AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mrigasira Karthi: అస‌లే మృగశిర కార్తె.. ఇక జ‌నాలు ఫిష్ తిన‌కుండా ఉంటారా? కిక్కిరిసిన చేపల మార్కెట్లు

సాధారణ రోజుల్లోనే చేపల మార్కెట్లు జనంతో కిటకిటలాడుతుంటాయి. అలాంటిది ఓ ప్రత్యేకమైన రోజు చేపలు తింటే రోగాలు నయం అవుతాయంటే...

Mrigasira Karthi: అస‌లే మృగశిర కార్తె.. ఇక జ‌నాలు ఫిష్ తిన‌కుండా ఉంటారా?  కిక్కిరిసిన చేపల మార్కెట్లు
Fish Markects
Ram Naramaneni
|

Updated on: Jun 08, 2021 | 2:55 PM

Share

సాధారణ రోజుల్లోనే చేపల మార్కెట్లు జనంతో కిటకిటలాడుతుంటాయి. అలాంటిది ఓ ప్రత్యేకమైన రోజు చేపలు తింటే రోగాలు నయం అవుతాయంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి.. మృగశిర కార్తె సందర్భంగా హైదరాబాద్‌లో రాంనగర్‌ చేపల మార్కెట్టు ఇసుక వేస్తే రాలనంత జనంతో కిటకిటలాడింది. రాంనగర్‌ చేపల మార్కెట్టే కాకుండా ఇతర మార్కెట్లలోనూ చేపల కోసం జనం ఎగబడ్డారు. మార్కెట్ల‌లో కొనుగోలుదారులు భౌతిక దూరం పాటించ‌క‌పోవ‌డంతో క‌రోనా వ్యాప్తి చెంద‌డానికి ఆస్కారం ఎక్కువ‌గా ఉంద‌ని ప‌లువురు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. పోలీసు సిబ్బంది క‌ట్ట‌డి చేస్తున్నా కొంద‌రు నిబంధ‌న‌లు పాటించడం లేదు. నిబంధ‌న‌లు పాటించ‌ని దుకాణాల‌పై ఇప్ప‌టికే జ‌రిమానా విధించామ‌ని పోలీసులు చెబుతున్నారు.

మృగ‌శిర కార్తె సంద‌ర్భంగా చేప‌లు తింటే ఆస్త‌మా స‌మ‌స్య‌లు ఉన్న వారికి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంద‌నే కార‌ణంతో ఎక్కువ మంది ఇవాళ చేపల కొనుగోళ్ల‌కు తరిలి వచ్చారు. కరోనాపై పోలీసులు అవగాహన కల్పిస్తున్నా లెక్క చేయకుండా చేపల కోసం ఎగబడ్డారు. చేపలు తింటే అస్తమా నయం అవడం ఏమో గానీ జనం రద్దీతో కరోనా మరింత వ్యాపించే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మృగశిర కార్తె రాగానే ఎండల నుంచి ఉపశమం కలుగుతుంది. వాతావరణం చల్లబడటంతో మన శరీరంలో ఉష్ణోగ్రత తగ్గుతుంది. శరీరంలో వేడి పెంచడానికిగానూ మృగశిర కార్తె రోజు నుంచి చేపలు ఎక్కువగా తింటారు. మృగశిర కార్తె రాగానే వర్షాలు ప‌డ‌తాయి. ఆ సమయంలో సీజనల్ వ్యాధులు చుట్టుముడ‌తాయి. రోగ నిరోధక శక్తి తగ్గడం, జీర్ణశక్తి సైతం తగ్గుతుంది. జ్వరం, దగ్గు, ఇతరత్రా సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు మాంసాహారులు చేపలను తింటారు.

అయితే కరోనా లాక్డౌన్ ఎఫెక్ట్ త‌మ‌పై ప‌డింద‌ని చెబుతున్నాడు చేప‌ల వ్యాపారులు. చేపల కొనుగోళ్లు అంతంత మాత్రంగానే జరిగాయని చెబుతున్నారు. మృగశిర కార్తె సందర్భంగా పెద్ద మొత్తంలో చేపలను మార్కెట్‌కు తరలించామ‌ని.. ఆశించిన స్థాయిలో చేపలు అమ్ముడుపోలేద‌ని చెబుతున్నారు.

Also Read : తూర్పుగోదావరి జిల్లాలో ఒంటరి మహిళపై దుండ‌గుల అత్యాచారయత్నం.. ఆమె గ‌ట్టిగా కేక‌లు వేయ‌డంతో

ఆంధ్రప్రదేశ్ లోని ఆ జిల్లాలో బంగారు నిక్షేపాలు.. తవ్వకాలకు రెడీ అవుతున్న ఓ ప్రైవేట్ సంస్థ