AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karthika Deepam: కార్తీక దీపం సీరియల్ లోని అత్తాకోడళ్ళైన సౌందర్య, దీపల మధ్య నిజజీవితంలో వయసు ఎన్నేళ్లు తేడానో తెలుసా

Karthika Deepam: కార్తీక దీపం సీరియల్ అంటే తెలియని తెలుగు బుల్లి తెర ప్రేక్షకుడు ఉండరేమో.. దేశ విదేశాల్లో తెలుగులోగిళ్ళలో కార్తీక దీపం సందడి చేయని రోజు..

Karthika Deepam: కార్తీక దీపం సీరియల్ లోని అత్తాకోడళ్ళైన సౌందర్య, దీపల మధ్య నిజజీవితంలో వయసు ఎన్నేళ్లు తేడానో తెలుసా
Soundarya Deepa
Surya Kala
|

Updated on: Jun 20, 2021 | 9:46 AM

Share

Karthika Deepam: కార్తీక దీపం సీరియల్ అంటే తెలియని తెలుగు బుల్లి తెర ప్రేక్షకుడు ఉండరేమో.. దేశ విదేశాల్లో తెలుగులోగిళ్ళలో కార్తీక దీపం సందడి చేయని రోజు ఉండదు.. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకూ సాయంత్రం 7.30 గంటలు అవుతుందంటే చాలు టివి స్క్రీన్స్ ముందు చేరుకుంటారు.. అంతగా ఆకట్టుకుంది ఈ సీరియల్. ఈ ధారావాహిక లో ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కార్తీక్, దీప, సౌందర్య లకు ఉన్న ఆదరణ గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే హీరో కార్తీక్ కు తల్లిగా నటిస్తున్న సౌందర్య స్వతహాగా కన్నడ.. అయినా తన నటనతో తెలుగింటి ఆడబడులా ఆదరణ సొంతం చేసుకుంది.

సౌందర్య పాత్రలో జీవిస్తున్న అర్చన ఓ వైపు కొడుకుపై ప్రేమ చూపిస్తూ.. అతను చేస్తోన్న తప్పును ఎత్తిచూపుతూ.. కోడలు దీపకు అండగా ఉంటుంది. అత్తగా సౌందర్య ఏ రేంజ్ లో ఆకట్టుకుందంటే.. మాకు సౌందరలాంటి అట్టకుంటే చాలు పెళ్లి చేసుకుంటాం అని యువత ఆలోచించేటంతగా.. అందమైన రూపంతో పాటు మంచి మనసున్న అత్తగా ఆకట్టుకుంటుంది. అయితే ఇందులో అత్తా కోడళ్ళుగా నటిస్తున్న అర్చన , ప్రేమి విశ్వనాథ్ ల మధ్య నిజజీవితంలో వయసు తేడా తెలిస్తే షాక్ తింటారు.

కర్ణాటకలో పుట్టిన . ‌1988 జ‌న‌వ‌రి 3న‌ జ‌న్మించిన అర్చ‌నా వ‌య‌స్సు ప్ర‌స్తుతం 33 ఏళ్లు. సీరియల్స్ లో నటిగా అడుగు పెట్టక ముందు.. బ్యూటీషియన్ గా పనిచేశారు అర్చ‌నా అనంత్క. ఒక వ్యాపార వేత్తను పెళ్లి చేసుకున్న అర్చన కు ఒక బాబు కూడా ఉన్నారు

ఈ సీరియల్ లోని వంటలక్క కి సినీ హీరోయిన్ కి ఉన్నంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. తన నటనతో ప్రేక్షకులను కంటతడిపెట్టించే ఈ నల్లక్క నిజ జీవితంలో మంచి కలర్.. దీప అసలు పేరు ప్రేమి విశ్వనాధ్.  మలయాళంలో కారుముత్తు అనే సీరియల్ ద్వారా బుల్లి తెరపై అడుగు పెట్టిన ప్రేమి విశ్వనాథ్ అక్కడ సూపర్ అందుకుంది. మంచి నటిగా అవార్డులు, రివార్డులు సొంతం చేసుకుంది. కార్తీక దీపం సీరియల్ లో దీప పాత్రతో తెలుగు లో అడుగు పెట్టింది ప్రేమి విశ్వనాధ్ 1991 డిసెంబర్ 2న కేరళలోని ఎర్నాకుళం అనే ప్రాతంలో జన్నించింది. ప్రేమి విశ్వనాథ్ ప్రస్తుత వయసు 29 ఏళ్ళు.

అయితే కార్తీక దీపం సీరియ‌ల్‌లో అత్తాకోడళ్ళుగా న‌టిస్తున్న‌ప్ప‌టికీ.. నిజ జీవితంలో సౌంద‌ర్య‌, దీపల మ‌ధ్య వ‌య‌సు వ్యత్యాసం కేవలం మూడేళ్లు మాత్రమే,, దీంతో సౌందర్య వయసుకు మించిన పాత్రలో అత్తగా అమ్మగా నటిస్తూ.. ఓ రేంజ్ లో నటిస్తూ.. తల్లి అంటే ఇలా ఉండాలి.. ఇలాంటి అత్తకావాలి అనిపిస్తున్నారు.

Also Read:మెంతి ఆకులను తింటే ఆరోగ్యప్రయోజనాలు అనేకం.. ముఖ్యంగా మహిళలకు