AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lyca Production: కరోనా విపత్తులో అండగా లైకా ప్రొడక్షన్స్.. ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.2 కోట్లు విరాళం..

కరోనా రెండో దశ దేశాన్ని అతలాతుకుతలం చేసింది. దీంతో రాష్ట్రాలు లాక్ డౌన్ అమలు పరుస్తున్నాయి. ఇప్పుడిప్పుడే ఈ మహమ్మారి ప్రభావం కాస్త తగ్గుముఖం పట్టింది.

Lyca Production: కరోనా విపత్తులో అండగా లైకా ప్రొడక్షన్స్.. ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.2 కోట్లు విరాళం..
Lyca
Rajitha Chanti
|

Updated on: Jun 19, 2021 | 1:26 PM

Share

కరోనా రెండో దశ దేశాన్ని అతలాతుకుతలం చేసింది. దీంతో రాష్ట్రాలు లాక్ డౌన్ అమలు పరుస్తున్నాయి. ఇప్పుడిప్పుడే ఈ మహమ్మారి ప్రభావం కాస్త తగ్గుముఖం పట్టింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో లాక్ డౌన్ సడలింపులను ఇస్తున్నాయి ప్రభుత్వాలు. ఇదిలా ఉంటే.. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా ప్రభావం ఎక్కువగానే ఉంది. రోజుకు 35 వేల మంది కరోనా బారిన పడుతుండగా.. అందరికి చికిత్సను అందించేందుకు తమిళనాడు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అలాగే ఈ విపత్తు కాలంలోనూ అక్కడి ప్రభుత్వ తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కోంటుంది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి ఎం.కే స్టాలిన్ సహాయనిధికి విరాళాలు అందించాలని.. పలువురి కోరింది తమిళనాడు ప్రభుత్వం.

విరాళంగా వచ్చిన డబ్బులు కేవలం కరోనా నియంత్రణకు మాత్రమే ఉపయోగిస్తామని.. ఆ వివరాలు కూడా బహిరంగ వెల్లడిస్తామని ముఖ్యమంత్రి స్టాలిన్ గతంలో హామీ ఇచ్చారు. దీంతో ప్రైవేట్ స్వచ్చంద సంస్థలు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకు వచ్చారు. ఇప్పటికే హీరో సూర్య, విక్రమ్ వంటి తారలు సీఎం రిలీప్ ఫండ్ కు విరాళాలు అందించారు. కరోనా క్లిష్ట పరిస్థితులలో ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ కూడా సాయం చేయడానికి ముందుకు వచ్చింది. ఆ సంస్థ అధినేత అల్లిరాజా సుభాస్కరన్ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.2 కోట్లు విరాళంగా ఇచ్చారు. లైకా ప్రొడక్షన తరపున లైకా ఎగ్జిక్యూటివ్ జీకెఎం తమిళకుమారన్, నిరుతన్ సీఎం స్టాలిన్ ను కలుసుకుని రూ. కోట్ల చెక్ అందచేశారు.

Also Read: New Labour Act : త్వరలో వారానికి 3 రోజులు సెలవు..! కేవలం 4 రోజులు మాత్రమే పని.. కొత్త లేబర్ చట్టం ఏం చెబుతుంది..?

Fennel Water : రక్తపోటు.. క్యాన్సర్ సమస్యలను తగ్గించే సోంపు నీరు.. బరువు తగ్గాలనుకునేవారికి సూపర్ పుడ్..

WTC Final 2021: అభిమానులను నిరాశపరిచిన కోహ్లీ..? రోనాల్డో లా ఎందుకు చేయలేదంటూ నెటిజన్ల ప్రశ్నల వర్షం..!

Madhuri Dixit: యోగాసనాలవలన ఆరోగ్యప్రయోజనాలను వివరిస్తూ వీడియో షేర్ చేసిన మాధురీ దీక్షిత్