AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేంద్రం మరో కీలక నిర్ణయం.. ఈ-పాస్‌గా ‘ఆరోగ్య సేతు’ యాప్..

కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించడంలో భాగంగా కేంద్రం రూపొందించిన ‘ఆరోగ్య సేతు’ యాప్‌ను ఈ-పాస్‌గా కూడా ఉపయోగించవచ్చునని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూత్రప్రాయంగా పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఈ యాప్‌లో మరో రెండు ఫీచర్లను చేర్చింది. వీటిల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఎలక్ట్రానిక్ పాస్(ఈ- పాస్). లాక్ డౌన్ వేళ బయట తిరిగేందుకు వీలుగా కోవిడ్ లక్షణాలు, ఉత్పత్తి స్థానం, మాత్రికలను బట్టి దీనిని రూపొందించారు. ఇందులో గ్రీన్, ఆరెంజ్, రెడ్ రంగులు […]

కేంద్రం మరో కీలక నిర్ణయం.. ఈ-పాస్‌గా 'ఆరోగ్య సేతు' యాప్..
Ravi Kiran
|

Updated on: Apr 16, 2020 | 10:01 PM

Share

కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించడంలో భాగంగా కేంద్రం రూపొందించిన ‘ఆరోగ్య సేతు’ యాప్‌ను ఈ-పాస్‌గా కూడా ఉపయోగించవచ్చునని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూత్రప్రాయంగా పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఈ యాప్‌లో మరో రెండు ఫీచర్లను చేర్చింది. వీటిల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఎలక్ట్రానిక్ పాస్(ఈ- పాస్). లాక్ డౌన్ వేళ బయట తిరిగేందుకు వీలుగా కోవిడ్ లక్షణాలు, ఉత్పత్తి స్థానం, మాత్రికలను బట్టి దీనిని రూపొందించారు. ఇందులో గ్రీన్, ఆరెంజ్, రెడ్ రంగులు ఉంటాయి.

ఆకుపచ్చ రంగు వస్తే.. సదరు వ్యక్తి బహిరంగ ప్రదేశాల్లో స్వేచ్చగా తిరగొచ్చు. ఇక ఆరెంజ్ కలర్ వస్తే.. ఆ వ్యక్తి ఎవరితోనూ కలవకూడదు. ఓన్లీ ఆఫీస్, ఇంటికి సంబంధించిన కార్యకలాపాల్లోనే పాల్గొనాలి. అంతేకాకుండా సామాజిక దూరాన్ని తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. ఇక రెడ్ వస్తే మాత్రం వారు ఎవ్వరిని కలవకూడదు. పూర్తిగా గృహ నిర్భంధంలోనే ఉండాలి. ఇప్పటికే చైనాలో ఈ పద్దతిని విజయవంతంగా అనుసరించగా.. ఇప్పుడు ఇండియాలో కూడా దీన్ని ప్రయత్నించనున్నారు.

ఈ-పాస్‌తో పాటు కొత్తగా చేర్చిన మరో ఫీచర్.. కోవిడ్‌ అప్‌డేట్స్‌.. ప్రపంచం, దేశంలో ఉన్న కరోనా పాజిటివ్ కేసుల వివరాలు, ఏ ఆసుపత్రుల్లో ఏయే సౌకర్యాలున్నాయి, ఒకవేళ కరోనా వస్తే ఎవరిని ఎలా సంప్రదించాలి అని మొదలైనవన్నీ కూడా దీనిలో ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫీచర్లు ఆపరేషనలైజ్‌ కాలేదు. మరికొద్ది రోజుల్లోనే వీటిని ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ప్రధాన శాస్త్ర సలహాదారు విజయ్‌ రాఘవన్‌ తెలిపారు.

Also Read:

ప్రాణాలు వదిలేస్తాం కానీ.. మసీదును విడిచిపెట్టం..

అక్షయ్ రూ.25 కోట్లు విరాళం ఇవ్వడం పెద్ద తప్పు.. శత్రుఘ్న సిన్హా సంచలన వ్యాఖ్యలు..

చేతులెత్తేసిన ఇమ్రాన్ ఖాన్.. ‘మమ్మల్ని ఆదుకోండి’ అంటూ భారత్‌ను వేడుకోలు..

చైనాలోని ల్యాబ్‌లో కరోనా వైరస్‌ను సృష్టించలేదు..