తెలుగు రాష్ట్రాల్లో కరోనా…ఏపీలో మళ్లీ 60 కేసులు
తెలుగు రాష్ట్రాలను కరోనా వైరస్ వదలటం లేదు. ఏపీలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది.

తెలుగు రాష్ట్రాలను కరోనా వైరస్ వదలటం లేదు. ఏపీలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. ఏపీలో కొత్తగా మరో 60 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,777కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బుధవారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
ఏలో గడిచిన 24 గంటల్లో 7,782 శాంపిల్స్ పరీక్షించగా.. 60 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్దారణ అయ్యిందని వైద్యాధికారులు తెలిపారు. వీరిలో తూర్పు గోదావరి జిల్లాలో 1, గుంటూరు జిల్లాలో 12, కడప జిల్లాలో 1, కృష్ణా జిల్లాలో 14, కర్నూలు జిల్లాలో 17, విశాఖపట్నం జిల్లాలో 2 కేసులతోపాటుగా కర్ణాటకకి చెందినవి 1, గుజరాత్‌కు చెందినవి 12 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ సమయంలో మిగతా 7 జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.
ఇక, తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య తగ్గముఖం పట్టింది. తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ విడుదల చేసిన లెక్కల ప్రకారం.. మంగళవారం రాష్ట్రంలో కేవలం 11కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనాతో కోలుకొని నిన్న ఒక్కరోజే 43 మంది డిశ్చార్జి అయ్యారు. తాజా లెక్కలతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1096కి చేరింది. వీరిలో కరోనాతో పోరాడుతూ ఇప్పటి వరకు 628 మంది కోలుకోగా.. 29 మరణించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 439 కరోనా యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి.
