తూర్పుగోదావరి జిల్లాలో ఒంటరి మహిళపై దుండ‌గుల అత్యాచారయత్నం.. ఆమె గ‌ట్టిగా కేక‌లు వేయ‌డంతో

తూర్పు గోదావరి జిల్లాలో దారుణం చోటు చేసుకంది. ఓ వివాహితపై నలుగురు యవకులు అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. వీరిలో ఇద్దరు మైనర్‌ బాలురు

తూర్పుగోదావరి జిల్లాలో ఒంటరి మహిళపై దుండ‌గుల అత్యాచారయత్నం.. ఆమె గ‌ట్టిగా కేక‌లు వేయ‌డంతో
rape attempt
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 08, 2021 | 2:32 PM

తూర్పు గోదావరి జిల్లాలో దారుణం చోటు చేసుకంది. ఓ వివాహితపై నలుగురు యవకులు అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. వీరిలో ఇద్దరు మైనర్‌ బాలురు కూడా ఉన్నారు. రాయవరం మండలంలోని ఓ గ్రామంలో మహిళ చిన్నారులతో కలిసి నివసిస్తోంది. ఆమె ఒంటరిగా ఉంటుందని తెలుసుకున్న నలుగురు యువకులు ఆమెపై అత్యాచారం చేయాలని అనుకున్నారు. సోమవారం రాత్రి  ఆమె ఇంటికి వెళ్లారు. నలుగురూ అత్యాచారయత్నం చేశారు.  మహిళ కేకలు వేయడంతో అక్కడినుంచి పారిపోయేందుకు యత్నించారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు… అక్కడికక్కడే ముగ్గురు యువకులను పట్టుకుని చెట్టుకు కట్టేశారు. వారికి దేహశుద్ధి చేశారు. మరో యువకుడు పరారీలో ఉన్నాడు. బర్త్‌ డే వేడుకల పేరుతో పీకల దాకా మద్యం తాగి ఈ ఘాతుకానికి పూనుకున్నారు. మద్యం మత్తులో వివాహిత మహిళ పై నలుగురు యువకులు కన్నేశారు. మాయమాటలు చెప్పి అత్యాచారయత్నానికి పాల్పడ్డారు.  స్థానికుల ఫిర్యాదుతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న యువకుడి గాలిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఒంట‌రిగా నివ‌శిస్తోన్న మ‌హిళ‌పై ఈ త‌ర‌హా అఘాయిత్యానికి య‌త్నించిన నిందితుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Also Read: చిత్తూరు జిల్లాలో పాల‘కూట’ విషం.. విచ్చల విడిగా కల్తీపాల తయారీ.. ఇందులో కలిపే రసాయనాలు ఏంటో తెలిస్తే షాక్..!

ఓ ఇంజనీర్ లీలలు.. పెళ్లి పేరిట 12 మంది యువతులపై లైంగిక వేధింపులు.. ఆ తర్వాత ఏమైందంటే.?