కోహ్లీ అంటే ఆస్ట్రేలియా క్రికెటర్లకు భయం..

IPL 2020 Updates: ఐపీఎల్ కాంట్రాక్టులను దక్కించుకునేందుకు ఆస్ట్రేలియా క్రికెటర్లు ఇండియన్ కెప్టెన్ విరాట్ కోహ్లీని స్లెడ్జింగ్ చేసేందుకు అసలు ప్రయత్నించరని ఆ జట్టు మాజీ ఆటగాడు మైకేల్ క్లార్క్ స్పష్టం చేశాడు. టీమిండియా క్రికెటర్లను చూసి ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ భయపడుతున్నారని.. తమ ఐపీఎల్ కాంట్రాక్టులను కాపాడుకునేందుకు కొన్నేళ్లుగా కోహ్లీసేనను స్లెడ్జింగ్ చేయడం ఆపేశారని అన్నాడు. అంతేకాక అంతర్జాతీయ క్రికెట్‌లో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఎంతటి శక్తివంతమైనదో అందరికి తెలిసిన విషయమేనని తాజాగా మీడియాకు ఇచ్చిన […]

కోహ్లీ అంటే ఆస్ట్రేలియా క్రికెటర్లకు భయం..
Follow us

|

Updated on: Apr 09, 2020 | 2:10 PM

IPL 2020 Updates: ఐపీఎల్ కాంట్రాక్టులను దక్కించుకునేందుకు ఆస్ట్రేలియా క్రికెటర్లు ఇండియన్ కెప్టెన్ విరాట్ కోహ్లీని స్లెడ్జింగ్ చేసేందుకు అసలు ప్రయత్నించరని ఆ జట్టు మాజీ ఆటగాడు మైకేల్ క్లార్క్ స్పష్టం చేశాడు. టీమిండియా క్రికెటర్లను చూసి ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ భయపడుతున్నారని.. తమ ఐపీఎల్ కాంట్రాక్టులను కాపాడుకునేందుకు కొన్నేళ్లుగా కోహ్లీసేనను స్లెడ్జింగ్ చేయడం ఆపేశారని అన్నాడు. అంతేకాక అంతర్జాతీయ క్రికెట్‌లో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఎంతటి శక్తివంతమైనదో అందరికి తెలిసిన విషయమేనని తాజాగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లార్క్ వివరించాడు.

ఒక్క ఆస్ట్రేలియా మాత్రమే కాదు.. మిగతా జట్లు కూడా కోహ్లీ టీంను స్లెడ్జ్ చేయడానికి అలోచిస్తాయని క్లార్క్ అన్నాడు. ఎందుకంటే ప్రతీ ఏడాది భారత ఆటగాళ్లతో కలిసి వారు ఐపీఎల్ ఆడాలని వారికి తెలుసు. ఐపీఎల్ ద్వారా మిలియన్ డాలర్లు సంపాదించవచ్చునని.. అందుకే కోహ్లిని వారు స్లెడ్జ్ చెయ్యరని తెలిపాడు. కాగా, ఈ ఏడాది సీజన్ కోసం ఆసీస్ ఆల్​రౌండర్ ప్యాట్ కమిన్స్​ను కోల్​కతా నైట్​రైడర్స్ అత్యధికంగా రూ.15.5కోట్లకు దక్కించుకున్న సంగతి తెలిసిందే.

For More News:

ధరలు పెంచితే ఏడేళ్ల జైలు.. నిత్యావసర వస్తు చట్టం అమలు..

ఆ మూడింటిని జూన్ వరకు బంద్ చేస్తారా..?

కరోనా కరాళ నృత్యం.. ప్రపంచవ్యాప్తంగా 15 లక్షలు దాటిన కేసులు..

దేశంలో 6 వేలకు చేరుతున్న పాజిటివ్ కేసులు.. ఏయే రాష్ట్రంలో ఎలా ఉందంటే..

‘తబ్లీఘీ జమాత్’ ఘటన.. కేంద్రం, అజిత్ దోవల్‌పై మహారాష్ట్ర హోంమంత్రి సంచలన వ్యాఖ్యలు..

మద్యం అమ్మకాలకు అనుమతివ్వండి.. 10 రాష్ట్రాల సీఎంలకు లేఖలు..

కరోనా కల్లోలం.. అమెరికాలో ఒక్క రోజులోనే 1,940 మంది మృతి..

‘పుష్ప’కు ఆరో వేలు.. అసలు ట్విస్ట్ ఇదేనా..

గాంధీ ఆసుపత్రిలో కరోనా బాధితుల మెనూ ఇదే…