Cristiano Ronaldo: అలా చేయడం రూల్స్‌ను ఉల్లంఘించడమే..! రోనాల్డో పై యూఈఎఫ్ఏ ఫైర్
పోర్చుగల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో పై యూఈఎఫ్ఏ ఫైర్ అవుతోంది. మీటింగ్‌లో అలా చేయండం కాంట్రాక్ట్ నిబంధనలను ఉల్లఘించడమే అంటూ ఓ ప్రకటన విడుదల చేసింది.
Cristiano Ronaldo: పోర్చుగల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో పై యూఈఎఫ్ఏ ఫైర్ అవుతోంది. మీటింగ్‌లో అలా చేయండం కాంట్రాక్ట్ నిబంధనలను ఉల్లఘించడమే అంటూ ఓ ప్రకటనను జారీ చేసింది. హంగేరీతో మ్యాచ్‌కు ముందు యూరో కప్ మీడియా కాన్ఫరెన్సులో టేబుల్‌పైన ఉన్న రెండు కోక్ బాటిళ్లను తీసి పక్కన పెట్టాడు. అనంతరం ‘వాటర్’ అంటూ గట్టిగా కేకలు వేశాడు. అనంతరం కోకాకోలా మార్కెట్ వాల్యూ రూ. 29 వేల కోట్ల నష్టపోయింది. యూఈఎఫ్‌ఏ యూరో కప్ 2020 స్పాన్సర్లలో కోకాకోలా ఒకటి. రోనాల్డ్ విషయంపై స్పందిస్తూ… ‘ప్రతీ ఒక్కరికి తమ డ్రింక్‌ను ఎంచుకునే హక్కు ఉంటుంది’ అంటూ ప్రకటన విడుదల చేసింది. ఈ విషయం ముగిసిపోక ముందే పాల్ పోబా మరో ప్రెస్ మీట్ సందర్భంగా టేబుల్ పైన ఉన్న హెనికెన్ బీర్ బాటిల్‌ను పక్కన పెట్టాడు. అయితే, ఈ రెండు ఘటనలపై యూఈఎఫ్ఏ స్పందించింది. యూరో కప్ 2020ని స్పాన్సర్ చేస్తున్న కంపెనీల రూల్స్‌ను ప్రతీ టీమ్ గౌరవించాల్సిందేనని పేర్కొంది.
యూఈఎఫ్‌ఏ సభ్యులు మాట్లాడుతూ.. ‘యూరోప్ వ్యాప్తంగా ఫుట్‌బాల్ అభివృద్దికి ఎన్నో సంస్థలు కృషి చేస్తున్నాయి. వారు స్పాన్సర్‌షిప్ రూపంలో చేస్తున్న సహాయంతోనే ఈ అభివృద్ది జరుగుతోందని’ వెల్లడించారు. టోర్నమెంట్ డైరెక్టర్ మార్టిన్ కెలెన్ మాట్లాడుతూ.. ఈరెండు ఘటనల్లో క్రిస్టియానో రొనాల్డో చేసిన దానినే తీవ్రంగా పరిగణిస్తున్నాం. పాల్ పోబా తన మతం రూల్స్ మేరకు బీర్ బాటిల్ పక్కన పెట్టాడు. క్రిస్టియానో రొనాల్డో కేవలం వ్యక్తిగత కారణాల వల్ల కోక్ బాటిల్స్ పక్కన పెట్టాడు. దీంతో స్పాన్సర్ గౌరవానికి భంగం కలిగింది. దీనిపై తప్పకుండా తీవ్రమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ టోర్నమెంట్‌లో పాల్గొనే ముందే దీనికి సంబంధించిన రూల్స్‌పై అన్ని దేశాల జాతీయ ఫెడరేషన్లు సంతకాలు చేశాయి. ఆ రూల్స్ జట్టులోని అందరి ఆటగాళ్లు, కోచ్, మేనేజర్, ఇతర సిబ్బంది కూడా పాటించాల్సి ఉంటుందని యూఈఎఫ్ఏ పేర్కొంది. అయితే, క్రిస్టియానో రొనాల్డోపై చర్యలకు బదులుగా ఆ దేశ జాతీయ అసోసియేషన్‌కు అందించే నిధుల్లో కోత ఉండొచ్చని టాక్ నడుస్తోంది.
https://t.co/vK4KRl8FIb Cristiano Ronaldo coca cola Issue video(Please subscribe and support)#CocaCola
— Arivu (@arivu2000) June 16, 2021
Also Read:
WTC Final 2021: డబ్ల్యూటీసీ ఫైనల్‌పై ఫన్నీ మీమ్స్.. నవ్వకుండా ఉండలేరు!
Tokyo Olympics: భారత పురుషుల హాకీ జట్టు ప్రకటన..! ఒలింపిక్స్‌లో తొలిసారి ఆడనున్న 10మంది ఆటగాళ్లు
IPL 2021: వెస్టిండీస్ ఆటగాళ్ల రాకకు మార్గం సుగమం.. పంతం నెగ్గించుకున్న బీసీసీఐ!