లాక్‌డౌన్‌ వేళ.. వెల్లివిరిసిన మానవత్వం.. వార్డు వాలంటీర్లే ‘ఆ నలుగురై’..

కరోనా వైరస్ తెచ్చిన భయంతో.. ఎవరైనా సహజంగా మరణించినా కూడా వారికి అంత్యక్రియలు చేసేందుకు సొంత కుటుంబసభ్యులే వెనకడుగు వేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఓ వృద్దుడి దహన సంస్కారాలకు ‘ఆ నలుగురై’ వార్డు వాలంటీర్లు అన్నీ తామై చేశారు. ఈ ఘటన గుంటూరు జిల్లాలోని నరసరావుపేటలో చోటు చేసుకుంది. పేటలోని 30వ వార్డుకు చెందిన షేక్ నన్నే బుజ్జి(75) గత కొంతకాలంగా అనారోగ్యంతో మంచం పట్టి రెండు రోజుల క్రితం ప్రాణాలు విడిచాడు. అతడికి ఆరుగురు సంతానం.. […]

లాక్‌డౌన్‌ వేళ.. వెల్లివిరిసిన మానవత్వం.. వార్డు వాలంటీర్లే 'ఆ నలుగురై'..
Follow us

|

Updated on: May 06, 2020 | 10:50 AM

కరోనా వైరస్ తెచ్చిన భయంతో.. ఎవరైనా సహజంగా మరణించినా కూడా వారికి అంత్యక్రియలు చేసేందుకు సొంత కుటుంబసభ్యులే వెనకడుగు వేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఓ వృద్దుడి దహన సంస్కారాలకు ‘ఆ నలుగురై’ వార్డు వాలంటీర్లు అన్నీ తామై చేశారు. ఈ ఘటన గుంటూరు జిల్లాలోని నరసరావుపేటలో చోటు చేసుకుంది. పేటలోని 30వ వార్డుకు చెందిన షేక్ నన్నే బుజ్జి(75) గత కొంతకాలంగా అనారోగ్యంతో మంచం పట్టి రెండు రోజుల క్రితం ప్రాణాలు విడిచాడు.

అతడికి ఆరుగురు సంతానం.. తండ్రి మరణవార్త వినగానే అందరూ హుటాహుటిన ఇంటికి చేరుకున్నారు. ఇక వారు ఉంటున్న ఏరియా రెడ్‌జోన్‌ కావడంతో తండ్రి అంత్యక్రియలు ఎలా నిర్వహించాలో తెలియక కుమారులు ఇబ్బంది పడ్డారు. సంప్రదాయం ప్రకారం ఆ ప్రాంతంలోని మసీదుకు చెందిన వారిని పిలిచినా.. కరోనా భయంతో వారు వచ్చేందుకు నిరాకరించారు. దీనితో పీపీఈ కిట్లు ధరించి వార్డు వాలంటీర్లు అన్నీ తామై ముందుకొచ్చారు. మృతదేహానికి స్నానం చేయించి.. దాన్ని చాలా జాగ్రత్తగా ప్యాక్ చేశారు. ఇక జనాజపై ఆ మృతదేహాన్ని ఉంచి చిలకలూరిపేట రోడ్డులోని కబ్రిస్తాన్‌కు చేర్చారు. ఈ తతంగం మొత్తాన్ని మాజీ కౌన్సిలర్‌, సచివాలయ శానిటేషన్‌ సెక్రటరీ, ఏఎన్‌ఎం దగ్గరుండి పర్యవేక్షించారు. కాగా, వాలంటీర్లు చేసిన పనికి స్థానికులందరూ మెచ్చుకున్నారు.

ఎన్నికల్లో టికెట్ కాదు ముఖ్యం.. నామినేషన్ దగ్గరే అసలు సమస్య..
ఎన్నికల్లో టికెట్ కాదు ముఖ్యం.. నామినేషన్ దగ్గరే అసలు సమస్య..
రుతురాజ్ సెంచరీ చేస్తే మ్యాచ్ ఫసక్.. చెన్నై సారథి చెత్త రికార్డు
రుతురాజ్ సెంచరీ చేస్తే మ్యాచ్ ఫసక్.. చెన్నై సారథి చెత్త రికార్డు
ప్రేక్షకులపైకి దూసుకెళ్లిన రేస్‌ కారు.. ఏడుగురు దుర్మరణం..
ప్రేక్షకులపైకి దూసుకెళ్లిన రేస్‌ కారు.. ఏడుగురు దుర్మరణం..
మూడు శుభ గ్రహాలపై శనీశ్వరుడి దృష్టి.. వారికి రాజయోగ ఫలితాలు..!
మూడు శుభ గ్రహాలపై శనీశ్వరుడి దృష్టి.. వారికి రాజయోగ ఫలితాలు..!
6,128 విమానాలు.. 4.71 లక్షల మంది ప్రయాణికులు
6,128 విమానాలు.. 4.71 లక్షల మంది ప్రయాణికులు
ఈ మసాలాలు వాడితే చాలు,ఒంట్లో కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోవాల్సిందే
ఈ మసాలాలు వాడితే చాలు,ఒంట్లో కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోవాల్సిందే
అయినా చిన్న వయసులోనే గుండెపోటు.. ఈ వయస్సులోపు మహిళలకు పెనుముప్పు
అయినా చిన్న వయసులోనే గుండెపోటు.. ఈ వయస్సులోపు మహిళలకు పెనుముప్పు
పరగడుపునే టీ తాగడం అంత ప్రమాదమా ?? నిపుణులేమంటున్నారు ??
పరగడుపునే టీ తాగడం అంత ప్రమాదమా ?? నిపుణులేమంటున్నారు ??
ఓం భీమ్ బుష్‌లో సంపంగి దెయ్యంగా నటించింది ఎవరో తెలుసా..?
ఓం భీమ్ బుష్‌లో సంపంగి దెయ్యంగా నటించింది ఎవరో తెలుసా..?
ప్రభాస్‌ 35లక్షల విరాళం ఇచ్చినట్టుగా ప్రకటించిన డైరెక్టర్‌ మారుతి
ప్రభాస్‌ 35లక్షల విరాళం ఇచ్చినట్టుగా ప్రకటించిన డైరెక్టర్‌ మారుతి