AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీలో రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లు ఇవే.. వివరాలు ఇవిగో..

రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని బట్టి ప్రాంతాలను ఏపీ ప్రభుత్వం మూడు జోన్లుగా విభజించింది. వాటిలో 41 ప్రాంతాలు రెడ్‌జోన్‌లో ఉండగా.. మరో 45 ప్రదేశాలను ఆరంజ్ జోన్‌లుగా మ్యాపింగ్ చేశారు. మొత్తంగా ఈ రెండు జోన్లలోనూ ఉన్న 86 ప్రాంతాలూ.. గ్రామాలు, పట్టణాల్లో 43 ప్లేస్‌ల చొప్పున ఉన్నాయి. ఇక కరోనా ప్రభావం లేని.. గ్రీన్ జోన్ ప్రాంతాలుగా 590 మండలాలను గుర్తించారు. ఇదిలా ఉంటే కర్నూలులో అత్యధికంగా 15 రూరల్ మండలాల్లో కరోనా కేసులు […]

ఏపీలో రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లు ఇవే.. వివరాలు ఇవిగో..
Ravi Kiran
|

Updated on: Apr 14, 2020 | 10:23 PM

Share

రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని బట్టి ప్రాంతాలను ఏపీ ప్రభుత్వం మూడు జోన్లుగా విభజించింది. వాటిలో 41 ప్రాంతాలు రెడ్‌జోన్‌లో ఉండగా.. మరో 45 ప్రదేశాలను ఆరంజ్ జోన్‌లుగా మ్యాపింగ్ చేశారు. మొత్తంగా ఈ రెండు జోన్లలోనూ ఉన్న 86 ప్రాంతాలూ.. గ్రామాలు, పట్టణాల్లో 43 ప్లేస్‌ల చొప్పున ఉన్నాయి. ఇక కరోనా ప్రభావం లేని.. గ్రీన్ జోన్ ప్రాంతాలుగా 590 మండలాలను గుర్తించారు. ఇదిలా ఉంటే కర్నూలులో అత్యధికంగా 15 రూరల్ మండలాల్లో కరోనా కేసులు నమోదు కాగా.. నెల్లూరులో 13 మండలాల్లో వైరస్ సోకింది. అటు గుంటూరు, కర్నూలు, నెల్లూరు, విశాఖపట్నం, విజయవాడ ప్రధాన మున్సిపల్‌ కార్పొరేషన్‌లలోనే ఏకంగా 146 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వ్యవసాయ కార్యకలాపాలకు ఏ జోన్‌లోనూ ఆంక్షలు విధించకపోగా.. ఆరెంజ్, గ్రీన్ జోన్లలో మాత్రం వివాహాలకు షరతులతో కూడిన అనుమతిని మంజూరు చేస్తున్నారు. కాగా, రెడ్, ఆరంజ్, గ్రీన్ జోన్లలలో అనుమతులు ఇలా ఉన్నాయి.

రెడ్‌జోన్‌లో టూవీలర్, ప్రైవేటు కారు, ప్రజారవాణా, సూక్ష్మ చిన్నతరహా పరిశ్రమలు, మాల్స్, బ్యాంకులు, కార్యాలయాలు, వివాహాలు అనుమతి ఉండవు. అటు ఆరెంజ్ జోన్‌లో టూవీలర్‌పై ఒకరికి మాత్రమే అనుమతి ఉండగా.. ప్రైవేటు కారులో డ్రైవర్ కాకుండా మరొకరిని అనుమతిస్తారు. ప్రజా రవాణా, మాల్స్‌కు అనుమతులు లేవు. ఇక చిన్న తరహ పరిశ్రమలకు స్థానిక సిబ్బందికే అనుమతి ఉంటుంది. బ్యాంకులు, కార్యాలయాలు 50 శాతం స్టాఫ్‌తో పని చేస్తాయి. వివాహాలు అయితే 10 మందికి మాత్రమే అనుమతి ఉంటుంది. చివరిగా గ్రీన్ జోన్‌లో టూవీలర్‌పై ఒకరికి అనుమతి ఉంది, ప్రైవేటు కారులో డ్రైవర్ కాకుండా మరో ఇద్దరికీ, ప్రజారవాణా సీట్లలో 25 శాతం మించకుండా ఉండాలి. చిన్న తరహ పరిశ్రమలకు స్థానిక సిబ్బందికే అనుమతి ఉంటుంది. మాల్స్‌ను దూరం బట్టి అనుమతిస్తారు. ఆరెంజ్ జోన్ మాదిరిగా ఈ జోన్‌లో కూడా బ్యాంకులు, కార్యాలయాలు 50 శాతం స్టాఫ్‌తో పని చేస్తాయి. వివాహాలకు 20 మందిని అనుమతిస్తారు.

ఇవి చదవండి:

లాక్ డౌన్ అమలులో విజయవంతం.. ఏపీ అగ్రస్థానం.!

అక్తర్‌కు అఫ్రిదీ వత్తాసు.. మోదీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు..

ఇది మన భారతం.. పేదోడి ఆకలి కేకలు.. రోడ్డుపై పారబోసిన పాలకై ప్రయత్నం..

Follow Us