AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karthika Deeepam Today: కాలం, గాలి రెండు నావైపే ఉన్నాయి .. ఇప్పుడు టైం నాది అంటున్న మోనిత

Karthika Deeepam : రోజుకో ట్విస్ట్ తో సాగుతున్న కార్తీక దీపం సీరియల్ ఈరోజు 1070 ఎపిసోడ్ లోకి అడుగు పెట్టింది. ఈరోజు సీరియల్ లోని హైలెట్స్ చూద్దాం.. దీప కార్తీక్ కు కాఫీ తీసుకొచ్చి డాక్టర్ బాబు..

Karthika Deeepam Today: కాలం, గాలి రెండు నావైపే ఉన్నాయి .. ఇప్పుడు టైం నాది అంటున్న మోనిత
Karthika Deeepam
Surya Kala
|

Updated on: Jun 19, 2021 | 12:05 PM

Share

Karthika Deeepam : రోజుకో ట్విస్ట్ తో సాగుతున్న కార్తీక దీపం సీరియల్ ఈరోజు 1070 ఎపిసోడ్ లోకి అడుగు పెట్టింది. ఈరోజు సీరియల్ లోని హైలెట్స్ చూద్దాం.. దీప కార్తీక్ కు కాఫీ తీసుకొచ్చి డాక్టర్ బాబు అంటూ నిద్రలేపుతుంది. కాఫీ ఇస్తుంది. ఇంత పొద్దున్నే రెడీ అయ్యావేమిటి.. నేను ఇక్కడ సెటిల్ అయ్యానని ఎక్కడైకైనా వెళ్లిపోతుందా అని అనుకుంటూ.. ఎక్కడికి వెళ్తున్నావు.. తొందర పడి ఎటువంటి నిర్ణయం తీసుకోకు.. ఎక్కడికి వెళ్ళిపోకు.. అటువంటి నిర్ణయం ఏమైనా తీసుకుంటే నేను తట్టుకోలేను .. పిల్లలు అమ్మ ఏమైంది.. ఎందుకు వెళ్ళింది అని అడిగితె నరకయాతన అనుభవించాలి అంటాడు. నేను పెద్దదానికన్నా ఎక్కువ అని ప్రశ్నిస్తే.. నా దగ్గర జవాబు లేదు.. అంటుంటే ముందు కాఫీ తాగు.. అంటే బయటకు వెళ్లాల్సిన పని ఉంది.. ఒక గంటలో వస్తా.. ఎవరూ కంగారు పడాల్సిన పనిలేదు.. అంటుంది దీప.. ఆగు కారు తీసుకొస్తాను.. ఎప్పటికీ కారు ఎక్కవా .. నువ్వు నేను పిల్లలు సరదాగా గడపాలని.. షాపింగ్స్ , సినిమాలు లాంగ్ టూర్ కి వెళ్లాలని ప్లాన్ చేశాను. ఇంతలో ఇలా అయ్యింది.. అంటుంటే నేను వారణాసి ఆటోలో వెళ్తా అంటుంది దీప. ఇంతలో వారాణసి వస్తాడు.. జాగ్రత్తగా తీసుకుని వేళ్ళు అంటాడు కార్తీక్

మోనిత ప్రియమణి తో తాను 10 రోజుల తర్వాత చేసే ప్లాన్ ను చెబితే.. నాకు ఎందుకో మీ ప్లాం వర్క అవుట్ అవ్వదనిపిస్తుందమ్మా అంటుంది. ఎందుకు జరగదు.. జరుగుతుంది…నాకు జరిగిన అన్యాయానికి న్యాయం చేసుకుంటున్నా అంటుంది మోనిత. దొరికిన అవకాశాన్ని చక్కగా వినియోగించుకుని రావాల్సిన హక్కులను దక్కించుకుంటుంన్నా అంటే.. అందుకు సౌందర్య, ఆమె కోడలు అడ్డు పడితే అంటుంది ప్రియమణి. ఇంతలో సౌందర్య దీప మోనిత దగ్గరకు వస్తారు.. మనం వెనక్కి వెళ్లిపోదామా అంటే మనకు ఏమి అయిపోదామా అంటే మనకు ఏమి భయం అంటుంది మోనిత ..

