AP Vaccination: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఐదేళ్లలోపు చిన్నారుల తల్లులకు త్వరగా వ్యాక్సినేషన్
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ చేస్తోన్న డ్యామేజ్ అంతా, ఇంతా కాదు. ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయి..
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ చేస్తోన్న డ్యామేజ్ అంతా, ఇంతా కాదు. ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయి.. రోడ్డున పడుతున్నారు. ఈ క్రమంలో ఏపీ సర్కార్ అప్రమత్తమైంది. కరోనా థర్డ్ వేవ్ దృష్ట్యా ఐదేళ్లలోపు చిన్నారుల తల్లులకు వ్యాక్సినేషన్ కోసం ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. ఐదేళ్లలోపు చిన్నారుల తల్లుల లిస్ట్ రెడీ చేయాలని వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశించింది. 45 ఏళ్లు దాటినవారికే వ్యాక్సిన్ వేయాలన్న నిబంధన నుంచి వారికి వెసులుబాటు కల్పించింది. ఐదేళ్లలోపు చిన్నారుల తల్లులకు కూడా వ్యాక్సిన్ వేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. వ్యాక్సినేషన్ ముందురోజే ఆశా వర్కర్లు, ఎఎన్‌ఎమ్‌ల ద్వారా టోకెన్లు జారీ చేయనుంది.
వ్యాక్సినేషన్‌పై కేంద్రం కొత్త మార్గదర్శకాలు ఇవే..
దేశ ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తామని చెప్పిన మోదీ సర్కార్.. ఇందుకు సంబంధించి సవరించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల జనాభా, వ్యాధి తీవ్రత, వ్యాక్సినేషన్ పురోగతి అంశాల ఆధారంగా వ్యాక్సిన్ డోసుల పంపిణీ ఉంటుందని మార్గదర్శకాల్లో వెల్లడించింది. వ్యాక్సిన్ వేస్టేజ్ అధికంగా ఉంటే డోసుల పంపిణీపై ప్రతికూల ప్రభావం ఉంటుందని తెలిపింది. తమకు అందిన డోసులను బట్టి.. వ్యాక్సిన్ ప్రాధాన్య క్రమాన్ని నిర్ణయించుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. జూన్ 21 నుంచి ఈ మార్గదర్శకాలు అమలులోకి వస్తాయని తెలిపింది. వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి రాష్ట్రాలకు ముందుగానే సమాచారం అందిస్తామని పేర్కొంది. ప్రైవేటు ఆస్పత్రులకు సంబంధించి వ్యాక్సిన్ ధరను తయారీదారులే నిర్ణయిస్తారని కేంద్రం వెల్లడించింది. ఒక్కో డోసుకు రూ.150కి మించకుండా సర్వీస్ ఛార్జీ వసూలు చేయవచ్చని వివరించింది.
Also Read: అసలే మృగశిర కార్తె.. ఇక జనాలు ఫిష్ తినకుండా ఉంటారా? కిక్కిరిసిన చేపల మార్కెట్లు