5

ధారావిలో విజృంభిస్తోన్న కరోనా.. బెంబేలెత్తిపోతున్న ప్రజలు..

ఆసియా ఖండంలోనే అతిపెద్ద మురికివాడగా పేరున్న ధారావి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక్కడ కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి.. ఇక్కడి ప్రజలతో పాటుగా అధికారులు కూడా భయబ్రాంతులకు గురయ్యారు. అయితే అంతా అనుకున్నట్టే.. ఇక్కడ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఆదివారం ఊహించని రీతిలో ఇక్కడ కరోనా పాజిటివ్ కేసులు  పెరిగాయి. ఇవాళ ఒక్కరోజే ధారావి ప్రాంతంలో 94 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీంతో అక్కడి ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్న పరిస్థితులు […]

ధారావిలో విజృంభిస్తోన్న కరోనా.. బెంబేలెత్తిపోతున్న ప్రజలు..
Follow us

| Edited By:

Updated on: May 03, 2020 | 10:46 PM

ఆసియా ఖండంలోనే అతిపెద్ద మురికివాడగా పేరున్న ధారావి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక్కడ కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి.. ఇక్కడి ప్రజలతో పాటుగా అధికారులు కూడా భయబ్రాంతులకు గురయ్యారు. అయితే అంతా అనుకున్నట్టే.. ఇక్కడ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఆదివారం ఊహించని రీతిలో ఇక్కడ కరోనా పాజిటివ్ కేసులు  పెరిగాయి. ఇవాళ ఒక్కరోజే ధారావి ప్రాంతంలో 94 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీంతో అక్కడి ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్న పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇదిలా ఉంటే.. ధారావికి చెందిన ఇద్దరు కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారు. దీంతో ధారావిలో కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 20కి చేరింది. ఇక ఈ ప్రాంతంలో ఇవాళ నమోదైన కేసుల సంఖ్యతో మొత్తం.. 590కి చేరింది.

ఇదిలా ఉంటే.. శనివారం కూడా ధారావిలోనే కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. శనివారం నాడు ధారావిలో 89 పాజిటివ్ కేసులు నమోదయినట్లు మహారాష్ట్ర సర్కార్‌ ప్రకటించింది. ఇక్కడ ఏప్రిల్ 1న తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది.