Breaking News
  • భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష 31 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 131868. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 73560. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 54441. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 3867. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • కరోనా తెలంగాణా బులిటిన్. ఇవ్వాళ తాజాగా 41 పాజిటివ్ కేసులు నమోదు. మొత్తం రాష్ట్రంలో 1854 కరోనా పాజిటివ్ కేసులు . ఇవ్వాళ నలుగురు మృతి. మొత్తం ఇప్పటివరకు 53 మంది కరోనా కు బలి అయ్యారు. యాక్టీవ్ కేసులు 709 మంది చికిత్స పొందుతున్నారు.
  • తిరుమల: ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల రుసుము రీఫండ్. జూన్ 30వ తేది వరకు శ్రీవారి ఆర్జిత సేవలు, వీఐపీ దర్శన టికెట్లు, తిరుమలలో గదులు బుక్ చేసుకున్న భక్తులకు డబ్బులు రీఫండ్. టికెట్ల వివరాలను refunddesk_1@tirumala.org మెయిల్ ఐడీకి పంపాలని భక్తులను కోరిన టీటీడీ.
  • వరంగల్ 9 మర్డర్ కేసు లో సంచలన బ్రేకింగ్ . 9 మందిని హత్య చేసింది సంజయ్ . మాక్సుద్ భార్య చెల్లెలి తో సంబంధం ఉన్న సంజయ్. మాక్సుద్ భార్య చెల్లలి తో అక్రమ సంబంధం ఉన్న సంజయ్. తనకు అడ్డు రావొద్దని మాక్సుద్ కుటుంబం తో పాటు సన్నిహితంగా ఉన్న బిహారి యువకులను హత్య చేసిన సంజయ్.
  • CRPF జవాన్ లకు కరోనా పాజిటివ్. ఈ రోజు 9 మంది CRPF జవాన్ కి కరోనా పాజిటివ్ ఉన్నట్లు దృవీకరించిన వైద్యులు. దేశ వ్యాప్తంగా మొత్తం 359 CRPF సిబ్బందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు దృవీకరణ. 137 యాక్టీవ్ కేస్ లు. 220 మంది డిశ్చార్జ్, ఇద్దరు మృతి.
  • దేశ వ్యాప్తంగా భానుడి భగ భగ. పంజాబ్, హర్యానా, దక్షిణ యుపి, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, తీరప్రాంత ఆంధ్రప్రదేశ్‌లో ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉంటాయని IMD హెచ్చరిక.. రాబోయే 5 రోజుల్లో తీవ్రమైన హీట్ వేవ్ ఉంటాయని హెచ్చరిక.

తెలంగాణలో 272కు చేరిన కరోనా కేసులు

తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య నేడు 272కు చేరిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ వెల్లడించారు. శనివారం కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రెస్ నోట్..
Corona Effect: 272 Coronavirus Positive Cases in Telangana, తెలంగాణలో 272కు చేరిన కరోనా కేసులు

తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య నేడు 272కు చేరిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ వెల్లడించారు. శనివారం కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు. అలాగే తెలంగాణలో కరోనా వైరస్ కమ్యునిటీ స్ప్రెడ్ జరగలేదని స్పష్టం చేశారు. ఢిల్లీ మర్కజ్ ప్రార్థనకు వెళ్లినవారిని గుర్తుపడుతున్నామని తెలిపారు. అలాగే ఎవరికైనా అనుమానాలుంటే స్వచ్ఛందంగా వచ్చి కరోనా పరీక్షలు చేయించుకోవలని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కరోనా కేసులన్నీ మర్కజ్ నుంచి వచ్చినవారు లేదా వారితో కలిసినవారు మాత్రమేనని తెలిపారు.

ప్రెస్‌నోట్‌లోని అంశాలు:

1. మర్కజ్ నుంచి 1090 మంది తెలంగాణకి వచ్చారు. వారందరికీ కూడా పరీక్షలు నిర్వహిస్తున్నాం
2. అన్ని క్వారంటైన్ సెంటర్లలో వైద్యులను నియమించాం. నర్సులు, పారా మెడికల్ సిబ్బంది అందరూ పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నారు
3. అలాగే అన్ని సెంటర్స్‌లో ఎన్-95 మాస్కులు, పిపిఈ కిట్స్ సరిపోయేయన్ని అందుబాటులో ఉంచామన్నారు
4. వైద్యులు, సిబ్బందిపై ఎవరు దాడి చేసినా కఠిన చర్యలు తప్పవన్నారు
5. సీఎం సూచనతో ప్రతీ రోజూ ఉదయం 9 నుంచి 11 గంటల వరకూ సీఎస్, వైద్య శాఖ అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నామన్నారు
6. అలాగే గచ్చిబౌలిలో 15 వందల పడకల ఆసుపత్రి మరో రెండు రోజుల్లో అందుబాటులోకి వస్తుంది
7. ఆరు ల్యాబ్‌లు 24 గంటలూ పని చేస్తున్నాయి

ఇవి కూడా చదవండి:

డియర్ బ్రదర్ అంటూ బాలకృష్ణకు ధన్యవాదాలు చెప్పిన మెగాస్టార్

నల్లా నీళ్ల ద్వారా కరోనా వ్యాపించదని తేల్చిచెప్పిన WHO

లాక్‌డౌన్‌ను ఎలా ఎత్తేస్తారో.. చెప్పిన మోదీ

కరోనాపై మోదీ మరో సందేశం.. ఏప్రిల్ 5న అందరూ జాగరణ చేయాలి

వికారాబాద్ పొలంలో 200 ఏళ్లనాటి వెండి నాణేలు..

విద్యుత్ ఛార్జీల అంశంలో ఏపీఎస్‌పీడీసీఎల్ కీలక నిర్ణయం

Related Tags