ఏపీ సీఎం కీల‌క నిర్ణ‌యంః ఈ నెల 30న రైతుభరోసా !

లాక్‌డౌన్ వేళ రైతులకు సంబంధించిన సమస్యలపై ఫోకస్ పెట్టింది జగన్ సర్కార్. పంట సేకరణతో పాటూ కీలక అంశాలపై అధికారులతో సీఎం చర్చించారు.

ఏపీ సీఎం కీల‌క నిర్ణ‌యంః ఈ నెల 30న రైతుభరోసా !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 06, 2020 | 11:55 AM

దేశం మొత్తం గ‌డ్డుప‌రిస్థితుల‌ను ఎదుర్కొవాల్సి వ‌చ్చినా..దేశానికి నేనున్నాన‌నే భ‌రోసానిచ్చే అన్న‌దాత‌కు ప్ర‌భుత్వాలు అండ‌గా నిలుస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రైతుల ప‌ట్ల ప్ర‌భుత్వాలు తీసుకుంటున్న చ‌ర్య‌ల‌పై స‌ర్వ‌త్రా హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. తాజాగా ఏపీ స‌ర్కార్ కూడా రైత‌న్న‌కు మేలు చేసేలా కీల‌క చ‌ర్య‌లు చేప‌ట్టింది.
లాక్‌డౌన్ వేళ రైతులకు సంబంధించిన సమస్యలపై ఫోకస్ పెట్టింది జగన్ సర్కార్. పంట సేకరణతో పాటూ కీలక అంశాలపై అధికారులతో సీఎం చర్చించారు. మే 30న రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. గతంలో సీఎం సూచనల మేరకు మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ యాప్‌లో మార్పులు చేర్పులు చేసిన అధికారులు దాని పనితీరు గురించి వైఎస్‌ జగన్‌కు వివరించారు. ఈ యాప్‌కు కాంప్రహెన్సివ్‌ మానిటరింగ్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ ప్రైస్‌ అండ్‌ ప్రొక్యూర్‌మెంట్‌ (సీఎం ఏపీపీ) గా నామకరణం చేశారు.
జిల్లాల్లో వ్యవసాయం, అనుబంధ రంగాలు చూస్తున్న జేసీలు అందరికీ ఈ యాప్‌పైన అవగాహన కల్పించాలని సీఎం ఆదేశించారు. పంటల సేకరణ విధానాల్లో ఏమైనా లోపాలుంటే వాటిని క్షుణ్ణంగా అధ్యయనం చేసి వాటిని వెంట‌నే ప‌రిష్క‌రించేలా చూడాల‌ని సీఎం స్పష్టంచేశారు. ఈ నెల 30న రైతుభరోసా కేంద్రాలు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు. మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ యాప్‌పై మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సమీక్షించారు.

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..