ఏపీలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. శనివారం కొత్తగా మరో 62 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో.. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1525కి చేరింది. అటు ఈ మహమ్మారి కారణంగా 33 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉంటే తాజాగా విశాఖపట్నంలో తొలి కరోనా మరణం సంభవించింది. గురువారం నాడు 70 ఏళ్ల వృద్దుడు అనారోగ్యంతో కేజీహెచ్‌లో చేరగా.. వైద్యులు ఆయన్ని తాత్కాలిక ఐసోలేషన్ వార్డులో ఉంచి కరోనా పరీక్షలు నిర్వహించారు.
అయితే రిపోర్టు వచ్చేలోపే అనూహ్యంగా ఆ పెద్దాయన శుక్రవారం ఉదయం మృతి చెందారు. కిడ్నీ సమస్యతోనే చనిపోయాడు కాబట్టి మృతుని బంధువులు మృతదేహాన్ని చెంగలరావుపేటలోని తమ ఇంటికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. ఇక ఆ తర్వాత కరోనా టెస్ట్ రిపోర్ట్ వచ్చింది. దానిలో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీనితో కేజీహెచ్ అధికారులు అప్రమత్తమయ్యారు. వృద్ధుడు చికిత్స పొందిన కేజీహెచ్ తాత్కాలిక ఐసొలేషన్ వార్డులో పనిచేస్తున్న డాక్టర్లు, నర్సులు, వార్డ్ బాయ్స్, శానిటేషన్ వర్కర్లను 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచారు. కాగా, ప్రోటోకాల్ ప్రకారం వారందరికీ ఏడో రోజు, 14వ రోజున కరోనా టెస్టులు జరుపుతామని కేజీహెచ్ పర్యవేక్షణ అధికారి డాక్టర్ అర్జున్ తెలిపారు. అంతేకాకుండా డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది అందరూ కూడా పీపీఈ కిట్లు ధరించారు కాబట్టి వైరస్ వ్యాపించడని అనుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.
Read More:
కొంపముంచిన వన్ బై టూ ఛాయ్… గుంటూరులో ఏకంగా 100 మందికి..
ప్రభుత్వం సంచలన నిర్ణయం.. భారీగా తగ్గనున్న పెట్రోల్ ధరలు.!
లాక్‌డౌన్ 3.0.. జోన్లు వారీగా నిబంధనలు ఇవే..
మందుబాబులకు గుడ్ న్యూస్.. లాక్ డౌన్ తర్వాత తెరుచుకోనున్న మద్యం షాపులు!