AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhanush New Movie: శేఖర్ కమ్ములతో ధనుష్ మూవీ ఫిక్స్..! సంతోషంగా ఉందంటోన్న కోలీవుడ్‌ స్టార్‌

కోలీవుడ్ స్టార్ ధనుష్ కొత్త సినిమా ఓకే అయింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ ప్రకటన విడుదల చేశారు హీరో ధనుష్. టాలీవుడ్‌లో ప్రేమకథా చిత్రాలకు మారుపేరుగా నిలిచిన సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ములతో నూతన సినిమా చేయబోతున్నాడు.

Dhanush New Movie: శేఖర్ కమ్ములతో ధనుష్ మూవీ ఫిక్స్..! సంతోషంగా ఉందంటోన్న కోలీవుడ్‌ స్టార్‌
Dhanush New Movie Fix With Sekhar Kammula
Venkata Chari
|

Updated on: Jun 19, 2021 | 5:45 PM

Share

Dhanush New Movie: కోలీవుడ్ స్టార్ ధనుష్ కొత్త సినిమా ఓకే అయింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ ప్రకటన విడుదల చేశారు హీరో ధనుష్. టాలీవుడ్‌లో ప్రేమకథా చిత్రాలకు మారుపేరుగా నిలిచిన సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ములతో నూతన సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాను త్రిభాషా చిత్రంగా తెలుగు, హిందీ, తమిళంలో భారీ స్థాయిలో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. దివంగత సునీతా నారంగ్ జయంతి సందర్భంగా శుక్రవారం అధికారికంగా ఈ సినిమాను ప్రకటించారు. ధనుష్, శేఖర్ కమ్ముల కాంబోలో తెరకెక్కనున్న ఈ క్రేజీ ప్రాజెక్టుపై అప్పుడే అంచనాలు భారీగా నెలకొన్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ధనుష్ అభిమానులు తెగ సందడి చేస్తున్నారు. “శేఖర్ కమ్ముల, నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కర్ రామ్ మోహన్ రావులతో కలిసి పనిచేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని” హీరో ధనుష్ రాసుకొచ్చారు. అలాగే “నేను ఆరాధించే దర్శకులలో శేఖర్ కమ్ముల సార్ ఒకరు. ఆయనతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉందని” ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు ధనుష్ ట్వీట్ చేశాడు.

అయితే, ధనుష్ కి ఇది తెలుగులో తొలి స్ట్రైయిట్ సినిమా కావడం విశేషం. అయితే త్రిభాషా చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమా కోసం మూడు భాషలకు సంబంధించిన ప్రముఖ స్టార్లు భాగస్వామ్యం కానున్నట్లు తెలుస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్టు త్వరలోనే పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ బ్యానర్‌పై తెరకెక్కించనున్నారు. నారాయణ్‌ దాస్‌ నారంగ్‌, రామ్మోహన్‌రావు ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు రావాల్సి ఉంది. డైరెక్టర్ శేఖర్ కమ్ముల ప్రస్తుతం ‘లవ్‌స్టోరీ’ పనుల్లో బిజీగా ఉన్నారు. అలాగే, హీరో ధనుష్ బాలీవుడ్‌లో తెరకెక్కనున్న ‘అత్రాంగి రే’, హాలీవుడ్‌లో రానున్న ‘ది గ్రే మ్యాన్‌’ షూటింగ్‌లతో బిజీగా మారాడు.

ధనుష్‌ ప్రస్తుతం “జగమే తందిరమ్‌’ (తెలుగులో జగమే తంత్రం) సినిమాతో ఓటీటీలో సందడి చేస్తున్నాడు. శుక్రవారం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై ఈ సినిమా బాగుందనే టాక్ వినిపిస్తోంది. ధనుష్‌ ఇందులో గ్యాంగ్‌స్టర్‌గా నటించాడు. కార్తిక్‌ సుబ్బరాజ్‌ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో ఇంటర్నేషనల్‌ డాన్‌గా కనింపించాడు. ఈసినిమా ఏకంగా 17 భాషల్లో 190 దేశాలకు పైగా దేశాల్లో విడుదల అయింది.

Also Read:

Hanuman Movie: ప్రశాంత్ వర్మ డైరెక్షన్‏లో మరోసారి యంగ్ హీరో తేజ.. కీలక పాత్రలో జయమ్మ..

Salaar Movie: ‘సలార్’ మూవీ నుంచి క్రేజీ అప్‏డేట్.. ప్రభాస్ సినిమాకు రూ.100 కోట్లకు పైగే..