మోదీ పిలుపుకు సన్నాయత్తమవుతోన్న యావత్ భారతం
ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన దీపకాంతి నేడే జరగనుంది. లాక్‌డౌన్ విధించి 21 రోజులు పూర్తైన సందర్భంగా.. సోషల్ మీడియా ద్వారా వీడియో మెసేజ్ ఇచ్చారు మోదీ. ప్రధాని ఇచ్చిన పిలుపును దేశ ప్రజలు,,

ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన దీప కాంతి నేడే జరగనుంది. లాక్‌డౌన్ విధించి 21 రోజులు పూర్తైన సందర్భంగా.. సోషల్ మీడియా ద్వారా వీడియో మెసేజ్ ఇచ్చారు మోదీ. ప్రధాని ఇచ్చిన పిలుపును దేశ ప్రజలు కూడా స్వాగతించారు. ఈమేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే పలువురు రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు కూడా మోదీ చెప్పిన సందేశాన్ని పాటించాలని ప్రజలకు పిలుపునిస్తున్నారు.
‘ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రతీ ఒక్కరూ ఇంట్లోని అన్ని లైట్లూ ఆపివేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. తొమ్మిది నిమిషాల పాటు.. కొవ్వొత్తి లేదా దీపం లేదా మొబైల్ ఫ్లాష్ లైట్, టార్చ్ వేయాలని దీంతో ఎవరూ ఒంటరిగా లేమని ధైర్యం చెప్పుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఎవరూ బయటకు రాకుండా.. కేవలం ఇంట్లో కూర్చొని ఈ పని చేయాలని.. కరోనాపై విజయానికి నాందిగా దీనిని జరపాలని’ ప్రధాని మోదీ చెప్పారు. అందరూ ప్రతీ ఒక్కరూ సామాజిక దూరం (భౌతిక దూరం) పాటించాలని పిలుపునిచ్చారు. అలాగే.. శానిటైజర్ రాసుకుని దీపాలు వెలిగించొద్దని కూడా ఆయన చెప్పారు.
Thank you @ysjagan Ji. This support is extremely valuable and will further the spirit of togetherness! #IndiaFightsCorona https://t.co/QSUnRLTd97
— Narendra Modi (@narendramodi) April 4, 2020
ఇవి కూడా చదవండి:
కింగ్ కోఠి కరోనా రోగి ఇంట్లో 46 మంది నివాసమట.. అధికారులు ఏం చేశారంటే
మనదేశంలో కరోనా బాధితుల్లో యువతే అధికం.. కేంద్రం షాకింగ్ వివరాలు
తెలంగాణలో 272కు చేరిన కరోనా కేసులు
డియర్ బ్రదర్ అంటూ బాలకృష్ణకు ధన్యవాదాలు చెప్పిన మెగాస్టార్
నల్లా నీళ్ల ద్వారా కరోనా వ్యాపించదని తేల్చిచెప్పిన WHO