కరోనా ఫైన్.. బయటకు వచ్చాడని రూ.500 జరిమానా
రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలో ఇలా రాష్ట్రంలోనే తొలిసారి ఓ గ్రామ పంచాయతీ ఫైన్ విధించింది. మిట్టపెల్లి రాజారెడ్డి అనే వ్యక్తికి జరిమానా విధించారు. ఒకేరోజు మూడు సార్లు రోడ్ల మీద తిరుగుతూ కనిపించడంతో..

కరోనా వైరస్ విస్తరించకుండా ఉండేందుకు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ పటిష్టంగా అమలవుతోంది. ఇప్పటికే ఈ లాక్‌డౌన్ అమలు చేసి దాదాపు రెండు వారాలు కావొస్తోంది. ఇప్పుడు ఇంకా ఏప్రిల్ 14వ తేదీ వరకూ వేచి చూడాల్సిందే. ప్రధాని మోదీతో పాటు పలువురు సెలబ్రిటీలు, ప్రముఖులు చెబుతున్నా కూడా కొందరు బయటకి వస్తూనే ఉన్నారు. ఇలా రోడ్ల మీదకి వచ్చినవారిపై పోలీసులు లాఠీలకు పని చెబుతున్నారు. అయినప్పటికీ కొంతమంది నిబంధనలు ఉల్లంఘిస్తూ బయటకు వస్తున్నారు. ఇలాంటి వారిని కట్టడి చేయడానికి జగిత్యాల జిల్లాలో ఓ గ్రామ పంచాయతీ కీలక నిర్ణయం తీసుకుంది. తరుచూ బయట తిరిగే వారిని గుర్తించి ఫైన్ వేస్తున్నారు. ఇలా జరిమాల విధించిన ఓ ధృవపత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలోని జగ్తిఅల్ ప్రాంతంలో.. రాష్ట్రంలోనే తొలిసారిగా ఓ గ్రామ పంచాయతీ ఫైన్ విధించింది. మిట్టపెల్లి రాజారెడ్డి అనే వ్యక్తికి జరిమానా విధించారు. ఒకేరోజు మూడు సార్లు రోడ్ల మీద తిరుగుతూ కనిపించడంతో.. రూ.500 రూపాయల ఫైన్ వేశారు. దీనికి సంబంధించి రసీదును కూడా గ్రామ పంచాయతీ కార్యదర్శి వెల్లడించారు. ‘కరోనా వైరస్ లాక్ డైన్.. ఒకే రోజు మూడు సార్లు బయటకు తిరిగినందుకు ఫైన్ వేయడం జరిగిందని’ ఆ రసీదు మీద రాసి ఉంది. నిజానికి పట్టణాల్లో కంటే గ్రామాల్లోనే లాక్‌డౌన్ పటిష్టంగా నిర్వహిస్తున్నారు. అనవసరంగా రోడ్ల మీద తిరిగే వారిని కట్టడి చేసేందుకు గ్రామ పంచాయతీల ప్రత్యేక చొరవ చూపుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
అభిమానులకు కాదు.. జనరల్ ఆడియన్స్‌కి రీచ్ అయితే నేను హ్యాపీ
వెంటిలేటర్లకు ప్రత్యామ్నాయంగా ‘బ్యాగ్ వాల్వ్ మాస్క్’
వాట్సాప్ నుంచే ఐసిఐసిఐ బ్యాంకు సేవలు
ఆల్కహాల్ బ్యాన్.. పెరుగుతోన్న మరో భయంకర వ్యాధి.. 8 మంది మృతి
ప్రభుత్వం వద్దంటోంది.. EMI వాడేమో కట్టాలంటూ మెసేజ్‌లు పంపిస్తున్నారు
లాక్‌డౌన్: దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పిన పీఎం మోదీ
డేంజరస్ వైరస్: కోలుకున్న తర్వాత కూడా 8 రోజులు శరీరంలోనే
కరోనా వైరస్ సోకితే.. ఏ రోజు ఏయే లక్షణాలు కనిపిస్తాయంటే? మీకోసమే!