కార్తీక్ తనదగ్గరకు వచ్చి దీప మాట్లాడాలంటే.. మోనిత మాట్లాడకుండా ఉండాలంటే నేను ఏమి చెయ్యాలమ్మా అని సలహా అడిగాడు.. మీరేమి చెప్పారు అంటుంది దీప. అంటే… సౌందర్య తాను కార్తీక్ తో చెప్పిన మాటలు చెబుతుంది. మీరు మంచివారు అత్తయ్య.. మీకు అమ్మతనం కంటే మంచితనం ఎక్కువ అంటుంది దీప.. వాడి పరిష్టితి చూసి నీకు ఏమనిపిస్తుంది అంటే జాలివేస్తుంది అత్తయ్య.. అంటుంది దీప నామీద నాకు జాలివేస్తుంది అత్తయ్య .. నా పరిస్థితి ఆలోచించుకుని జాలి వేస్తుంది.. ఎంతటి నష్టజాతకురాలికైనా ఏదొక సమయంలో రిలీఫ్ దొరుకుతుంది.. నాకు అటువంటిది లేదు.. అందుకే జాలి వేస్తుంది.. అంటుంటే.. మోనిత వాళ్ళ దగ్గరకు వస్తుంది. ఇద్దరినీ పలకరిస్తుంది. డాక్టర్ మోనిత ప్రెగ్నెంట్ మోనిత కు మార్కింగ్ వర్క్ చేయమని సలహా ఇచ్చింది. కాలానికి అద్భుతమైన శక్తి ఉంది కదా దీప.. నువ్వు విజయనగరం పారిపోతే.. కార్తీక్ నీకోసం రావడం ఏమిటి.. చావు బతుకుల మీద ఉన్న నిన్ను కార్తీక్ బతికించుకోవడం ఏమిటి.. ఇన్ని చేసిన కార్తీక్ ను నువ్వు ఛీ కొట్టడం ఏమిటి ఇదంతా మోనిత మహత్యం కాదు కాల మహత్యం అంటుంది మోనిత. కాలం గాలి రెండు ఇప్పుడు మోనిత వైపే ఉన్నాయి.. అంటూ కార్తీక్ తో నేను నిన్న అంటూ.. ఎదో చెప్పబోతూనే.. కార్తీక్ చాలా మంచివాడు ఆంటీ.. ఇంత డబ్బు ఉన్న కురాళ్ళ విర్రవీగిపోతారు.. కానీ ఎదిగో కొద్దీ ఒదిగి ఉండే కార్తీక్ అంటే నాకు అంత ఇష్టం అంటుంది..మీరు ఎదో సామావేశంలో ఉన్నారుగా మాట్లాడుకోండి అంటూ వెళ్ళిపోతుంది.

ఎంత పనిచేశాడే నాకొడుకు .. నను చేతగానిదానిలా చేశాడు అని సౌందర్య బాధపడుతుంది. అలాగని నీకు ఏ అన్యాయం జరగనివ్వను కష్టం కలగనివ్వను దీప అంటే.. నాకు జరిగిన నష్టానికి ఖరీదు ఎంత ఉంటుంది అంటుంది అత్తయ్య అంటుంది దీప. మిమ్మల్ని బాధపెట్టడం కోసం నేను ఆ మాట అనలేదు.. నా బాధ చెప్పుకున్నాను అంతే.. అన్ని సమస్యల్లోనూ అండగా ఉన్న మిమ్మల్ని అంటానా అంటే.. నేను బాధపడడం లేదు దీప.. అది చెప్పిందే కాలం అంటూ వెళ్ళిపోతుంది.

ఈరోజు దీప దగ్గరకు వెళ్ళదాం అన్నావుగా అంటే.. సాయంత్రం వెళ్ళదాం. దీప కాపురాన్ని చక్క బెట్టేవరకూ తాను వదలనని అంటుంది. కార్తీక్ మొక్కలకు నీరు పోస్తుంటే.. పిల్లలు అమ్మ ఏది అని అడుగుతారు.. బయటకు వెళ్ళింది.. ఒక గంటకు వస్తా అంది.. పిల్లలు అడుగుతున్న ప్రశ్నలను ఆపి .. వెళ్లి స్నానం చేసి రండి.. వేడి వేడిగా ఇడ్లీ తిందురుగానీ అంటాడు.. ఇక్కడ వంట చేస్తావు.. మొక్కలకు నీరు పోస్తున్నావు.. ఎందుకు డాడీ ఇదంతా అంటుంటే.. ప్రశ్నలు ఆపండి అంటే.. శౌర్య ఎలా ఆగుతాయి.. సమాధానం వస్తే నే కదా ప్రశ్నలు ఆగుతాయి అంటుంది. మేము అక్కడ ఉండాలో ఇక్కడ ఉండాలో తెలియదు.. అన్నీ సందేహాలు.. మా చిన్ని బ్రెయిన్ లో అంత పెద్ద క్వచ్చిన్ బ్యాంక్ ఎలా దాచుకోవాలి డాడీ అని అడుగుతుంది హిమ. దీప వస్తుంది.. నన్ను ఇడ్లీలు చేసి కారంపొడి నెయ్యి వేసి పెట్టాడు. మీ డాడీ ఎక్కడ ఉన్నాడు అని లోపలకు వెళ్లారు దీప పిల్లలు.. దీపని టిఫిన్ తినమంటుంటే. నాకు అంటూ మోనిత వస్తుంది.

Also Read: వైద్య పరీక్షల నిమిత్తం భార్య తో కలిసి స్పెషల్ ప్లైట్ లో అమెరికాకు పయనమైన రజనీకాంత్