దేశ రాజధానిలో మళ్లీ పెరుగుతున్న కేసులు
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. గత కొద్ది రోజులుగా అదుపులోకి వచ్చిందనుకున్న వేళ.. మళ్లీ రోజు వెయ్యికి..
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. గత కొద్ది రోజులుగా అదుపులోకి వచ్చిందనుకున్న వేళ.. మళ్లీ రోజు వెయ్యికి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 1,257 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు ఢిల్లీ వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,47,391కి చేరింది. వీటిలో కరోనా నుంచి కోలుకుని 1,32,384 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఢిల్లీ వ్యాప్తంగా 10,868 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ విషయాన్ని ఢిల్లీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
కాగా, మంగళవారం నాడు ఢిల్లీ వ్యాప్తంగా 19వేలకుపైగా కరోనా పరీక్షలు నిర్వహించారు. 5,356 ఆర్టీపీసీఆర్ ద్వారా నిర్వహించగా.. 14,084 రాపిడ్ యాంటిజెన్ ద్వారా నిర్వహించారు. ఇప్పటి వరకు ఢిల్లీ వ్యాప్తంగా 12,23,845 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
5356 RTPCR/CBNAAT/TrueNat tests and 14,084 Rapid antigen tests conducted today. 12,23,845 tests done so far: Government of Delhi https://t.co/d5SitByRmo
— ANI (@ANI) August 11, 2020
Read More :