Superstar Rajanikanth: వైద్య పరీక్షల నిమిత్తం భార్య తో కలిసి స్పెషల్ ప్లైట్ లో అమెరికాకు పయనమైన రజనీకాంత్

Surya Kala

Surya Kala |

Updated on: Jun 19, 2021 | 10:15 AM

Superstar Rajanikanth: కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ శనివారం ఉదయం స్పెషల్ ప్లైట్ లో అమెరికా పయనమయ్యారు. గత కొంతకాలంగా రజనీకాంత్ అమెరికాలో..

Superstar Rajanikanth: వైద్య పరీక్షల నిమిత్తం భార్య తో కలిసి స్పెషల్ ప్లైట్ లో అమెరికాకు పయనమైన రజనీకాంత్
Rajani

Superstar Rajanikanth: కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ శనివారం ఉదయం స్పెషల్ ప్లైట్ లో అమెరికా పయనమయ్యారు. గత కొంతకాలంగా రజనీకాంత్ అమెరికాలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు చెన్నై విమానాశ్రయం నుంచి రజనీకాంత్ అమెరికాకి ఆరోగ్య పరీక్షల నిమిత్తమని వెళ్లినట్లు తెలుస్తోంది.  కరోనా వలన విదేశాలకు వెళ్ళేందుకు ఆంక్షలు ఉన్నాయి. దీంతో రజనీకాంత్ తన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా అమెరికా వెళ్ళడానికి అనుమతినివ్వాలని కేంద్రాన్ని కోరారు కేంద్రం రజనీకాంత్ కు అనుమతి ఇవ్వడంతో ఈరోజు ఉదయం తన భార్య తో కలిసి చెన్నై నుంచి స్పెషల్ ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో అమెరికాకు బయలుదేరారు. ఈ స్పెషల్ ఫ్లైట్ లో తన కుటుంబ సభ్యులతో కలిసి ఆయన అమెరికా వెళుతున్నారు. ఇప్ప‌టికే ఆయ‌న అల్లుడు ధనుష్, కూతురు అమెరికాలో ఉన్నారు. ఇప్పటికే హాలీవుడ్ సినిమా షూటింగ్ నిమిత్తం అల్లుడు ధనుష్ కూతురు ఐశ్యర్య అమెరికాలోనే ఉన్నారు.

2016 మేలో అమెరికాలో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ చేయించుకున్నారు. ఇక అప్పటి నుంచి ప్రతి సంవత్సరం హెల్త్ చెక్ అప్ కోసం వెళ్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు రజనీకాంత్ ఈ అమెరికా పయనం అయ్యి కోలీవుడ్ ఫిల్మ్ నగర్ లో టాక్.. ఆయన తిరిగి జూలై 8 న భారత్ కు వస్తారని తెలుస్తోంది. రజనీకాంత్ ప్రస్తుతం శివ దర్శకత్వంలో ‘అన్నాత్తే’ అనే మూవీలో అనే సినిమాలో నటిస్తున్నారు. కరోనా సమయంలో కూడా రజనీకాంత్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు. ఈ సినిమాలో ఆయన నటించే సన్నివేశాల షూటింగ్ పూర్తి అయినట్లు తెలుస్తోంది.

Also Read: సోను సూద్ రాజకీయ ఎంట్రీ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు..అమ్మ మాటలను గుర్తు చేసుకున్న రియల్ హీరో

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu