మూడు వేలకు చేరువలో రాజస్థాన్.. కొత్తగా 114 కేసులు..

దేశ వ్యాప్తంగా నమోదవుతున్న అత్యధిక కేసుల్లో రాజస్థాన్ రాష్ట్రం కూడా ఒకటి. మహారాష్ట్ర, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో పెరుగుతున్నట్లే.. రాజస్థాన్‌లో కూడా నిత్యం కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. దేశంలోని కరోనా హాట్‌స్పాట్ రాష్ట్రాల్లో ప్రస్తుతం రాజస్థాన్ ఒకటి. ఇక్కడ నిత్యం దాదాపు వంద వరకు కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఆదివారం కూడా ఇక్కడ వందకు పైగా కేసులు నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. గడిచిన 24 గంటల్లో..114 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాజస్థాన్ సర్కార్ […]

మూడు వేలకు చేరువలో రాజస్థాన్.. కొత్తగా 114 కేసులు..
Follow us

| Edited By:

Updated on: May 03, 2020 | 11:27 PM

దేశ వ్యాప్తంగా నమోదవుతున్న అత్యధిక కేసుల్లో రాజస్థాన్ రాష్ట్రం కూడా ఒకటి. మహారాష్ట్ర, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో పెరుగుతున్నట్లే.. రాజస్థాన్‌లో కూడా నిత్యం కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. దేశంలోని కరోనా హాట్‌స్పాట్ రాష్ట్రాల్లో ప్రస్తుతం రాజస్థాన్ ఒకటి. ఇక్కడ నిత్యం దాదాపు వంద వరకు కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఆదివారం కూడా ఇక్కడ వందకు పైగా కేసులు నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. గడిచిన 24 గంటల్లో..114 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాజస్థాన్ సర్కార్ ప్రకటించింది. అంతేకాదు.. కరోనా బారినపడి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని అధికారులు వెల్లడించారు. ఆదివారం నమోదైన కరోనా పాజిటివ్ కేసులను కలుపుకొని.. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య మొత్తం 2886కి చేరింది. ఇక కరోనా మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 71కి చేరింది. కాగా కరోనా నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1356 మంది కోలుకున్నారని.. అయితే వీరిలో 923 మందిన మాత్రమే డిశ్జార్జ్ చేసినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

కాగా.. దేశ వ్యాప్తంగా ఆదివారం ఒక్క రోజే.. దాదాపు రెండు వేలకు పైగా కేసులు నమోదవ్వగా.. 83 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో దేశంలోని కరోనా పాజటివ్ కేసుల సంఖ్య 40,263కు చేరింది. ఇక మరణాల సంఖ్య 1306కు చేరగా.. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 10887కి చేరింది. ప్రస్తుతం 28070 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Latest Articles