Breaking News
  • ఢిల్లీ: భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష 82 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 182143. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 89995. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 86984. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 5164. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • అమరావతి: నిమ్మగడ్డ అంశం పై కొనసాగుతున్న ప్రభుత్వం కసరత్తు . ఇప్పటికే సుప్రీం కి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం . నిమగడ్డ తనంతట తాను పునః నియమిచుకున్న సర్కులర్ ను వెనక్కు తీసుకున్న ఎస్ఈసి.
  • చిత్తూరు జిల్లా : ఆంధ్ర తమిళనాడు సరిహద్దుల్లో మిడతల దండు. అయితే ఇవి మహారాష్ట్రనుంచి వచ్చిన మిడతల దండు కాదంటున్న అధికారులు. కుప్పం సరిహద్దులోని తమిళనాడు వేపనపల్లి లో ప్రత్యక్షమైన మిడతల దండు. రాత్రికి రాత్రే పంటలు నాశనం చేస్తున్న మిడతలు. పచ్చగా కనిపించిన ప్రతి చెట్టుని తినేస్తున్న మిడతలు. అరటి చెట్లను వదలని మిడతలు. రంగంలోకి దిగిన అధికారులు..మిడతల పై ఫెర్టిలైజర్స్ చల్లి తరిమి కొట్టే ప్రయత్నం.
  • బంజారాహిల్స్ లో దారుణం. భార్యను హతమార్చిన భర్త. భార్య భర్తల గొడవతో హీటర్ తో బాధి హత్య చేసిన భర్త. తలకు గాయం కావడం తో మృతి చెందిన భార్య. కేస్ నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న బంజారాహిల్స్ పోలీసులు.
  • ఈరోజుతో ముగియనున్న సర్వేలేన్స్ సర్వే. ఎలిజా ప్రక్రియ ద్వారా రక్త నమూనా సేకరిస్తున్న ICMR ,NIN. జిహెచ్ఎంసి లోని ఐదు ప్రాంతాలలో ఈరోజు సర్వే. 18 సంవత్సరాలు పై బడిన అన్ని వయసుల వారికి టెస్టులు చేస్తున్న NIN. ఒక్కో కంటైన్మెంట్ జోన్ 100 శాంపిల్స్ తీసుకుంటున్న ICMR,NIN అధికారులు. మొత్తం రంగారెడ్డి,ghmc లలో 500 శాంపిల్స్ తీసుకోనున్న బృందాలు. మొత్తం సిరం శాంపిల్స్ ను చెన్నై పంపనున్న ICMR,NIN అధికారులు.
  • తిరుపతి లో గంజాయి మత్తుగాళ్ళ హాల్ చల్ . తాతయ్యగుంట లో గంజాయి మత్తులో యువకుడి పై కత్తితో దాడి . శనివారం రాత్రి సంఘటన . దాడికి పాల్పడిన ఆరుగురు దుండగులు . కతిదాడిలో తీవ్రంగా గాయపడిన వెంకట సాయి (15). రుయా ఆసుపత్రి కి తరలింపు... ప్రాథమిక చికిత్స . తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు.

గాంధీ ఆసుపత్రిలో కరోనా బాధితుల మెనూ ఇదే…

India Lockdown, గాంధీ ఆసుపత్రిలో కరోనా బాధితుల మెనూ ఇదే…

India Lockdown: కరోనా వైరస్.. ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ బారిన పడి వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అటు పాజిటివ్ కేసులు కూడా గంటగంటకూ పెరుగుతున్నాయి. ఇక ఇండియాలో అయితే కరోనా వేగంగా విస్తరిస్తోంది. కేంద్రం లాక్ డౌన్ ప్రకటించినా కూడా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో కరోనా తీవ్రతను నియంత్రించడానికి ఇరు రాష్ట్రాల సీఎంలు ముమ్మరంగా చర్యలు చేపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు 348 కేసులు నమోదు కాగా.. తెలంగాణలో ఆ సంఖ్య 453కి చేరింది.

మరోవైపు కరోనా బాధితులు చికిత్స కోసం ఒకే గదిలో రెండు వారాలకుపైగా ఉండాల్సి వస్తుంది. దీని వల్ల కొందరు రోగులు మానసిక ఒత్తిడికి, ఆందోళనకు గురవుతారు. అలాంటివారికి మానసిక ధైర్యాన్ని చెప్పడమే కాకుండా సరైన పౌష్టిక ఆహారాన్ని ఇవ్వడం కూడా ఎంతో ముఖ్యం. ఈ క్రమంలోనే గాంధీ ఆసుపత్రి వైద్యులు కరోనా పాజిటివ్ రోగులకు మంచి పౌష్టిక ఆహారాన్ని అందిస్తూ.. వారిని కంటికి రెప్పలా చూసుకుంటున్నారు.

రోగుల్లో ఇమ్యునిటీ(వ్యాధినిరోధక శక్తి)ని పెంచే విధంగా వాళ్లు కోరుకున్న ఆహారం ఇస్తున్నామని డాక్టర్లు చెప్పారు. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో ఇడ్లీ, చపాతీ, దోశ, పాలు, టీ, బ్రెడ్ ఇస్తుండగా.. లంచ్‌కు రైస్, 2 రకాల కూరలు, కోడిగుడ్డు, సాంబార్, పెరుగు.. అలాగే సాయంత్రం బాదంపప్పు, జీడిపప్పు, ఇతర పండ్లను ఇస్తున్నారు. ఇక డిన్నర్‌లో రైస్, చపాతీతో పాటు రోజుకు 4 లీటర్ల మినరల్ వాటర్ బాటిళ్లను అందజేస్తున్నామని గాంధీ డాక్టర్లు పేర్కొన్నారు.

For More News:

ధరలు పెంచితే ఏడేళ్ల జైలు.. నిత్యావసర వస్తు చట్టం అమలు..

ఆ మూడింటిని జూన్ వరకు బంద్ చేస్తారా..?

కరోనా కరాళ నృత్యం.. ప్రపంచవ్యాప్తంగా 15 లక్షలు దాటిన కేసులు..

దేశంలో 6 వేలకు చేరుతున్న పాజిటివ్ కేసులు.. ఏయే రాష్ట్రంలో ఎలా ఉందంటే..

‘తబ్లీఘీ జమాత్’ ఘటన.. కేంద్రం, అజిత్ దోవల్‌పై మహారాష్ట్ర హోంమంత్రి సంచలన వ్యాఖ్యలు..

కోహ్లీ అంటే ఆస్ట్రేలియా క్రికెటర్లకు భయం..

మద్యం అమ్మకాలకు అనుమతివ్వండి.. 10 రాష్ట్రాల సీఎంలకు లేఖలు..

కరోనా కల్లోలం.. అమెరికాలో ఒక్క రోజులోనే 1,940 మంది మృతి..

‘పుష్ప’కు ఆరో వేలు.. అసలు ట్విస్ట్ ఇదేనా..

Related Tags