల మృతికి ఆక్సిజన్ మాక్ డ్రిల్ ప్రయోగం కారణం కాదని తేలింది. కోవిద్ సంక్షోభ సమయంలో ఏప్రిల్ 27 న ఈ ఆసుపత్రి యజమాని రోగులకు 5 నిముషాలపాటు ఆక్సిజన్ ఆపివేస్తే ఎలా ఉంటుందో

యూపీ  ఆక్సిజన్ 'మాక్ డ్రిల్' కేసు ఉదంతంలో కొత్త ట్విస్ట్......ఆగ్రాలోని ప్రైవేటు ఆసుపత్రికి  క్లీన్ చిట్
New Twist In Up Mock Drill Oxygen Case
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Jun 19, 2021 | 11:50 AM

యూపీ ఆగ్రా లోని ప్రైవేటు ఆసుపత్రిలో 16 మంది కోవిద్ రోగుల మృతికి ఆక్సిజన్ మాక్ డ్రిల్ ప్రయోగం కారణం కాదని తేలింది. కోవిద్ సంక్షోభ సమయంలో ఏప్రిల్ 27 న ఈ ఆసుపత్రి యజమాని రోగులకు 5 నిముషాలపాటు ఆక్సిజన్ ఆపివేస్తే ఎలా ఉంటుందో చూద్దామని మాక్ డ్రిల్ ప్రయోగం చేశాడని ఆ మధ్య ఓ ఆడియో క్లిప్ సంచలనం రేపింది. ఆ రోజున 16 మంది రోగులు మృతి చెందారని..కానీ వారి మృతికి ఇది కారణం కాదని ఓ కమిటీ తెలిపింది. ఈ షాకింగ్ ఉదంతంపై విచారణకు యూపీ ప్రభుత్వం ఈ కమిటీని నియమించింది. 16 మంది రోగుల్లో 14 మంది ఆరోగ్య పరిస్థితి అంతకుముందే తీవ్రంగా ఉందని, నిజానికి కోవిద్ ప్రొటొకాల్స్ ప్రకారం అందరికీ సరైన చికిత్స జరిగిందని కమిటీ పేర్కొంది. రోగుల్లో ఎవరికీ ఆక్సిజన్ సరఫరాను నిలిపివేయలేదని స్పష్టం చేసింది.శ్రీ పరాస్ అనే హాస్పిటల్ యజమాని అరింజయ్ జైన్…ఈ ప్రయోగం చేశాడని వార్తలు వచ్చాయి. అయితే ఆక్సిజన్ సిలిండర్లు అన్నీ రిజర్వ్ లో ఉన్నాయని, ఈ ప్రాణవాయువు కొరత లేదని, తమ ఆసుపత్రిలో అడ్మిట్ అయిన రోగులకు ఇది సరిపోతుందని జైన్ చెప్పినట్టు తెలిసింది. ఆక్సిజన్ నిలిపివేసినందున పేషంట్స్ మరణించారనడం నిజం కాదని పేర్కొన్నట్టు సమాచారం.

అసలు ఆ డియో క్లిప్ లో తాను అలా అనలేదని…అసలు ఇందులో తన తప్పేమీ లేదని జైన్ చెప్పాడట.. కాగా ఈ 16 మంది రోగుల కుటుంబాల్లో ఏడుగురి కుటుంబాల ఫిర్యాదులను ఈ కమిటీ తమ నివేదికలో ప్రస్తావించలేదు. శ్రీపరాస్ హాస్పిటల్ తీరుపై ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో అధికారులు దీన్ని కొన్ని రోజులపాటు సీల్ చేశారు. ఇప్పుడు మళ్ళీ తెరిచే అవకాశం ఉందని భావిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి: ఎత్తిన కత్తి దించితే ఒట్టు.. అమేజింగ్ వీడియో వైరల్‌..!మహిళ అరుదైన ప్రతిభ :woman playing sword viral video.

Viral Video : పెళ్లి కూతురు డ్రెస్సు నుండి బయటకు వచ్చిన వ్యక్తి వైరల్ అవుతున్న వీడియో .

Viral Video : తెలివైన పనిమంతుడు…జోరువానలో గొడుగుపట్టుకుని హార్డ్ వర్క్ చేస్తున్న ఇంటిలిజెంట్ (వీడియో).

బ్లైండ్ స్కూల్ కి కోటి విరాళం ఇచ్చిన బాలీవుడ్ స్టార్..జవాన్లతో కలిసి వాలీబాల్ ఆడిన అక్షయ్ కుమార్.:Akshay Kumar video.