‘తబ్లీఘీ జమాత్’ ఘటన.. కేంద్రం, అజిత్ దోవల్‌పై మహారాష్ట్ర హోంమంత్రి సంచలన వ్యాఖ్యలు..

Coronavirus Outbreak: ఢిల్లీలో ఇటీవల జరిగిన నిజాముద్దీన్ మార్కజ్ కార్యక్రమం విషయంలో ఆ రాష్ట్ర పోలీసులు, జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్ దోవల్ వ్యవహరించిన తీరుపై మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ విమర్శించారు. ఈమేరకు బుధవారం ఆయన ఓ లేఖను విడుదల చేసి.. అందులో ఢిల్లీలో తబ్లీఘి జమాత్ కార్యక్రమాన్ని ఎలా నిర్వహించిందని.. దానికి పోలీసులు ఎలా పర్మిషన్ ఇచ్చారనే ప్రశ్నలను లేవనెత్తారు. మర్కజ్‌కు హాజరైన వారి సహాయంతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇతర […]

'తబ్లీఘీ జమాత్' ఘటన.. కేంద్రం, అజిత్ దోవల్‌పై మహారాష్ట్ర హోంమంత్రి సంచలన వ్యాఖ్యలు..
Follow us

|

Updated on: Apr 09, 2020 | 2:12 PM

Coronavirus Outbreak: ఢిల్లీలో ఇటీవల జరిగిన నిజాముద్దీన్ మార్కజ్ కార్యక్రమం విషయంలో ఆ రాష్ట్ర పోలీసులు, జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్ దోవల్ వ్యవహరించిన తీరుపై మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ విమర్శించారు. ఈమేరకు బుధవారం ఆయన ఓ లేఖను విడుదల చేసి.. అందులో ఢిల్లీలో తబ్లీఘి జమాత్ కార్యక్రమాన్ని ఎలా నిర్వహించిందని.. దానికి పోలీసులు ఎలా పర్మిషన్ ఇచ్చారనే ప్రశ్నలను లేవనెత్తారు.

మర్కజ్‌కు హాజరైన వారి సహాయంతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇతర రాష్ట్రాల్లో కరోనావైరస్ వ్యాప్తి చేసిందంటూ అనిల్ దేశ్‌ముఖ్ ఆరోపించారు. “బీజేపీ ప్రభుత్వం దేశమంతా కరోనావైరస్ వ్యాప్తి చెందడానికి మతపరమైన కార్యక్రమానికి అనుమతించిందని” ఆయన అన్నారు. ‘మార్చి 14,15 తేదిల్లో వాసాయిలో జరగాల్సిన నిజాముద్దీన్ మర్కజ్ అభినందన సభకు అనుమతులను మహారాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది. ఈ కార్యక్రమంలో కోసం వారు ఫిబ్రవరి 5న అనుమతి కోరగా.. కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యం రాష్ట్ర ప్రభుత్వం ఆ కార్యక్రమానికి అనుమతి ఇవ్వలేదని మంత్రి చెప్పారు.

అనిల్ దేశ్‌ముఖ్ కేంద్రానికి రాసిన లేఖలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, ఢిల్లీ పోలీసులు, ఎన్‌ఎస్‌ఏ అజిత్ దోవల్‌కు ఎనిమిది ప్రశ్నలు సంధించారు. “డోవల్ తెల్లవారుజామున 2 గంటలకు మర్కజ్ చీఫ్ మౌలానా సాద్‌ను కలవడానికి వెళ్ళారు. ఎన్‌ఎస్‌ఏ అతన్ని కలవడానికి ఎందుకు వెళ్ళింది? అక్కడ డోవల్ లేదా ఢిల్లీ పోలీసుల పని ఏమిటి? డోవల్, ఢిల్లీ పోలీస్ చీఫ్ ఇంకా ఈ విషయంపై ఎందుకు మాట్లాడలేదు.? మౌలానా, అజిత్ దోవల్ మధ్య జరిగిన చర్చ ప్రజలకు తెలియజేయాలి “అని దేశ్‌ముఖ్ డిమాండ్ చేశారు. అంతేకాక “మళ్ళీ, డోవల్‌ను కలిసిన తరువాత మౌలానా ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్ళాడు? అతను ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు.? మౌలానాతో ఎన్ఎస్ఎకు ఎలాంటి సంబంధం ఉంది.?” అని మంత్రి ప్రశ్నించారు.

ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నిజాముద్దీన్ మర్కజ్‌కు ఢిల్లీ పోలీసులు ఎందుకు అనుమతి ఇచ్చారని ఆయన అడిగారు. “నిజాముద్దీన్ పోలీస్ స్టేషన్ తబ్లిఘి జమాత్ సంఘటన జరిగిన ప్రదేశానికి సమీపంలో ఉన్నా కూడా పోలీసులు ఈ కార్యక్రమాన్ని ఎందుకు ఆపలేదు. ఈ సమావేశం వల్లే కరోనా వైరస్ ఇతర రాష్ట్రాలకు వ్యాప్తి చెందింది. ఈ ఘటనకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పూర్తిగా బాధ్యత వహిస్తుందని దేశ్‌ముఖ్ ఆరోపించారు. అయితే ఈ విషయంపై మీడియా ఆయన్ని సంప్రదించాలని ప్రయత్నించగా.. ఆయన అందుబాటులోకి రాలేదు.

కాగా, ఢిల్లీలో జరిగిన నిజాముద్దీన్ మర్కజ్ వల్ల దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య అమాంతం పెరిగింది. ఇప్పటివరకు దేశంలో 5734 కేసులు నమోదు కాగా.. అత్యధికంగా 1135 పాజిటివ్ కేసులు మహారాష్ట్రలో నమోదయ్యాయి.

For More News:

ధరలు పెంచితే ఏడేళ్ల జైలు.. నిత్యావసర వస్తు చట్టం అమలు..

ఆ మూడింటిని జూన్ వరకు బంద్ చేస్తారా..?

కరోనా కరాళ నృత్యం.. ప్రపంచవ్యాప్తంగా 15 లక్షలు దాటిన కేసులు..

దేశంలో 6 వేలకు చేరుతున్న పాజిటివ్ కేసులు.. ఏయే రాష్ట్రంలో ఎలా ఉందంటే..

కోహ్లీ అంటే ఆస్ట్రేలియా క్రికెటర్లకు భయం..

మద్యం అమ్మకాలకు అనుమతివ్వండి.. 10 రాష్ట్రాల సీఎంలకు లేఖలు..

కరోనా కల్లోలం.. అమెరికాలో ఒక్క రోజులోనే 1,940 మంది మృతి..

‘పుష్ప’కు ఆరో వేలు.. అసలు ట్విస్ట్ ఇదేనా..

గాంధీ ఆసుపత్రిలో కరోనా బాధితుల మెనూ ఇదే…

దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.