Milkha Singh: భార‌త అథ్లెటిక్స్ దిగ్గ‌జం మిల్కా సింగ్ ఇక‌లేరు.. క‌రోనాతో పోరాడుతూ మృతి..

Milkha Singh: భార‌త దిగ్గ‌జ అథ్లెటిక్ ప్లేయ‌ర్, స్ప్రింట‌ర్ మిల్కా సింగ్ శుక్ర‌వారం రాత్రి మ‌ర‌ణించారు. క‌రోనా చికిత్స పొందుతోన్న 91 ఏళ్ల మిల్కాసింగ్ వైర‌స్‌ను జ‌యించ‌లేక త‌నువు చాలించారు. శుక్ర‌వారం రాత్రి ఒక్క‌సారిగా...

Milkha Singh: భార‌త అథ్లెటిక్స్ దిగ్గ‌జం మిల్కా సింగ్ ఇక‌లేరు.. క‌రోనాతో పోరాడుతూ మృతి..
Milka Singh Die
Follow us
Narender Vaitla

| Edited By: Ravi Kiran

Updated on: Jun 19, 2021 | 7:11 AM

Milkha Singh: భార‌త దిగ్గ‌జ అథ్లెటిక్ ప్లేయ‌ర్, స్ప్రింట‌ర్ మిల్కా సింగ్ శుక్ర‌వారం రాత్రి మ‌ర‌ణించారు. క‌రోనా చికిత్స పొందుతోన్న 91 ఏళ్ల మిల్కాసింగ్ వైర‌స్‌ను జ‌యించ‌లేక త‌నువు చాలించారు. శుక్ర‌వారం రాత్రి ఒక్క‌సారిగా జ్వ‌రం ఎక్కువ కావ‌డం.. ఆక్సిజ‌న్ స్థాయిలో త‌గ్గ‌డంతో మిల్కాసింగ్‌ను ఐసీయూకు త‌ర‌లించారు. అయితే వైద్యులు చేసిన ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌క‌పోవ‌డంతో మిల్కాసింగ్ శుక్రారం రాత్రి 11.30 గంటలకు తుది శ్వాస విడిచారు. మే 24 న “కోవిడ్ న్యుమోనియా” కారణంగా ఆయ‌న‌ మొహాలి ఫోర్టిస్ ఆసుపత్రిలోని ఐసీయులో చేరారు. అనంతరం జూన్ 3 న చండీగర్‌లోని పిజిఐఎంఆర్‌కు తరలించారు. ఇదిలా ఉంటే మిల్కాసింగ్ భార్య నిర్మ‌ల్ కూడా ఇటీవ‌ల క‌రోనా కార‌ణంగా మ‌ర‌ణించిన విష‌యం తెలిసిందే.

మిల్కాసింగ్ 1932 నవంబర్‌ 20న పాకిస్తాన్‌లోని పంజాబ్‌లో ఉన్న గోవింద్‌పురలో జన్మించారు. సిక్‌రాథోడ్‌ రాజపుత్రుల కుటుంబంలో జన్మించిన మిల్కాసింగ్‌ 1951లో భారత సైన్యంలో చేరారు. ఆర్మీ నిర్వహించిన పరుగులపోటీలో మిల్కాసింగ్‌కు ఆరో స్థానంలో నిలిచారు. అనంతరం అథ్లెట్‌గా మారారు. మిల్కాసింగ్ నాలుగు సార్లు ఆసియా క్రీడల్లో స్వర్ణం సహా 1958 కామన్వెల్త్‌ గేమ్స్‌లో మిల్కా పసిడి పతకంతో మెరిశాడు. మిల్కాసింగ్ జీవిత క‌థ ఆధారంగా బాలీవుడ్‌లో ‘భాగ్‌ మిల్కా భాగ్‌’ అనే సినిమా వ‌చ్చిన విష‌యం తెలిసిందే.

ప్ర‌ముఖుల సంతాపం..

మిల్కాసింగ్ మ‌ర‌ణంపై ప‌లువురు ప్ర‌ముఖులు సంతాపం తెలిపారు. ఈ క్ర‌మంలోనే దేశ ప్ర‌ధాని న‌రేంద మోదీ ట్విట్ట‌ర్ వేదిక‌గా మిల్కాసింగ్ దేశ ప్ర‌జ‌ల హృద‌యాల్లో చోటు సంపాదించుకున్నార‌ని వ్యాఖ్యానించారు. ఇక ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ ట్వీట్ చేస్తూ.. మిల్కాసింగ్ మ‌ర‌ణ వార్త క‌లిచి వేసింద‌ని, ఆయ‌న కుటుంబానికి సంతాపం వ్య‌క్తి చేశారు.

Also Read: Cristiano Ronaldo: అలా చేయడం రూల్స్‌ను ఉల్లంఘించడమే..! రోనాల్డో పై యూఈఎఫ్ఏ ఫైర్

Tokyo Olympics: భారత పురుషుల హాకీ జట్టు ప్రకటన..! ఒలింపిక్స్‌లో తొలిసారి ఆడనున్న 10మంది ఆటగాళ్లు

IPL 2021: వెస్టిండీస్ ఆటగాళ్ల రాకకు మార్గం సుగమం.. పంతం నెగ్గించుకున్న బీసీసీఐ!