AP Weather Report: ఆంధ్రప్రదేశ్‌కు వర్ష సూచన.. రాగల మూడు రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం..
AP Weather Report: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమ, నైరుతి దిశల నుంచి విపరీతమైన గాలులు వీస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు విస్తారంగా...
AP Weather Report: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమ, నైరుతి దిశల నుంచి విపరీతమైన గాలులు వీస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు విస్తారంగా వ్యాపించడంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమైంది. ఇదిలాఉంటే.. ఆంధ్రప్రదేశ్‌లో రాగల మూడు రోజులకు వరకు వాతావరణ సూచనలను అధికారులు ప్రకటించారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో ఈ రోజు, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతంలో ఈ రోజు, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురుస్తాయన్నారు. రాయలసీమలో ఈ రోజు, రేపు, ఎల్లుండి తేలికపాటి వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు వెల్లడించారు.
ఇదిలాఉంటే.. ఈ రోజు నైరుతి రుతుపవనాలు ఉత్తర అరేబియా సముద్రం, సౌరాష్ట్ర, కచ్ ప్రాంతం అంతటా.. గుజరాత్, మధ్యప్రదేశ్ లలోని అన్ని ప్రాంతాలలో, రాజస్థాన్, పశ్చిమ ఉత్తర ప్రదేశ్ లలోని మరికొన్ని ప్రాంతాలలోనికి ప్రవేశించాయని అధికారులు తెలిపారు. నార్తరన్ లిమిట్ ఆఫ్ మాన్‌సూన్.. బార్మర్, భిల్వారా, ధోల్పూర్, అలీఘడ్, మీరట్, అంబాలా, అమృత్‌సర్ ల గుండా వెళ్తోందన్నారు. ఇక రాజస్థాన్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, హర్యానా, చండీఘడ్, ఢిల్లీ, పంజాబ్ లలోని మిగిలిన ప్రాంతాలలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించటానికి వాతావరణ పరిస్థితులు అంతగా అనుకూలంగా లేవని వాతావరణ అధికారులు తెలిపారు.
Also read: