AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆరోగ్య సేతు యాప్ లో లోపాలున్నాయన్న హ్యాకర్.. ఖండించిన కేంద్రం

కరోనా పై ప్రజలను అప్రమత్తం చేసేందుకు ప్రభుత్వం తెచ్చిన ‘ఆరోగ్య సేతు’ యాప్ పై క్రమంగా అనుమానపు నీలి నీడలు పరచుకుంటున్నాయి. ఈ యాప్ లో ఎన్నో లోపాలు ఉన్నాయని, ఇది 90 మిలియన్ల మంది భారతీయుల ప్రైవసీకి ముప్పు కలిగించేదిగా ఉందని ఓ హ్యాకర్ పేర్కొన్నాడు. తనను ఇలియట్ ఆల్డర్సన్ అని చెప్పుకున్న ఇతగాడు ఈ యాప్ వల్ల తీవ్రమైన సెక్యూరిటీ సమస్యలు ఉత్పన్నమవుతాయని అన్నాడు. ఫ్రెంచ్ ‘వైట్ హ్యాట్’ అనే నిక్ నేమ్ తో […]

ఆరోగ్య సేతు యాప్ లో లోపాలున్నాయన్న హ్యాకర్.. ఖండించిన కేంద్రం
Umakanth Rao
| Edited By: |

Updated on: May 06, 2020 | 11:01 AM

Share

కరోనా పై ప్రజలను అప్రమత్తం చేసేందుకు ప్రభుత్వం తెచ్చిన ‘ఆరోగ్య సేతు’ యాప్ పై క్రమంగా అనుమానపు నీలి నీడలు పరచుకుంటున్నాయి. ఈ యాప్ లో ఎన్నో లోపాలు ఉన్నాయని, ఇది 90 మిలియన్ల మంది భారతీయుల ప్రైవసీకి ముప్పు కలిగించేదిగా ఉందని ఓ హ్యాకర్ పేర్కొన్నాడు. తనను ఇలియట్ ఆల్డర్సన్ అని చెప్పుకున్న ఇతగాడు ఈ యాప్ వల్ల తీవ్రమైన సెక్యూరిటీ సమస్యలు ఉత్పన్నమవుతాయని అన్నాడు. ఫ్రెంచ్ ‘వైట్ హ్యాట్’ అనే నిక్ నేమ్ తో ఈ వ్యక్తి వరుసగా ట్వీట్లు చేశాడు. దీని విషయంలో కేంద్రం తనను ప్రైవేటుగా కాంటాక్ట్ చేయాలనీ, తనకు సహనం చాలా తక్కువని పేర్కొన్నాడు. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్, నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ నన్ను కాంటాక్ట్ చేశాయి. ఈ యాప్ లోని లోపాల  విషయంలో మీరు సరిగా స్పందించకపోతే ఈ లోపాల  గురించి పబ్లిక్ గా బహిర్గతం చేస్తా అని కూడా ఈ హ్యాకర్ హెచ్చరించాడు. ఓ డెడ్ లైన్ కూడా ఇస్తున్నా అన్నాడు. ఈ యాప్ అంశంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు సరైనవే అన్నాడు.

అయితే కేంద్రం మాత్రం ఆరోగ్య సేతు యాప్ లో ఎలాంటి లోపాలు లేవని, ఇది ప్రజల ప్రయివసీకి ఎలాంటి భంగం కలిగించదని స్పష్టం చేసింది.

Follow Us
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పదోన్నతులు..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పదోన్నతులు..
శ్రీరామనవమి రోజున ఈ ఒక్క పని చేయండి.. పెళ్లి యోగం ఖాయం!
శ్రీరామనవమి రోజున ఈ ఒక్క పని చేయండి.. పెళ్లి యోగం ఖాయం!
ఏపీ హైకోర్టు భారీ జాబ్ నోటిఫికేషన్.. పూర్తి వివరాలు తెలుసుకోండి
ఏపీ హైకోర్టు భారీ జాబ్ నోటిఫికేషన్.. పూర్తి వివరాలు తెలుసుకోండి
మంగళవారం సిరిసంపద సీక్రెట్స్: ఏం చేయాలి, ఏం చేయకూడదు
మంగళవారం సిరిసంపద సీక్రెట్స్: ఏం చేయాలి, ఏం చేయకూడదు
కుప్పకూలిన భారీ సైనిక విమానం.. 100 మందికిపైగా మృతి
కుప్పకూలిన భారీ సైనిక విమానం.. 100 మందికిపైగా మృతి
హైదరాబాద్ నగరాన్ని కమ్మేస్తున్న హుక్కా స్మెల్.. యాక్షన్‌లో పోలీసు
హైదరాబాద్ నగరాన్ని కమ్మేస్తున్న హుక్కా స్మెల్.. యాక్షన్‌లో పోలీసు
తెలంగాణలో పెరుగుతున్న టైప్-2 మధుమేహం.. దానికి ఫాస్ట్ ఫుడ్ కారణమా?
తెలంగాణలో పెరుగుతున్న టైప్-2 మధుమేహం.. దానికి ఫాస్ట్ ఫుడ్ కారణమా?
సినిమా-పాలిటిక్స్..తమిళనాట పార్టీ పెట్టని నటుడే లేడు! అలా అయితేనే
సినిమా-పాలిటిక్స్..తమిళనాట పార్టీ పెట్టని నటుడే లేడు! అలా అయితేనే
ఆ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?
ఆ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?
ఆలయం హుండీ లెక్కింపు జరుగుతుండగా కనిపించిన చిత్తు కాగితాలు..
ఆలయం హుండీ లెక్కింపు జరుగుతుండగా కనిపించిన చిత్తు కాగితాలు..