WTC Final 2021: డబ్ల్యూటీసీ ఫైనల్‌పై ఫన్నీ మీమ్స్‌.. నవ్వకుండా ఉండలేరు!

డబ్ల్యూటీసీ ఫైనల్‌ తొలిరోజు ఆటకు వర్షం అడ్డుపడింది. క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆశగా ఎదురుచూసిన ఈ మ్యాచ్‌.. వరుణుడి రాకతో ఆగిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

WTC Final 2021: డబ్ల్యూటీసీ ఫైనల్‌పై ఫన్నీ మీమ్స్‌.. నవ్వకుండా ఉండలేరు!
Wtc Final Funny Memes
Follow us
Venkata Chari

|

Updated on: Jun 18, 2021 | 6:49 PM

WTC Final 2021: డబ్ల్యూటీసీ ఫైనల్‌ తొలిరోజు ఆటకు వర్షం అడ్డుపడింది. క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆశగా ఎదురుచూసిన ఈ మ్యాచ్‌.. వరుణుడి రాకతో ఆగిపోవడంతో అసహనానికి గురవుతున్నారు. వర్షమా కాస్త జాలీ చూపమ్మా అంటూ వేడుకుంటున్నారు. మరికొందరు మాత్రం సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్, ఫన్నీ వీడియోలు పోస్ట్ చేసి నవ్విస్తున్నారు. ఇందులో రైన్ రైన్‌ గో ఎవే పాటను మార్చి ” రైన్ రైన్ గో ఎవే.. కమ్ ఎగైన్ ఆప్టర్ 22.. ఇండియా వాంట్స్‌ టూ ప్లే.. రైన్ రైన్ గో ఎవే” అంటూ సృజనాత్మకతకు పదునుపెట్టాడు. మరొకరు స్టేడియంలో వర్షం పడుతుంటే.. సిబ్బంది కోహ్లీని, కేన్ విలియమ్సన్‌ను ఎత్తుకొని టాస్‌ కోసం తీసుకొస్తున్నట్లు మీమ్స్ క్రియోట్ చేసి పంచుకున్నాడు. అలాగే అండర్ వాటర్‌లో క్రికెట్‌ ఆడుతున్న ఫొటోను షేర్ చేసి నవ్వించాడు. మరో నెటిజన్.. ‘‘కేదార్‌ యాదవ్‌ వరల్డ్‌ కప్-2019 సందర్భంగా చెప్పినట్లు.. వర్షాన్ని వెళ్లిపొమ్మని చెప్పొచ్చుగా బ్రో’’ అంటూ ఓల్డ్ వీడియోను పంచుకున్నాడు.

వర్షంలో క్రికెట్ ఆడితే పరిస్థితి ఇలాగే ఉంటుందంటూ గల్లీ క్రికెట్‌ ఆడుతూ ఓ వ్యక్తి జారిపోయిన మీమ్స్‌ షేర్‌ చేశారు కొందరు. ఇలాంటి ఫన్నీ మీమ్స్ మీకోసం అందిస్తున్నాం..చూసి హాయిగా నవ్వుకోండి. కాగా వర్షం కారణంతో మధ్యాహ్నం 3 గంటలకు మొదలు కావాల్సిన మ్యాచ్‌ తొలి సెషన్‌ రద్దైన సంగతి తెలిసిందే. మరో ఐదు రోజులు ఇలానే ఉంటుందనే నేపథ్యంలో డబ్ల్యూటీసీ ఫైనల్ మొత్తం ఆడకుండానే తుడిచిపెట్టుకపోనుందా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.

Also Read:

WTC Finals 2021: వరుణుడి రాకతో మొదటి సెషన్ ఆట రద్దు.. చిత్తడిగా మారిన స్టేడియం..

WTC Final 2021: తొలి సెషన్ ఆట రద్దు.. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు వర్షం అడ్డంకి! మిగతా రోజుల ఆటపైనా అనుమానం?