WTC Finals: టీమిండియా తుది జట్టులో మార్పులు.! క్లారిటీ ఇచ్చిన ఫీల్డింగ్ కోచ్..

క్రికెట్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూసిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ తొలి రోజు వర్షార్పణం అయిన సంగతి తెలిసిందే. దీనితో వాతావరణ..

WTC Finals: టీమిండియా తుది జట్టులో మార్పులు.! క్లారిటీ ఇచ్చిన ఫీల్డింగ్ కోచ్..
Follow us

|

Updated on: Jun 19, 2021 | 11:33 AM

క్రికెట్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూసిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ తొలి రోజు వర్షార్పణం అయిన సంగతి తెలిసిందే. దీనితో వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని టీమిండియా తుది జట్టులో మార్పులు జరిగే అవకాశం ఉందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇక దీనిపై తాజాగా ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ స్పందించారు.

‘వాతావరణ పరిస్థితులను పక్కనపెట్టి తుది జట్టును ఎంపిక చేశాం. ఈ 11 మంది ఏ పిచ్‌పై అయినా.. ఎలాంటి వాతావరణ పరిస్థితులలోనైనా అద్భుత ప్రదర్శనను ఇవ్వగలరు. ఈ 11 మందితో కూడిన జట్టే మైదానంలో అడుగుపెడుతుంది. ఒకవేళ ఏదైనా మార్పు అవసరమైతే డెసిషన్ తీసుకుంటాం” అని శ్రీధర్ తెలిపాడు. ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో టీమిండియా బరిలోకి దిగుతోంది. రోహిత్ శర్మ, శుభ్‌మాన్ గిల్, పుజారా, కోహ్లీ, రహనే, రిషబ్ పంత్, అశ్విన్, జడేజా, బుమ్రా, ఇషాంత్, షమీలు తుది జట్టులో చోటు దక్కించుకున్నారు.

Also Read:

కలలో దెయ్యాలు కనిపిస్తున్నాయా? అయితే మీరు డేంజర్ జోన్‌లో ఉన్నట్లే! ఎందుకంటే?

పైథాన్‌ను మింగేసిన నాగుపాము.. గగుర్పాటుకు గురి చేసే వీడియో.!