Breaking News
  • భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష 31 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 131868. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 73560. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 54441. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 3867. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • కరోనా తెలంగాణా బులిటిన్. ఇవ్వాళ తాజాగా 41 పాజిటివ్ కేసులు నమోదు. మొత్తం రాష్ట్రంలో 1854 కరోనా పాజిటివ్ కేసులు . ఇవ్వాళ నలుగురు మృతి. మొత్తం ఇప్పటివరకు 53 మంది కరోనా కు బలి అయ్యారు. యాక్టీవ్ కేసులు 709 మంది చికిత్స పొందుతున్నారు.
  • తిరుమల: ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల రుసుము రీఫండ్. జూన్ 30వ తేది వరకు శ్రీవారి ఆర్జిత సేవలు, వీఐపీ దర్శన టికెట్లు, తిరుమలలో గదులు బుక్ చేసుకున్న భక్తులకు డబ్బులు రీఫండ్. టికెట్ల వివరాలను refunddesk_1@tirumala.org మెయిల్ ఐడీకి పంపాలని భక్తులను కోరిన టీటీడీ.
  • వరంగల్ 9 మర్డర్ కేసు లో సంచలన బ్రేకింగ్ . 9 మందిని హత్య చేసింది సంజయ్ . మాక్సుద్ భార్య చెల్లెలి తో సంబంధం ఉన్న సంజయ్. మాక్సుద్ భార్య చెల్లలి తో అక్రమ సంబంధం ఉన్న సంజయ్. తనకు అడ్డు రావొద్దని మాక్సుద్ కుటుంబం తో పాటు సన్నిహితంగా ఉన్న బిహారి యువకులను హత్య చేసిన సంజయ్.
  • CRPF జవాన్ లకు కరోనా పాజిటివ్. ఈ రోజు 9 మంది CRPF జవాన్ కి కరోనా పాజిటివ్ ఉన్నట్లు దృవీకరించిన వైద్యులు. దేశ వ్యాప్తంగా మొత్తం 359 CRPF సిబ్బందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు దృవీకరణ. 137 యాక్టీవ్ కేస్ లు. 220 మంది డిశ్చార్జ్, ఇద్దరు మృతి.
  • దేశ వ్యాప్తంగా భానుడి భగ భగ. పంజాబ్, హర్యానా, దక్షిణ యుపి, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, తీరప్రాంత ఆంధ్రప్రదేశ్‌లో ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉంటాయని IMD హెచ్చరిక.. రాబోయే 5 రోజుల్లో తీవ్రమైన హీట్ వేవ్ ఉంటాయని హెచ్చరిక.

కింగ్ కోఠి కరోనా రోగి ఇంట్లో 46 మంది నివాసమట.. అధికారులు ఏం చేశారంటే

దేశ వ్యాప్తంగానే కాకుండా.. తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా వైరస్ చాపకింద నీరులాగ ప్రబలుతూనే ఉంది. ముఖ్యంగా ఢిల్లీ మర్కజ్‌లో తబ్లిఘీ జమాత్ మత ప్రార్థనలకు వెళ్లి తిరిగి వచ్చిన వారి వల్ల కరోనా కేసులు మరింత విపరీతంగా..
Corona Effect: 46 Persons lives in a Single House of Delhi return Corona Patient in King Koti, కింగ్ కోఠి కరోనా రోగి ఇంట్లో 46 మంది నివాసమట.. అధికారులు ఏం చేశారంటే

దేశ వ్యాప్తంగానే కాకుండా.. తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా వైరస్ చాపకింద నీరులాగ ప్రబలుతూనే ఉంది. ముఖ్యంగా ఢిల్లీ మర్కజ్‌లో తబ్లిఘీ జమాత్ మత ప్రార్థనలకు వెళ్లి తిరిగి వచ్చిన వారి వల్ల కరోనా కేసులు మరింత విపరీతంగా పెరిగిపోతున్నాయి. హైదరాబాద్ నుంచి ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లిన వారిని గుర్తించేందుకు అటు పోలీసులు, ఇటు హెల్త్ టీమ్స్ ఇంటింటీకి తిరుగుతూ విచారణ చేపడుతున్నాయి. ఈ సర్వేలో భాగంగా కింగ్ కోఠి ప్రాంతంలో బయటపడిన ఓ కేసు అధికారులను విస్మయానికి గురి చేసింది. ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లి వచ్చిన ఓ వ్యక్తిని గుర్తించి, అతన్ని గాంధీ ఆస్పత్రికి తరలించి టెస్టులు చేయగా పాజిటివ్ అని తేలింది. అలాగే వారి కుటుంబసభ్యులకు కూడా కరోనా పరీక్షలు చేయాలనుకున్నారు అధికారులు.

అయితే ఇక్కడే ఓ విషయం అధికారులను షాకింగ్‌కి గురి చేసింది. కింగ్‌ కోఠి కరోనా వ్యక్తిది ఉమ్మడి కుటుంబం. ఒకే ఇంట్లో ఏకంగా 46 మంది కుటుంబసభ్యులు ఉంటారు. వారందరిలో ఎంతమందికి వైరస్ సోకిందనే అంశం ఇప్పుడు అధికారులకు తలనొప్పిగా మారింది. ఇప్పుడు ఈ 46 మందికీ వారి ఇంట్లోనే పరీక్షలు చేస్తున్నారు. అలాగే అందరికీ చేతిపై క్వారంటైన్ స్టాంప్ వేశామని, ఇంటి నుంచి బయటకు రావద్దని సూచించామని వైద్యులు తెలిపారు. ఇక వీరందరికీ కరోనా పాజిటివ్ అని తేలితే గాంధీ ఆస్పత్రికి తరలిస్తామని చెప్పారు. అంతేకాకుండా.. ఈ 46 మంది వ్యక్తుల ద్వారా.. ఇంకా బయటవారికైనా సోకిందా అనేది కూడా అధికారులు ఆరా తీస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

మనదేశంలో కరోనా బాధితుల్లో యువతే అధికం.. కేంద్రం షాకింగ్ వివరాలు

తెలంగాణలో 272కు చేరిన కరోనా కేసులు

డియర్ బ్రదర్ అంటూ బాలకృష్ణకు ధన్యవాదాలు చెప్పిన మెగాస్టార్

నల్లా నీళ్ల ద్వారా కరోనా వ్యాపించదని తేల్చిచెప్పిన WHO

లాక్‌డౌన్‌ను ఎలా ఎత్తేస్తారో.. చెప్పిన మోదీ

కరోనాపై మోదీ మరో సందేశం.. ఏప్రిల్ 5న అందరూ జాగరణ చేయాలి

Related Tags