మళ్లీ 14 రోజుల పాటు లాక్‌డౌన్ విధింపు!
మళ్లీ కంటైన్‌మెంట్ జోన్ నిబంధనలు కఠినంగా అమలు చేసే దిశగా యంత్రాంగం చర్యలు చేపట్టింది. రోజు రోజుకు పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు జిల్లాను వణికిస్తున్నాయి. కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోవడం, కరోనా అనుమానితులు వందల సంఖ్యలో ఉండటంతో పరిస్థితి చేయిదాటిపోయేలా ఉంది. దీంతో నిర్భందం ఒక్కటే విరుగుడుగా నగరంలో మళ్లీ లాక్‌డౌన్ విధించాలని జిల్లా అధికారులు నిర్ణయించారు.

ఒంగోలు జిల్లా కేంద్రంలో మళ్లీ కంటైన్‌మెంట్ జోన్ నిబంధనలు కఠినంగా అమలు చేసే దిశగా యంత్రాంగం చర్యలు చేపట్టింది. రోజు రోజుకు పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు జిల్లాను వణికిస్తున్నాయి. ఒంగోలు నగరంలో ఒక్కసారిగా కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోవడం, కరోనా అనుమానితులు వందల సంఖ్యలో ఉండటంతో పరిస్థితి చేయిదాటిపోయేలా ఉంది. దీంతో నిర్భందం ఒక్కటే విరుగుడుగా యంత్రాంగం భావించింది. ఈ నేపథ్యంలో నగరంలో మళ్లీ లాక్‌డౌన్ విధించాలని జిల్లా అధికారులు నిర్ణయించారు.
ఒంగోలు జిల్లాలో గురువారం రికార్డు స్థాయిలో 38 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఇప్పటి వరకు జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 267కు చేరింది. నిన్న చీరాలలో 16, ఒంగోలులో 8, పామూరులో 6 సహా జిల్లాలోని పలు ప్రాంతాల్లో 38 కరోనా కేసులు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు 14 రోజుల పాటు ఒంగోలు నగరాన్ని కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఎల్లుండి నుంచి నగరంలో పూర్తిస్థాయి లాక్‌డౌన్ అమల్లోకి రానుంది. రెండు నెలల పాటు లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయడంతో జిల్లాలో పాజిటివ్ కేసులు పూర్తిగా తగ్గిపోయి జీరో అయిన సంగతి తెలిసిందే. తాజాగా జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా కట్టడికి జిల్లా కేంద్రంలో మళ్లీ అవే నిబంధనలు పూర్తిగా అమలు చేయబోతున్నారు.




