మందుబాబులకు షాక్.. మద్యం షాపులు క్లోజ్..

మద్యం షాపులు ఇలా తెరుచుకున్నాయో లేదో.. అప్పుడే మూతపడ్డాయి. రెండు రోజుల్లోనే రికార్డు స్థాయి అమ్మకాలు జరగడంతో కిక్కు ఎక్కడలేని చిక్కులను తెచ్చిపెట్టింది. ఇక చేసేదేమీ లేక అధికారులు మద్యం దుకాణాలపై మరోసారి నిషేధం విధించారు. దీనితో దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో నేటి నుంచి మద్యం షాపులతో పాటు నిత్యావసరేతర దుకాణాలను కూడా క్లోజ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం మూడోదశ లాక్ డౌన్‌లో కొన్ని మినహాయింపులు ఇవ్వడంతో అన్ని చోట్లా మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. ఇంకేముంది […]

మందుబాబులకు షాక్.. మద్యం షాపులు క్లోజ్..
Follow us

|

Updated on: May 06, 2020 | 11:27 AM

మద్యం షాపులు ఇలా తెరుచుకున్నాయో లేదో.. అప్పుడే మూతపడ్డాయి. రెండు రోజుల్లోనే రికార్డు స్థాయి అమ్మకాలు జరగడంతో కిక్కు ఎక్కడలేని చిక్కులను తెచ్చిపెట్టింది. ఇక చేసేదేమీ లేక అధికారులు మద్యం దుకాణాలపై మరోసారి నిషేధం విధించారు. దీనితో దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో నేటి నుంచి మద్యం షాపులతో పాటు నిత్యావసరేతర దుకాణాలను కూడా క్లోజ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం మూడోదశ లాక్ డౌన్‌లో కొన్ని మినహాయింపులు ఇవ్వడంతో అన్ని చోట్లా మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. ఇంకేముంది 40 రోజులు చుక్కకు దూరంగా ఉన్న మందుబాబులు షాపుల వద్ద బారులు తీరారు.

భౌతిక దూరం, మాస్క్ ధరించడం వంటి రూల్స్‌ను అతిక్రమిస్తూ కరోనాతో మాకేలా భయం అనుకుంటూ ఒక్కసారిగా పెద్దఎత్తున జనాలు గుమిగూడారు. ఇక వారిని కంట్రోల్ చేయడం పోలీసుల వల్ల కాలేదు. ఈ విషయం స్థానిక అధికారుల నుంచి ముంబై మున్సిపల్ కమీషనర్ ప్రవీణ్ పర్దేశికి చేరడంతో వెంటనే షాపులన్నింటిని మూసివేశారు. కేవలం నిత్యావసర వస్తువులు, మెడికల్ షాపులు మాత్రమే తెరచుకుని ఉంటాయని ఆయన పేర్కొన్నారు. కాగా, ముంబైలో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తోంది. అక్కడ తాజాగా 510 కేసులు నమోదు కావడంతో మొత్తం సంఖ్య 9000 దాటిపోయింది. అటు మహారాష్ట్రలో కేసుల సంఖ్య 15,525కు చేరగా మరణాల సంఖ్య 617కు ఎగబాకింది.