WTC Final 2021: అభిమానులను నిరాశపరిచిన కోహ్లీ..? రోనాల్డో లా ఎందుకు చేయలేదంటూ నెటిజన్ల ప్రశ్నల వర్షం..!
స్టార్ ప్లేయర్లు మీడియాతో మాట్లాడే ఏ సందర్భాన్ని నెటిజన్లు వదలకుండా మీమ్స్ చేసేస్తున్నారు. రొనాల్డోలా ఎందుకు చేయలేందంటూ ఆటగాళ్లపై ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. తాజాగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఇలాంటి సమస్యే ఎదురైంది.
WTC Final 2021: యూరో 2020 లో హంగేరీ మ్యాచ్‌కు ముందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో స్టార్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు క్రిస్టియానో రొనాల్డో కోకాకోలా బాటిళ్లను టేబుల్ పై నుంచి తొలగించిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై ప్రస్తుతం కోకాకోలా భారీ నష్టాలను చవిచూసింది. రోనాల్డో చేసిన పనికి యూఈఎఫ్ఏ ఫైర్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఆటలకు స్పాన్సర్ షిప్ చేసే బ్రాండ్ల రూల్స్‌ను ఆటగాళ్లు కచ్చితంగా పాటించాల్సిందేనని పేర్కొంది. కాగా, సోషల్ మీడియాలో దీనిపై ఎన్నో మీమ్స్ సందడి చేస్తున్నాయి. స్టార్ ప్లేయర్లు మీడియాతో మాట్లాడే ఏ సందర్భాన్ని నెటిజన్లు వదలకుండా మీమ్స్ చేసేస్తున్నారు. రొనాల్డోలా ఎందుకు చేయలేందంటూ ఆటగాళ్లపై ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. తాజాగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఇలాంటి సమస్యే ఎదురైంది.
డబ్ల్యూటీసీ ఫైనల్ కు ముందు నిర్వహించిన విలేకర్ల సమావేశాన్ని నెటిజన్లు తెగ వాడేస్తున్నారు. ఈ సమావేశంలో విరాట్ కోహ్లీ ముందు రెండు కోకాకోలా బాటిళ్లను ఉంచారు. ఆ సమయంలో విరాట్ కూడా రోనాల్డో లాంటి పరిస్థితుల్లోనే ఉన్నాడు. కానీ, వాటిని తొలగించకుండా విలేకర్లతో మాట్లాడాడు. దీనిపై నెటిజన్లు మీమ్స్ చేసి, రోనాల్డో లా ఎందుకు చేయలేదు విరాట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. విరాట్ మమ్మల్ని చాలా నిరుత్సాహపరిచావంటూ వాపోతున్నారు. కాగా, రోనాల్డోకి విరాట్ కోహ్లీ వీరాభిమాని. కోకాకోలా విషయంలో ఆయనను ఎందుకు అనుసరించలేదని అభిమానులు సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
మరోవైపు కనీసం టాస్ వేయకుండానే తొలి రోజు ఆట ఆగిపోయింది. దీంతో మిగిలిన రోజుల్లోనైనా ఆట కొనసాగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కానీ, వాతావరణం ఎలా కనికరిస్తుందో చూడాలి. అయితే, విరాట్ కోహ్లీపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. 2019 నుంచి టెస్టుల్లో ఒక్క సెంచరీని కూడా నమోదు చెయ్యలేదు. ఈ మ్యాచ్‌లోనైనా శతకం చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ట్విట్టర్లో ఫ్యాన్స్ రియాక్షన్ మీరూ చూడండి:
Very disappointed that Virat Kohli didn’t remove the Coke bottles from his table and say “paani piyo re” during the presser #WTCFinal pic.twitter.com/sqNWlga8ES
— Sohil Nikam (@sohilnikam) June 17, 2021
Kohli is a fake Ronaldo fanboy because he still hasn’t moved those coke bottles infront of him.
— ⚔️ ☬ (@ThatGuyJSR) June 17, 2021
Coke update from the World Test Championship
Williamson and Kohli both leave their bottles in place. That’s about as exciting as the pre-match pressers have got.
— Rory Dollard (@thervd) June 17, 2021
Completely unrelated but what if tomorrow Kohli comes and moves those coke bottles away ? #WTC21 #INDvNZ https://t.co/VOuulKBALl
— Kartik O ?⚽? (@KOCricket528) June 16, 2021
Also Read:
Cristiano Ronaldo: అలా చేయడం రూల్స్‌ను ఉల్లంఘించడమే..! రోనాల్డో పై యూఈఎఫ్ఏ ఫైర్
WTC Finals: టీమిండియా తుది జట్టులో మార్పులు.! క్లారిటీ ఇచ్చిన ఫీల్డింగ్ కోచ్..